Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. టార్గెట్‌ జోగి రమేష్!
ADVERTISEMENT 

టార్గెట్‌ జోగి రమేష్!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 14, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
22_2.jpg

చంద్రబాబు ఇంటి వద్ద నాటి నిరసనకు నేడు కక్ష సాధింపు

చట్ట ప్రకారం భూమి కొనుగోలు చేసి విక్రయించిన జోగి కుటుంబం 

అయినా సరే అక్రమ కేసు నమోదు చేసిన టీడీపీ ప్రభుత్వం 

ఇబ్రహీంపట్నం జోగి నివాసంలో వేకువజాము నుంచే ఏసీబీ తనిఖీలు 

జోగి తనయుడిని అరెస్టుచేసి, గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలింపు 

తన కుమారుణ్ణి అన్యాయంగా అరెస్టు చేశారన్న జోగి 

కన్నీటిపర్యంతమైన జోగి సతీమణి 

అక్రమ కేసులపై పోరాడతామన్న వైఎస్సార్‌సీపీ నేతలు 

సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు తెరతీసింది. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసి, దానిని విక్రయించిన వ్యవహారంలో అక్రమ కేసు నమోదు చేసింది. పత్రికల్లో ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేసిన ఓ భూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ కేసు నమోదు చేశారు. జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌తోపాటు, చిన్నాన్న వెంకటేశ్వరరావును నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంతేకాక.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసంలో సోదాలతో పేరుతో హల్‌చల్‌ చేశారు. 

అనంతరం.. జోగి రాజీవ్‌ను ఎలాంటి నోటీసులివ్వకుండానే అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగి సతీమణి శకుంతల.. మా బిడ్డ ఏం పాపం చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం.. ఏసీబీ కార్యాలయం వద్దకు జోగి రమేష్‌ చేరుకుని, అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. 

నిజానికి.. గతంలో టీడీపీ నేతలు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు జోగి రమేష్‌ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. ఆ ఉదంతంతో చంద్రబాబు అతనిపై కక్షగట్టి ఇప్పుడు వేధింపులకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 

ఇక జోగి రమేష్‌ తనయుని అరెస్టు వార్త తెలియగానే వైఎస్సార్‌సీపీ నేతలు పేర్ని నాని, వెలంపల్లి, దేవినేని అవినాష్, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమ ఆరెస్టులపై పోరాడతామని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులన్నీంటిని ఎదుర్కొంటామని చెప్పారు.   

తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు 
ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. ఇందులో జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగాదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వే­యర్‌ దేదీప్య, మండల సర్వేయర్‌ రమేశ్, డిప్యూటీ తహశీల్దార్‌ విజయకుమార్, విజయవాడ రూరల్‌ తహశీల్దారు, నున్న సబ్‌రిజి్రస్టార్‌ ఉన్నారు. సీఐడీ కేసు విచారణలో ఉండగానే ఏసీబీ హడావిడిగా కేసు నమోదు చేయడం గమనార్హం. 

ఇక ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దేదీప్యను విచారించారు. మరోవైపు.. గతంలో చంద్రబాబు ఇంటివద్ద నిరసన చేపట్టిన కేసులో జోగి రమే‹Ùకు మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీచేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొ­న్నారు. ఇక ఈ ఘటనపై విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు పలువురు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. 

 

అక్రమ కేసులపై పోరాటం చేస్తాం
మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారని, అక్రమంగా అరెస్టులు చేస్తారన్నారు. అసలు ఈ కేసులో లీగల్‌ ప్రొసీజర్‌ ఫాలో అయ్యారా? అని ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్‌ను టార్గెట్‌ చేశారన్నారు. చంద్రబాబును నిలదీయకుండా వదలమన్నారు. జోగి రమేష్‌కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు.. కొనుక్కున్న వారు లేరు.. మరి అలాంటప్పుడు జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా? అని ప్రశ్నించారు. 

ఈ తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. నిజానికి అగ్రిగోల్డ్‌ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారని నాని చెప్పారు. జోగి రమేష్‌ సతీమణి మాట్లాడుతూ.. అప్పటి సీఎం జగన్‌గారిని ఉద్దేశించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడడంవల్లే తన భర్త నిరసన తెలపడానికి చంద్రబాబు నివాసానికి వెళ్లారని.. దాన్ని మనసులో పెట్టు­కుని ఇలా వేధిస్తారా? అని ప్రశ్నించారు. 

ఇక రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని, అందుకే బీసీ అయిన జోగి రమేష్‌ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీమంత్రి వెలంపల్లి అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా జోగి రమేష్‌ కుటుంబాన్ని వేధిస్తున్నారని.. తాము పరామర్శకు రావొద్దా అని మాజీమంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అలాగే, జోగి రమేష్‌ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. అందుకే జగన్‌ ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ చెప్పారు. 

14 రోజులపాటు రిమాండ్‌ 
ఇదిలా ఉంటే.. జోగి రాజీవ్, సర్వేయర్‌ రమే‹Ùకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఏసీబీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి హిమబిందు ఎదుట హాజరుపర్చగా ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఈనెల 23వరకు రిమాండ్‌ విధించారు. నిందితుని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.

మా నాన్నపై కక్ష తీర్చుకునేందుకే..
నా తండ్రిపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అక్రమ కేసులు పెట్టారు. ఈనాడులో ప్రకటన చూసే కొన్నాం.. అలాగే, ప్రకటన ఇచ్చే అమ్మాం. ఈ వ్యవహారాన్ని లీగల్‌గానే కోర్టులోనే తేల్చుకుంటాం.       – జోగి రాజీవ్, జోగి రమేష్‌ తనయుడు  

నాపై కక్షతో నా కొడుకుపై కేసు.. 
మా అబ్బాయి మీద కేసు నమోదు చేయడం దుర్మార్గం. చంద్రబాబూ.. నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అటాచ్‌ అయిన అగ్రిగోల్డ్‌ భూములు ఎవరైనా కొంటారా? కావాలనే కక్షతోనే నా కొడుకుని అరెస్టుచేశారు. ఇది బలహీనవర్గాలపైన, గౌడ కులస్తుపైన దాడిగా నేను భావిస్తున్నా. అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పుచేసినట్లు రుజువుచేస్తే ఆత్మహత్య చేసుకుంటాం.  – జోగి రమేష్, మాజీమంత్రి  

ఇద్దరిని అరెస్టు చేశాం 
విజయవాడ రూరల్‌ అంబాపురం గ్రామంలో సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అవ్వా శేషనారాయణకు చెందిన అగ్రిగోల్డ్‌ భూమి కొనుగోలుపై వచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం జోగి రాజీవ్, సర్వేయర్‌ రమే‹Ùలను అరెస్ట్‌చేశాం. ఇందులో ఐదుగురు నిందితులను గుర్తించాం. తదుపరి విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్టుచేస్తాం.  – సౌమ్యలత, ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
Andhra Pradesh
TDP
jogi ramesh
case Registration
YSRCP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.