తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 64,894 మంది స్వామివారిని దర్శించుకోగా 23,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.82 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. నిర్దేశించిన సమయానికే భక్తులు క్యూలోకి వెళ్లాలని టీటీడీ కోరింది.
ADVERTISEMENT
ADVERTISEMENT