Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. అసెంబ్లీలో టీడీపీ రగడ 
ADVERTISEMENT 

అసెంబ్లీలో టీడీపీ రగడ 

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
assembly.jpg

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు.

అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్‌ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్‌ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.

అచ్చెన్న వెల్‌లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్‌ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్‌పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్‌ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్‌ తీసుకొచ్చి స్పీకర్‌ చెవుల్లో ఊదడం ప్రారంభించారు.

ఇది సరికాదని, స్పీకర్‌ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్‌ వద్దనున్న బెల్‌ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్‌ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు.

దీంతో మార్షల్స్‌ స్పీకర్‌ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్‌ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Legislative Assembly
Telugu Desam Party
ganta srinivasa rao
Tammineni Sitaram
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గంటా ఇమేజ్ డ్యామేజ్, చుక్కలు చూపిస్తున్న అల్లుడు

గంటా ఇమేజ్ డ్యామేజ్, చుక్కలు చూపిస్తున్న అల్లుడు

‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం

‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం

అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు

అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు

వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం

వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం

పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన

పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన

హెరిటేజ్‌ కోసం టీటీడీ పరువు తీస్తారా?

హెరిటేజ్‌ కోసం టీటీడీ పరువు తీస్తారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.