Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

చేతిలో రూ.25 లక్షలు ఉన్నాయ్‌.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

Business Sakshi User Sakshi Sakshi Time May 8, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pradhan_20mantri_20yojana_20vaya_20vandana_20yojana.jpg

నాకు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌)లో రూ.4 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. మూడేళ్ల తర్వాత నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ ఏది?     – ధీరజ్‌ సన్యాల్‌ 



సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ కాల వ్యవధి ఐదేళ్లు. 8 శాతం వార్షిక రాబడిని (హామీతో కూడిన) మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటారు. కానీ డిపాజిట్‌ చేసిన రోజు ఉన్న రేటే ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లే అయినా, ఫారమ్‌–2 సమర్పించడం ద్వారా ముందుగానే ఖాతాను మూసివేయవచ్చు.

కాకపోతే ఇన్వెస్ట్‌ చేసిన కాలవ్యవధి ఆధారంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటికే మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్‌ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది.

మూడేళ్ల తర్వాత మీ డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించి కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు.  



నా వయసు 74 ఏళ్లు. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ త్వరలోనే గడువు తీరి (మెచ్యూరిటీ) రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. నేను ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (ఎంఐఎస్‌)లో పూర్తి స్థాయిలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. – ఎస్‌.అరుణ్‌

 

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రాబడులు మెరుగ్గా ఉండవు. కనుక మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్‌డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్‌ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో మాదిరిగా అస్థిరతలు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌లో ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, ఆర్బిట్రేజ్‌ అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి.

స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్‌ ఎక్కువే ఉంటుంది. అయితే మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలానికి రిస్కీ అని నేను అనుకోను. షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ మరోక ఆప్షన్‌. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్‌సీఎస్‌ఎస్, పీఎంవీవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి కనుక క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడి తీసుకుంటూ ఉంటారు. కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఉన్న వాటిల్లో ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Investment
Senior Citizen
Post Office Schemes
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!

రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.