Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పట్టా భూములను అటవీ భూములంటారా?: పెద్దిరెడ్డి
ADVERTISEMENT 

పట్టా భూములను అటవీ భూములంటారా?: పెద్దిరెడ్డి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 30, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
peddireddy.jpg

ఈనాడువి దుర్మార్గపు రాతలు

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌.. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు 

అందులో భాగంగానే మాపై భూకబ్జా ఆరోపణలు 

75 ఎకరాల ప్రైవేటు భూమిని 2001లో కొనుగోలు చేశాం 

అది అటవీ భూమి కాదని 1981లోనే డైరెక్టర్‌ ఆఫ్‌ సెటిల్‌మెంట్స్‌ నిర్ధారించింది.. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో రెండుసార్లు రెవెన్యూ, అటవీశాఖల సర్వేలోనూ అదే తేలింది 

ఈనాడు, ఈటీవీపై పరువునష్టం దావా వేస్తాం

తిరుపతి అర్బన్‌: ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. 

ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్‌ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

1981లోనే అవి ప్రైవేట్‌ భూములని నిర్ధారించారు..
నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం. 


తాజాగా పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో కథనాలను వెలువరించారు. ఆ భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్‌ 11న డైరెక్టర్‌ ఆఫ్‌ సెటిల్‌మెంట్స్‌ అధికారి అసదుద్దీన్‌ అహ్మద్‌ ఆర్డర్‌ జారీచేశారు. 

ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీశాఖ నుంచి 27.6.2022న క్లియరెన్స్‌ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్‌ అనుమతులు ఇచ్చారు.  


రెండుసార్లు విచారణ.. అవి ప్రైవేట్‌ భూములే
ఈ భూములపై ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్‌ సర్వే చేసి అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రైవేట్‌ భూమేనని  నిర్ధారించారు. 

అదే వెంకటరమణారెడ్డి 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై ఫిర్యాదు చేశాడు. తిరిగి మరోసారి దీనిపై విచారణ జరిపిన అధికారులు అది ప్రైవేటు భూమి అని మరోసారి నిర్ధారించారు. దీనిపై వెంకటరమణారెడ్డి హైకోర్ట్‌లో కేసు వేయగా డిస్మిస్‌ చేశారు. ఫారెస్ట్‌ గెజిట్‌ 1968లోనే అది పక్కా ప్రైవేటు భూమి అని చూపించారు.


ఆరోపణలకే పవన్‌ పరిమితం..
ఇసుకలో రూ.40 వేల కోట్ల దందా చేశామని, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేశామని, నేపాల్‌లో పట్టుబడిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ముందు మాపై నిరాధార ఆరోపణలు చేశారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? మేం ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు తేలిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను మాపై నెట్టేందుకు యత్నించింది.


భూమి పెరిగిందా..? బుర్ర తరిగిందా?
ఈనాడు ఆరోపణ: భూమి కూడా పిల్లల్ని కంటుందని మీకు తెలుసా? పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రమే అడవి మధ్యలో పట్టా భూములు ఎలా వచ్చాయి?
వాస్తవం: భూమి పెరుగుతూ వచ్చిందనేది శుద్ధ అబద్ధం. సెటిల్‌మెంట్‌ నివేదికే దీనికి నిదర్శనం. అవి ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981లోనే డైరెక్టర్‌ ఆఫ్‌ సెటిల్‌మెంట్స్‌ విభాగం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసిన పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ పశు పోషణతోపాటు మామిడి తోటలను సాగు చేస్తోంది. 

రిజర్వు ఫారెస్టు ఎలాంటి ఆక్రమణలకు గురి కాలేదని 1968 గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కూడా స్పష్టమవుతోంది. అక్కడ 75.74 ఎకరాల  భూములున్నాయని, 30 అడుగుల దారి కూడా ఉందని పేర్కొంది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హ యాంలో రెండుసార్లు ఉమ్మడిగా సర్వే నిర్వహించిన రెవెన్యూ, అటవీశాఖల అధికారులు కూడా అవి ప్రై వేట్‌ భూములేనని నిర్ధారించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యాన్ని సైతం న్యాయస్థానం కొట్టి వేసింది.


ఈనాడు ఆరోపణ: ఎఫ్‌ఎంబీ, ఫెయిర్‌ అడంగల్‌ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్లు ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేశారు? అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది?
» డాక్యుమెంట్‌ నంబర్‌ 2346/2000: విస్తీర్ణం 15 ఎకరాలు
»  డాక్యుమెంట్‌ నంబర్‌ 1/2001: విస్తీర్ణం 10 ఎకరాలు 
»  డాక్యుమెంట్‌ నంబర్‌ 2345/2000: విస్తీర్ణం 11 ఎకరాలు 
»  డాక్యుమెంట్‌ నంబర్‌ 139/2001: విస్తీర్ణం 18.94 ఎకరాలు 
»  డాక్యుమెంట్‌ నంబర్‌ 2347/2000: విస్తీర్ణం 10.80 ఎకరాలు 
» డాక్యుమెంట్‌ నంబర్‌ 2/2001: విస్తీర్ణం 10 ఎకరాలు  
»  మొత్తం విస్తీర్ణం : 75.74 ఎకరాలు
ఈ రిజిస్ట్రేషన్లు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పూర్తయ్యాయి.

ఈనాడు ఆరోపణ: విలాస భవనాలను కట్టుకున్నారు.. ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు నిర్మించుకున్నారు.
వాస్తవం: ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉండటం.. ఎడ్లబండి మాత్రమే వెళ్లేందుకు దారి ఉన్నందున తమకు తారు రోడ్డు కావాలని కోరుతూ రైతులు అటవీశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర అటవీశాఖ ఆమోదంతో రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్‌ అనుమతులు ఇచ్చారు. అయినా పెదిరెడ్డిది కూడా పొలమే కదా? ఆయన కూడా వ్యవసాయం చేయి స్తున్నారు కదా? అది కూడా అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటు చేసుకున్నారు. 

అసలు రామోజీ కుటుంబానికి మించిన విలాస సౌథాలు ఎవరికి మాత్రం ఉంటాయి? దాదాపు వెయ్యి దేశవాళీ ఆవులను సంరక్షిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం వాటి కోసం షెడ్లు నిర్మించింది. స్వతహాగా రైతు కావడం, వ్యవసాయంపై మక్కువతో వయసు మళ్లిన వాటిని కూడా పోషిస్తున్నారు. 

»  టీడీపీ కూటమి సర్కారుకు బాకాగా పనిచేస్తున్న ఈనాడు దినపత్రిక ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విషం చిమ్ముతూ పతాక శీర్షికలతో పేజీలకు పేజీలు తప్పుడు కథనాలను ప్రచురించింది. మార్కెట్‌ విలువ ఎకరా రూ.3 లక్షలు మాత్రమే ఉన్న పట్టా భూములను అటవీ ప్రాంతంగా చిత్రీకరించేందుకు రూ.కోట్ల విలువైన స్థలాన్ని వృథా చేసేందుకు కూడా ఈనాడు వెనుకాడలేదు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
TDP
yellow media
peddireddy ramachandra reddy
Land grab
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.