కారు కొనడం చాలా మందికి ఒక పెద్ద నిర్ణయం. బడ్జెట్‌కు సరిపోవాలి.. మైలేజీ బాగుండాలి.. అలాగే నమ్మకమైన బ్రాండ్ కావాలి.. ఇవన్నీ కలిసొస్తేనే సరైన ఎంపిక అవుతుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు ఇంధన వ్యయం తక్కువగా ఉండే కార్లకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు.
భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటనల్లో కనిపించే మైలేజీ గణాంకాలు సాధారణంగా ARAI సర్టిఫైడ్ ఫిగర్స్ కాగా, వాస్తవ పరిస్థితుల్లో అవి కొంత తేడా ఉండవచ్చు. ఇప్పుడు రూ.10 లక్షలలోపు అత్యుత్తమ మైలేజీ ఇచ్చే 10 కార్ల జాబితాను చూద్దాం..