Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్‌ జగన్‌
ADVERTISEMENT 

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 25, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ys_20jgan.jpg

కడప కార్పొరేటర్లు, ముఖ్య నేతల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

కష్టాలు శాశ్వతం కాదు.. 2027లోనే జమిలి ఎన్నికలు

ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది 

ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసుకునేలా పాలన చేశాం 

చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అని చేతులెత్తేసింది 

ప్రజా సమస్యలపై వారి తరఫున మనం పోరుబాట పట్టాం 

మీ అందరి సహాయ, సహకారాలు కావాలి 

వైఎస్సార్‌ ఘాట్‌లో తండ్రి వైఎస్సార్‌కు ఘన నివాళి 

ఇడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు  

జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనంరెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మనందరం కలిసికట్టుగా పని చేయాలి.     – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సాక్షి ప్రతినిధి, కడప :  ‘ఎన్నికల ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివర్లో జమిలి ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం. ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలుగుతాం. మనం చెప్పింది చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తోంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్‌ సిక్స్‌ అమలు చేశామని వెళ్లగలుగుతారా? వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. 

ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇలా ఇంట్లో ఎవరినీ వదిలి పెట్టకుండా ఆశ పెట్టారు. ఇప్పుడు వారంతా మా డబ్బులు ఏమయ్యాయని అడుగుతున్నారు. అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

కలిసికట్టుగా పని చేద్దాం 
జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. 

దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్‌ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 

మనల్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఇబ్బందులు పెట్టినా, కొంత ఓపిక పట్టండి. మీకు నా తమ్ముడు అవినాష్‌ అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి. తప్పకుండా సాయం చేస్తారు. నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మేము జిల్లాలో చూసుకుంటాం.. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించండంటూ మీరంతా నాకు అండగా ఒక్కతాటిపై నిలవాలి.  
 



ప్రజాపక్షమై గళమెత్తుదాం  
మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందనుకోలేదు. చంద్రబాబు బాదుడే బాదుడులా పాలన సాగిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెన్‌లేదు.. అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోంది. హామీలు, సమస్యలపై ప్రజాపక్షమై గళమెత్తుదాం. ఇప్పటికే రైతు ధర్నా చేశాం. ఈ నెల 27న కరెంట్‌ బిల్లులపై మరో నిరసన కార్యక్రమం చేయనున్నాం. 

జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల తరుఫున మరో కార్యక్రమం చేయాల్సి ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి. సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాను. అన్ని జిల్లాల్లో పర్యటిస్తాను.  

వైఎస్సార్‌కు నివాళులు  
ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి.. మంగళవారం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అరి్పంచారు. అనంతరం వైఎస్‌ కుటుంబ సభ్యులు.. ఓపెన్‌ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్, భారతి దంపతులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మ, వైఎస్‌ ఆనందరెడ్డి, వైఎస్‌ రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబీకులు.. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్‌ యాదవ్, మేయర్‌ సురేష్ బాబు, మాజీ మంత్రి ఎస్‌బీ అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గంగుల బిజేంద్రనాథరెడ్డి, సుదీర్‌రెడ్డి.. వైఎస్‌ అనిల్‌రెడ్డి, వైఎస్‌ సునీల్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
jamili elections
Chandrababu Naidu
promises
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.