Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన!
ADVERTISEMENT 

ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 14, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ysrcp_womens1.jpg

విజయవాడ: వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన’ పై చర్చా వేదిక నిర్వహించారు విజయవాడ వేదికగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి,  ఎమ్మెల్సీ కల‍్పలతారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ భాగ్యలక్ష్యి, పార్టీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం చర్చా వేదికను ప్రారంభించారు

దీనిలో భాగంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘అవినీతి పాలన, అప్పుల ఆంధ్రాగా మారింది ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. మహిళలకు దశ,దిశా లేకుండా పోయింది. 

తొలియేడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళల పై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా?, సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?,సూపర్ సిక్స్ చేసేశాను..ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్లే అని సీఎం చెబుతున్నారు. నాలుక మందం ఎక్కడమేంటి దృశ్యం సినిమా మాదిరి ఒకే విషయాన్ని పదేపదే ఒకే విషయాన్ని చెప్పి నమ్మించాలని చూస్తున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే... ఎగ్గొట్టిన వారిని ఏమనాలి

ఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి గతంలో అమ్మఒడి పై విమర్శలు చేశారు. ఇప్పుడు అవే నిబంధనలు తల్లికి వందనం పథకంలో అమలు చేస్తున్నారు. డ్రాప్ అవుట్స్ ను తగ్గించేందుకు దేశచరిత్రలో తొలిసారి జగన్‌ అమ్మ ఒడిని ప్రవేశపెట్టారు. జగనన్న పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు..కానీ జగనన్న చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. 

ఏడాది కాలంలో మద్యం, గంజాయి,డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం,  గతంలో జగనన్న దిశా యాప్ ను తెచ్చి మహిళలకు రక్షణ కల్పించారు. దిశా చట్టాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు.  అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలిక పై టిడిపి కార్యకర్త ఆరునెలలుగా అత్యాచారం పాల్పడ్డారు’ అని వరుదు కళ్యాణి మండిపడ్డారు.

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు?
రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచనే తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన కూటమి నాయకుల్లో లేదని ధ్వజమెత్తారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. జగనన్న మహిళలకు పెద్ద పీట వేసిన  విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోసారి గుర్తుచేశారు. జగనన్న దిశా యాప్‌ తెస్తే ఆ యాప్‌ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. 

అదే దిశా యాప్‌ను పేరు మాత్రమే మార్చి శక్తి యాప్‌ అని పేరు పెట్టారు. దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే లోకేష్‌ తెలుగు మహిళలందరినీ పోగేసి ఆ ప్రతును తగలబెట్టించారన్నారు. ‘ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు.... ప్రజలను సోమరిపోతులను చేసేస్తున్నారని బురదజల్లారు జగనన్నను విమర్శించి అంతకంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారు. 

ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉన్నా కానీ భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. 40 ఏళ్ల సీనియర్‌నని చెప్పుకునే నాయకుడు అలా చెప్పడమేంటి?, అమ్మఒడి పథకంలో 1000 రూపాయలు పాఠశాలల నిర్వహణకు తీసుకుంటే లోకేష్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికివందనం పథకంలో లోకేష్ రూ. 2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు 

ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారుల పై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?, కులం,మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించాలని జగన్ చెప్పారు. చంద్రబాబుకి...జగన్‌కి ఉన్న తేడా ఇదే. రాష్ట్రం రావణకాష్టంలాగా మారింది.క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం దాల్చారు. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని వనిత డిమాండ్‌ చేశారు. 

 ఏపీఐడీసీ మాజీ చైర్మన్‌ బండి పుణ్యశీల మాట్లాడుతూ.. చంద్రబాబుకి అమరావతిలో ఉన్నవారు మాత్రమే మహిళలుగా కనిపిస్తారని, రాష్ట్రంలో ఉన్న మహిళలు గురించి చంద్రబాబుకు మనం గుర్తుచేయాలని ఎద్దేవా చేశారు. అనని మాటలను వైఎస్సార్‌సీపీకి, సాక్షికి ఆపాదించి నానా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.

మేము మాట్లాడితే బూతులా...? బాబు బ్యాచ్ ని ఏకిపారేసిన పుణ్యశీల

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండా పోయింది. విద్యాశాఖను గాడి తప్పిస్తున్నారు. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డుమీదకు లాగేశారు. టీచర్ల బదిలీల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్కూల్స్ కు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు. జగన్ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చారు’ అని స్పష్టం చేశారు. 

టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారు

తిరుపతి మేయర్‌ శిరీష మాట్లాడుతూ..  ‘ ఆరోగ్యానికి జగన్‌ పెద్దపీట వేశారు. వైద్య విభాగంలో 47 వేల మంది నియామకాలు చేపట్టడం ఒక చరిత్ర. నాడు -నేడులో 16 వేల కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశారు. ఉద్ధానంలో కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. రూ. 750 కోట్లతో ఉద్ధానం ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. డాక్టర్ అవ్వాలనే పేద విద్యార్ధుల కలను నెరవేర్చడానికి వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. మెడికల్ సీట్ల కోసం ప్రభుత్వాలు పోరాడుతుంటాయి. కానీ వచ్చిన మెడికల్ సీట్లను వద్దని చెప్పిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే’ అని ధ్వజమెత్తారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Varudhu Kalyani
Taneti Vanita
YSRCP
Andhra Pradesh
vennupotu dinam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.