Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ముఖ్యనేత.. ‘ఐకానిక్‌’ మేత
ADVERTISEMENT 

ముఖ్యనేత.. ‘ఐకానిక్‌’ మేత

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 3, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ICONIC-TOWERS.jpg

రాజధాని టెండర్లలో మరో లాలూ‘ఛీ’ పర్వం

ఐకానిక్‌ టవర్లూ సిండి‘కేటు’కే

మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ

2018లో దక్కించుకున్న సంస్థలకే వాటిని మళ్లీ కట్టబెట్టేలా చక్రం తిప్పిన ముఖ్యనేత

ఎన్‌సీసీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థల నుంచి మాత్రమే బిడ్లు

కాంట్రాక్టు విలువ కంటే 4.49, 4.50, 4.57 శాతం అధిక ధరలకు పనులు చేజిక్కించుకున్న సంస్థలు

ఖజానాపై రూ.159 కోట్లకుపైగా భారం

జీఏడీ టవర్‌ నిర్మాణ పనులను రూ.882 కోట్లకు దక్కించుకున్న ఎన్‌సీసీ

జీఎస్టీ, ఇతర పన్నులతో కలిపి జీఏడీ టవర్‌ కాంట్రాక్టు విలువ రూ.1,045.60 కోట్లు

2018లో ఇదే పనులు రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీకి అప్పగింత

టవర్‌–1, 2 పనులను 1,487 కోట్లకు చేజిక్కించుకున్న షాపూర్‌జీ పల్లోంజీ

జీఎస్టీ, ఇతర పన్నులతో కలిపి టవర్‌–1, 2 కాంట్రాక్టు విలువ రూ.1,762.70 కోట్లు

2018లో ఇవే పనులు రూ.932.46 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీకి అప్పగింత

టవర్‌–3, 4 పనులను రూ.1,304 కోట్లకు దక్కించుకున్న ఎల్‌ అండ్‌ టీ

జీఎస్టీ, ఇతర పన్నులతో కలిపి టవర్‌–3, 4 కాంట్రాక్టు విలువ రూ.1,545.70 కోట్లు

2018లో ఇవే పనులను రూ.784.62 కోట్లకు ఎల్‌ అండ్‌ టీకి అప్పగింత

రాజధాని ప్రాంతంలో ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేయడమే కాకుండా.. ఆ పనులను పాత ‘సిండికేట్‌’ సంస్థలకే కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ చక్రం తిప్పారు. అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేయడంతోపాటు పాత కాంట్రాక్టు సంస్థలనే తెరపైకి తెచ్చి.. పోటీదారులు లేకుండా పక్కా వ్యూహ రచన చేశారు. నచ్చిన సంస్థలకే అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి భారీ దోపిడీకి తెరలేపారు. 

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో సిండి‘కేటు’ లాలూ‘ఛీ’ పర్వం ఐకానిక్‌ టవర్ల టెండర్ల సాక్షిగా మరోసారి బట్టబయలైంది. మూడు ప్యాకేజీల కింద ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఆ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే.. 2018లో ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకే ఇప్పుడూ కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ పథకం పన్నారు. తద్వారా పాత సంస్థలకే మూడు ప్యాకేజీలను అధిక (ఎక్సెస్‌) ధరకు కట్టబెడుతూ సీఆర్‌డీఏ సోమవారం ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.159 కోట్ల భారం పడుతుంది. 

ఆ మేరకు ఖజానాను కాంట్రాక్టు సంస్థలకు దోచిపెట్టి నీకింత.. నాకింత అంటూ పంచుకుతినడానికి ముఖ్యనేత సిద్ధమయ్యారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐదు ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌–జెనిసిస్‌ ప్లానర్స్‌–డిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులకు టెండర్లు పిలిచి 2018 ఏప్రిల్‌­లోనే కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన పనులకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. 

మూడు ప్యాకేజీలకూ మూడు సంస్థలే
⇒ సచివాలయం 1, 2 ఐకానిక్‌ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 ఐకానిక్‌ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ ఐకానిక్‌ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. 

⇒ ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకూ ముఖ్యనేత ఏర్పాటుచేసిన సిండికేటులోని ఎన్‌సీసీ, ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. 

⇒ 1, 2 ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన షాపూర్‌జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.70 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో ఇదే షాపూర్‌జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.24 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.


3, 4 ఐకానిక్‌ టవర్లు నిర్మాణంలోనూ ఇలా..
3, 4 ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 4.57 శాతం అధిక ధరకు అంటే రూ.1,304 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ దక్కించుకుంది. 

జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.7 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో ఎల్‌ అండ్‌ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.761.08 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.

జీఏడీ టవర్‌ పనులూ అధిక ధరకే..
జీఏడీ టవర్‌ నిర్మాణ పనులను 4.49 శాతం అధిక ధరకు అంటే రూ.882 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,045.6 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఇదే ఎన్‌సీసీ సంస్థకు సీఆర్‌డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్‌ కాంట్రాక్టు వ్యయం రూ.491.54 కోట్లు పెరిగింది. 

అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలా
ఐకానిక్‌ టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్‌ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే ఐకానిక్‌ టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ఇదే ఐకానిక్‌ టవర్ల పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. 

ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,082.86 కోట్లు పెరిగింది. ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఐకానిక్‌ టవర్ల నిర్మాణాన్ని చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపె­డుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకుతినేలా కుట్ర పన్నడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసిమోపెడు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. 

ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసి సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఐటీ శాఖకు అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
CRDA
Iconic Towers
Tenders
Capital Amaravathi
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.