Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. బంగారం పంట పండింది
ADVERTISEMENT 

బంగారం పంట పండింది

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 17, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gold.jpg

గోల్డ్‌ బాండ్లు కొన్నవారికి 193 శాతం లాభం 

8 ఏళ్ల క్రితం పెట్టుబడి గ్రాముకు రూ.2,943 

ఇప్పుడు చేతికొచ్చేది రూ.8,600 పైమాటే 

2016–17 సిరీస్‌–4 బాండ్ల ఉపసంహరణ ధర రూ.8,624గా ఖరారు చేసిన ఆర్బీఐ 

కేంద్ర ప్రభుత్వంపై ఊహించని ఆర్థిక భారం

పెట్టుబడి దాదాపు రూ.3 వేలు. చేతికి వస్తున్నది మాత్రం రూ.8,600 పైమాటే. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) 2016–17 సిరీస్‌–4 కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఇప్పుడు ‘బంగారం’పంట పండింది. ఈ నెల 17నాటికి ఎనిమిదేళ్ల గడువు ముగిసే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లకు ఒక్కో గ్రాముకు రిడెమ్షన్‌ (ఉపసంహరణ) ధర రూ.8,624గా నిర్ణయించినట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఒక్కో గ్రాముకు రూ.2,943 చొప్పున ఎస్‌జీబీ సిరీస్‌–4ను 2017 మార్చి 17న జారీ చేశారు. అంటే ఇన్వెస్టర్లు 193 శాతం లాభం అందుకుంటున్నారన్న మాట. దీనికి వడ్డీ అదనం.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్

మొత్తం 146 టన్నులు..
సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం 2015 నవంబర్‌లో ప్రారంభం అయ్యింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్‌ బాండ్స్‌ జారీ అయ్యాయి. వీటి విలువ రూ.72,274 కోట్లు. 2023–24లో ఇన్వెస్టర్లు రూ.27,031 కోట్ల విలువైన 44.34 టన్నుల గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోలు చేశారు. 

2017–2020 మధ్య జారీ అయిన ఎస్‌జీబీలకు ముందస్తు ఉపసంహరణను 2024 జూలై నుంచి ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రభుత్వం 2024 జూలై నుంచి∙ఆరు విడతల ఎస్‌జీబీ మొత్తాలను తిరిగి చెల్లించింది. 61 విడతలు మిగిలి ఉన్నాయి. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది.

సిరీస్‌ల వారీగా ఇలా.. 
గ్రాముకు రూ.3,119 ధరతో 2016 ఆగస్ట్‌ 5న జారీ చేసిన ఎస్‌జీబీ 2016–17 సిరీస్‌–1 గత ఏడాది 2024 ఆగస్ట్‌ తొలి వారంలో రూ.6,938 చొప్పున రిడీమ్‌ అయ్యాయి. గ్రాముకు రూ.3,150 చొప్పున 2016 సెప్టెంబర్‌ 30న జారీ అయిన 2016–17 సిరీస్‌–2 గత ఏడాది సెప్టెంబర్‌ 30న రూ.7,517 ధరతో ఉపసంహరించారు. 

రూ.3,007 ధరతో 2016 నవంబర్‌ 17న జారీ అయిన 2016–17 మూడవ సిరీస్‌ రూ.7,788 చొప్పున 2024 నవంబర్‌ 16న రిడీమ్‌ అయ్యాయి. ఇక గ్రాముకు రూ.2,943 ధరతో జారీ చేసిన నాలుగో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ ఒక్కో గ్రాముకు రూ.8,624 చొప్పున రిడెమ్షన్‌ కానుంది.  

భారంగా మారిన బాండ్లు 
ఎస్‌జీబీ పథకం కథ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. 

గోల్డ్‌ బాండ్స్‌లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం. 

2016–17 సిరీస్‌–1 ఉపసంహరణతో ఇన్వెస్టర్లు 122 శాతం ప్రీమియం అందుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌ ధర తొలిసారిగా 3,000 డాలర్లు దాటిన సంగతి తెలిసిందే. బంగారం పరుగుతో ప్రభుత్వంపై ‘పసిడి బాండ్ల’భారం తీవ్రమైంది.  

రిడెమ్షన్‌ ధర నిర్ణయం ఇలా..  
999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జువెల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించిన ధరల ప్రకారం.. రిడెమ్షన్‌ తేదీ నుంచి గడిచిన మూడు పని దినాల్లో సగటు బంగారం ధరను ఎస్‌జీబీ తుది ఉపసంహరణ ధరగా నిర్ణయిస్తారు.  

ఇదీ పథకం.. 
» కనీస పెట్టుబడి 1 గ్రాము.  
» ఈ బాండ్లు దేశంలో బంగారం ధరతో ముడిపడి ఉంటాయి.  
» వీటికి 8 సంవత్సరాల కాలపరిమితిని పెట్టారు.  
» 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంది.  
» ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 
» 2.5% వడ్డీ కూడా అదనంగా పొందవచ్చు.  
» వడ్డీపై పన్ను విధించబడుతుంది. కానీ మూలధన లాభాల పన్ను లేదు.

ఏమిటీ ఎస్‌జీబీలు..? 
ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. 

పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరు­త్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Gold Bonds
RBI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.