Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

బాసులు లేని వర్క్‌ కల్చర్‌

Business Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
work01.jpg

వారంలో 90 గంటలు పని చేయాలంటు ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యయన్‌ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా తాజాగా డెన్మార్క్ వర్క్‌ కల్చర్‌ను అవలంబించడం ద్వారా భారత్‌ ప్రయోజనం పొందే అవకాశం ఉందని సూచించారు.

‘డెన్మార్క్‌లో ఉద్యోగులు మైక్రో మేనేజ్‌మెంట్‌(కింది స్థాయి బాసులు) లేకుండా స్వతంత్రంగా పనిచేస్తారు. వీరు సంవత్సరానికి కనీసం ఐదు వారాల సెలవు, ఆరు నెలల పేరెంటల్ లీవ్ అనుభవించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన పని గంటలు ఎంచుకోవచ్చు. దాంతో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఉద్యోగాలను వీడకుండా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి ఉద్యోగులు అనుభవించే సౌకర్యాలు, స్వయంప్రతిపత్తి కారణంగా చాలా మంది పనిని కొనసాగిస్తారు. కంపెనీ యజమానులు మానసిక ఆరోగ్యానికి, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆకాంక్ష కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు’ అని చెప్పారు.

అసలేం జరిగిందంటే..

ఎల్‌ అండ్‌ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్‌(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.

Why the people in Denmark are happiest about their work practices:
- Employees are trusted to work independently without micromanagement
- Minimum five weeks of vacation and six months of parental leave
- Flexible hours allow time for family and personal life
- Job loss is…

— Harsh Goenka (@hvgoenka) January 16, 2025

వినాశనానికి దారితీస్తుందంటూ ఇప్పటికే స్పందన

సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలపై ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా(Harsh Goenka) గతంలో స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్‌-డ్యూటీ అని.. ‘డే ఆఫ్‌’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ అనేది ఆప్షన్‌ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్‌ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్‌ స్మార్ట్‌ నాట్‌ స్లేవ్‌’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Work
Harsh Goenka
l and t
SN Subramanian
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటే ఇదే కాబోలు.. వైరల్‌ వీడియో

‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటే ఇదే కాబోలు.. వైరల్‌ వీడియో

2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

ధోబీ ఘాట్‌లో కొరియన్‌ పిల్లల పనీ, పాటా :  వైరల్‌ వీడియో

ధోబీ ఘాట్‌లో కొరియన్‌ పిల్లల పనీ, పాటా : వైరల్‌ వీడియో

అతితక్కువ పనిదినాల్లో రెండోస్థానం

అతితక్కువ పనిదినాల్లో రెండోస్థానం

కారిడార్ పనులు వేగంగా పూర్తి చేయాలి: ఆర్వీ కర్ణన్

కారిడార్ పనులు వేగంగా పూర్తి చేయాలి: ఆర్వీ కర్ణన్

హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..!

హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.