Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

పాపులర్‌ ఉద్యోగాల వెంటే పడకండి!

Business Sakshi User Sakshi Sakshi Time Jun 1, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
radiha01.jpg

భారతీయ ఆర్థిక రంగం (బీఎఫ్‌ఎస్‌ఐ) రాబోయే దశాబ్దంలో అసాధారణ వృద్ధిని నమోదు చేయనుందని, అయితే విద్యార్థులు కేవలం కొన్ని పాపులర్‌ ఉద్యోగాల వెంటే పరుగులు పెడుతూ అపారమైన అవకాశాలను కోల్పోతున్నారని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయ కెరీర్ మార్గాలను వీడి, మార్కెట్లో తీవ్ర ప్రతిభ కొరత ఉన్న సరికొత్త విభాగాలపై దృష్టి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా విద్యార్థులు, విద్యా సంస్థల ప్లేస్‌మెంట్ సెల్స్‌ను ఉద్దేశించి కొన్ని అంశాలు పంచుకున్నారు.

85 శాతం మంది చూపు ఒకే వైపు!

క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో విద్యార్థులు ఇప్పటికీ పాత ఆలోచనలతోనే ఉన్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. ‘మా సంస్థ (ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్)కు వస్తున్న వేలాది ఉద్యోగ దరఖాస్తులను గమనిస్తే.. అందులో దాదాపు 85 శాతం మంది కేవలం ఈక్విటీ రీసెర్చ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ రోల్స్ కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. క్యాంపస్‌ల్లో ఈక్విటీ రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ (ఐబీ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) వంటి వాటిని మాత్రమే అత్యున్నతమైనవిగా చూస్తున్నారు. మిగిలిన విభాగాలను తక్కువ ప్రాధాన్యత కలిగిన (సెకండ్ టైర్) కెరీర్‌లుగా భావిస్తున్నారు. కానీ, ఈ పాత ఆలోచనా విధానం మారాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పారు.

రాబోయే దశాబ్దంలో ఈ రంగాల్లో బూమ్..

పెరుగుతున్న ఆర్థిక సంక్లిష్టతలు, మారుతున్న నియంత్రణల నేపథ్యంలో రాబోయే పదేళ్లలో కొన్ని విభాగాలు తీవ్ర ప్రతిభ కొరతను ఎదుర్కోబోతున్నాయని, అక్కడ పోటీ తక్కువగా ఉండి కెరీర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుందని గుప్తా విశ్లేషించారు. ఆ రంగాలు..

రిస్క్ మేనేజ్‌మెంట్: నియంత్రణ సంస్థల కఠిన నిబంధనలు, కార్పొరేట్ గవర్నెన్స్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఈ విభాగంలో నిపుణులైన ప్రతిభకు డిమాండ్, సప్లై ఎక్కువగా ఉంది.

ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్: ఆధునిక కాలంలో పెట్టుబడి ఉత్పత్తుల రూపకల్పన, మార్కెట్ పొజిషనింగ్, కమ్యూనికేషన్ అనేవి అసలైన పెట్టుబడి నిర్వహణతో సమానంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

డెరివేటివ్స్ ట్రేడింగ్: దేశంలో సరికొత్త ఎస్ఐఎఫ్, హెడ్జ్ ఫండ్‌ ఎకోసిస్టమ్‌ వేగంగా విస్తరిస్తోంది. అయితే దీనికి తగినట్టుగా శిక్షణ పొందిన నిపుణులు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నారు.

ప్రైవేట్ డెట్, మౌలిక సదుపాయాల పెట్టుబడులు: భారతదేశ మౌలిక వసతుల రంగానికి అపారమైన మూలధనం అవసరం. కానీ, ఈ విభాగంలో నిధుల నిర్వహణ చేపట్టే స్పెషలిస్ట్ నిపుణులు చాలా పరిమితంగా ఉన్నారు.

సేల్స్ కెరీర్‌పై ఉన్నది అపోహే!

ఆర్థిక రంగంలో తప్పుగా అర్థం చేసుకున్న, విస్మరించిన విభాగం సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌ అని రాధికా గుప్తా స్పష్టం చేశారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల సమయంలో సేల్స్ పాత్రల కోసం తమకు అసలు దరఖాస్తులు రాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ‘సేల్స్ రంగం వ్యక్తిలో ఒత్తిడిని తట్టుకునే శక్తిని, వ్యాపార చతురతను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన చాలా మంది సీఈఓలు ఒకప్పుడు సేల్స్ లీడర్లుగా పనిచేసినవారే. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో విక్రయ నైపుణ్యాలను ఉపయోగించాల్సిందే’ అని ఆమె పేర్కొన్నారు. గ్లామర్ కోణంలో చూసి ఈ అవకాశాలను వదిలేస్తున్న వారు ఒకే చోట నిలిచిపోతుంటే, ఈ సరికొత్త రంగాలను ఎంచుకున్న కొంతమంది యువత చిన్న వయసులోనే వేగంగా ఎదుగుతూ, భారీగా సంపాదిస్తూ కెరీర్‌లో స్థిరపడుతున్నారని తెలిపారు.

A LinkedIn post I thought would be worth sharing here too.

An honest open letter to placement cells and campuses:

We get thousands of CVs to join us. 85% of them come for one role: equity research / investing.

I am pretty all 85% of these will get these roles. Or that they…

— Radhika Gupta (@iRadhikaGupta) May 31, 2026

విజయానికి మూడు ప్రశ్నలు

యువత తమ కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు గుంపుతో కలిసి పోకుండా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడిలా ఆలోచించాలని ఆమె సలహా ఇచ్చారు. నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అభ్యర్థి తమను తాము ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నారు.

1. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత అవసరమైనది ఏమిటి?

2. ఏ విభాగంలో పోటీ తీవ్రత చాలా తక్కువగా ఉంది?

3. నేను ఏ పనిని సమర్థవంతంగా చేయగలను?

ఈ కోణంలో ఆలోచిస్తే డిమాండ్ ఉండి సరైన సప్లై లేని మార్కెట్లను సులభంగా గుర్తించవచ్చని ఆమె సూచించారు.

ఇదీ చదవండి: ఫిన్‌టెక్‌ సేవల్లోకి ఎల్‌ఐసీ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Investment
BFSI
CAREER
Radhika Gupta
banking
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పేపర్ ఖర్చులు రూ.986.4 కోట్లు.. అగ్రస్థానంలో SBI

పేపర్ ఖర్చులు రూ.986.4 కోట్లు.. అగ్రస్థానంలో SBI

రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా: చిత్రం శీను

రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా: చిత్రం శీను

నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్

నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్

క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!

క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!

నిజమైన వారసత్వం అంటే డబ్బు కాదు!

నిజమైన వారసత్వం అంటే డబ్బు కాదు!

క్యాపిటల్‌ మార్కెట్లపై గురి

క్యాపిటల్‌ మార్కెట్లపై గురి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.