వైఎస్సార్సీపీ ధర్నా అప్డేట్స్..
మాజీ ఎంపీ అరెస్ట్..
- ఉరవకొండలో ఉద్రిక్తత
- వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్
- గోరంట్ల మాధవ్‌ను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
- పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
విశ్వేశ్వర రెడ్డి కామెంట్స్....
- పోలీసులకు హైకోర్టు ఉత్తర్వుల కన్నా మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలే ముఖ్యమా?
- మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రైవేటు ఆస్తులపై టీడీపీ నేతల పెత్తనం ఏంటి?
- వేల్పుమడుగులో వైఎస్సార్సీపీ నేతకు చెందిన భూమిపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారు
- పోలీసులు, రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలకడం దుర్మార్గం
- మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం.
ఉరవకొండలో ఉద్రిక్తత
- మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
- ఉరవకొండ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి విశ్వేశ్వరరెడ్డిని ఈడ్చుకెళ్లిన పోలీసులు
- పోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట
- విశ్వేశ్వర రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలకు నిరసనగా నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని విశ్వేశ్వరరెడ్డి తాజాగా వీడియోలో వెల్లడించారు.
అయితే, విడపనల్ మండలం వేల్పుమడుగులో వైఎస్సార్సీపీ నేత గోవింద్‌కు చెందిన 21 ఎకరాల భూమిని ఆలయ భూమిగా టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొంటున్నారని, అయితే ఆ భూమి ప్రైవేటు భూమేనని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఆ భూమికి సంబంధించి హైకోర్టు కూడా వైఎస్సార్సీపీ నేతకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు.
కాగా, మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడి కారణంగా హైకోర్టు ఆదేశాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఉరవకొండలో ధర్నాకు పిలుపునిచ్చినట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.