పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ నేతల గూండాగిరి కొనసాగుతోంది. వీరికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. లింగాల మండలం పార్న పల్లి వద్ద ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను టీడీపీ గుండాలు అడ్డుకుంటున్నారు. దీనికితోడు ఏజెంట్ల పత్రాలను చించేస్తున్నా, పోలీసులు చోద్యం చూస్తున్నారు. టీడీపీ నేతలు బయటి వ్యక్తులను భారీగా మోహరించినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు.
కడప జిల్లా పెద్దముడియం మండలం జై. కొట్టాలపల్లిలో ఎంపీపీ స్కూల్లో పోలింగ్ కేంద్రం చుట్టూ టీడీపీ నేతలు మోహరించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు వెనక్కి పంపుతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఏజెంట్స్ బయటకు పంపివేసిస్తూ, పచ్చ మూకలు వారిపై దాడికి యత్నిస్తున్నాయ. తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట ఊరి నుంచి వచ్చిన టిడిపి గుండాలు ఓటర్లను అడ్డుకుంటున పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని పోలీసులు సమక్షంలో కూటమి నేతలు ఓట్లు వేసుకుంటున్నారు.
పల్నాడు జిల్లా గురజాల మండలంలో పల్లెగుంట, గంగవరం, పులిపాడు, దైద ,తేలుకుట్ల, గొట్టిముక్కల,సమాధానం పేట కొత్త అంబాపురం, గోగులపాడు,బోదవాడ, గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలీసులు, తెలుగుదేశం నేతలు బయటకు పంపించేస్తున్నారు. గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ కీలక నేతలను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్లో అక్రమంగా గురజాల సీఐ మురళి నిర్బంధిస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT










