Apple Big Event iphone15 launch: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు .ప్రతీ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్‌షిప్‌లను లాంచ్‌లపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్అయింది.
రానున్న యాపిల్ బిగ్ ఈవెంట్కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా లీక్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో ,ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్‌ను తేదీని యాపిల్ లీక్‌కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది.తాజా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న లీవ్ తీసుకోవద్దని కంపెనీ తన ఉద్యోగులను కోరినట్టుతెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 7 ఈవెంట్ బుధవారం జరిగినప్పటికీ, ఐఫోన్ ప్రకటనలలో ఎక్కువ భాగం మంగళవారాల్లోనే జరిగాయి. సెప్టెంబరు 13 బుధవారం నాడు వస్తుంది కాబట్టి, ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్కూడా అప్పుడే ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ)

సరఫరా సమస్యల కారణంగా ఐఫోన్ 14 ప్లస్ విక్రయాలు గత ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. 2020లో ఐఫోన్ 12 Pro Max, ఐఫోన్12 mini లాంచింగ్ లేట్ అయింది. ఈ ఏడాది సేల్ కూడా ఐఫోన్ 15 మోడల్‌లు "తీవ్రమైన కొరత" కారణంగా ఆలస్యం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు అన్ని కొత్త మోడళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే, యాపిల్ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?)
Breaking 😍
Apple to launch iPhone 15 series on 13 September, 2023.
USB-C#iPhone15 #USBC #Apple pic.twitter.com/2YPVLTMlbR— Abhishek Yadav (@yabhishekhd) August 4, 2023