Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. రెడ్‌బుక్‌ కుట్ర.. ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌
ADVERTISEMENT 

రెడ్‌బుక్‌ కుట్ర.. ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 16, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-7.jpg

నిబంధనలకు విరుద్ధంగా పీఎస్‌ఆర్, కాంతిరాణా, విశాల్‌ గున్నీలపై సర్కారు వేటు

గతంలో న్యాయస్థానం అనుమతితోనే కాదంబరి జత్వానీ అరెస్టు

అయినా అక్రమ అరెస్టు అంటూ సస్పెన్షన్‌

ఒక్క ఆధారం చూపకుండానే కక్షపూరిత చర్యలు

విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన 

ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రధారులుగా విజయవాడ పోలీసులు

క్యాట్‌ను ఆశ్రయించనున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అమలుచేస్తున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు పతాకస్థాయికి చేరుతున్నాయి. ఇందుకోసం పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించేందుకు బరితెగిస్తోంది. అందులో భాగంగానే ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్‌గున్నీలను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ‘వలపు వల(హనీ ట్రాప్‌) వేసి బడా బాబులను బురిడీకొట్టించే కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. 

చంద్రబాబు ప్రభుత్వ కథా,  స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో సాగిన ఈ కక్ష సాధింపు కుట్ర కోసం ఏకంగా న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడమే కాదు.. నిబంధనలనూ తుంగలో తొక్కారు. ఐపీఎస్‌ అధికారు­లకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించకుండానే వారిని సస్పెండ్‌ చేయడంపట్ల పోలీసు వర్గాలు విభ్రాంతి వ్యక్తంచేస్తున్నాయి.

విచారణ అధికారిగా జూనియర్‌ అధికారి..
సాధారణంగా.. ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు వస్తే విచారణకు పాటించాల్సిన నిబంధనలను నిర్భీతిగా చంద్రబాబు సర్కారు ఉల్లంఘించింది. సస్పెన్షన్‌కు గురైన ముగ్గురిలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయుడు డీజీ స్థాయి, కాంతిరాణ ఐజీ స్థాయి, విశాల్‌ గున్నీ డీఐజీ స్థాయి అధికారులు. వారిపై ఫిర్యాదులొస్తే వారికంటే ఉన్నతస్థాయి అధికారినిగానీ సమానస్థాయి అధికారికిగానీ విచారణ బాధ్యతలు అప్పగించాలి. కానీ, వారికంటే జూనియర్‌ అయిన ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న విజయవాడ డీసీపీ స్రవంతి రాయ్‌ను విచారణాధికారిగా నియమించడం గమనార్హం. 

ఆమె కూడా నిబంధనలను పాటించకుండానే విచారణ తంతు ముగించారు. ఫిర్యాదు వచ్చిన ముగ్గురు పోలీసు అధికారులను ఆమె కనీసం సంప్రదించనే లేదు. పైగా వారి నుంచి వివరాలు తెలసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీ వాంగ్మూలాలు నమోదుచేయాలన్న కనీస నిబంధనను కూడా పాటించకపోవడం విడ్డూరం. మరి స్రవంతి ఏ ప్రాతిపదికన విచారణ నిర్వహించారన్నది అంతుబట్టడమే లేదు. ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లుగానే ఆమె ఏకపక్షంగా నివేదిక సమర్పించారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

ఈ వ్యవహారం అంతా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు కనుసన్నల్లోనే సాగినట్లు స్పష్టమవుతోంది. విచారణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించారా లేదా అన్నది డీజీపీ కూడా పరిశీలించనే లేదు. ప్రభుత్వ ‘ముఖ్యనేత’ ఆదేశాల ప్రకారం ఈ ముగ్గుర్ని ఏకపక్షంగా సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇదే కేసులో  ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను కొన్నిరోజుల క్రితమే సస్పెండ్‌ చేశారు.

ఏకపక్షంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు..
పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీలను సస్పెండ్‌ చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్లో అందుకు ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం చూపించలేదు. ముంబై నటి కాదంబరి జత్వానీని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుచేసినందునే సస్పెండ్‌ చేస్తున్నట్లు  తెలిపింది. కానీ, ఆమె అరెస్టు ఎలా అక్రమం అనేందుకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదు. ఎందుకంటే కాదంబరి జత్వానీ అరెస్టు అంశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి విజయవాడ పోలీసు అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారు. అదెలాగంటే..

⇒ విజయవాడ న్యాయస్థానం నుంచి సెర్చ్‌ వారంట్‌ తీసుకుని మరీ పోలీసులు ముంబై వెళ్లారు.
⇒ కాదంబరి జత్వానీని అరెస్టుచేసే విషయాన్ని ముంబై పోలీసులకు ముందుగానే తెలిపారు. వారి సహకారంతో వారి సమక్షంలోనే ఆమెను అరెస్టుచేశారు. 
⇒ అనంతరం కాదంబరి జత్వానీ అరెస్టుకు సంబంధించిన పంచనామా నివేదికను ముంబై న్యాయస్థానానికి సమర్పించారు. 
⇒ దాంతో ఆమె అరెస్టు సక్రమమేనని ముంబై న్యాయస్థానం నిర్ధారించి ఆమెను విజయవాడ తీసుకువెళ్లేందుకు అనుమతినిస్తూ పీటీ వారంట్‌ జారీచేసింది. 
⇒ అనంతరం.. కాదంబరి జత్వానీని విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమె అరెస్టు సక్రమమేనని విజయవాడ న్యాయస్థానం సైతం నిర్ధారించి.. ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలతో సంతృప్తి చెందింది. అందుకే ఆమెకు రిమాండ్‌ విధించింది. 

..ఇలా కాదంబరి జత్వానీ అరెస్టు ప్రక్రియలో అప్పటి విజయవాడ పోలీసులు ఇంతగా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే.. అసలు ఆమె అరెస్టు అక్రమమని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండటం విడ్డూరంగా ఉంది. కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకుండానే అక్రమ అరెస్టని ఏకపక్షంగా ప్రకటించడం ప్రభుత్వ కక్షసాధింపు చర్య తప్పా మరొకటి కాదని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయి.

కాదంబరి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు..
వాస్తవానికి.. వలపు వల (హనీట్రాప్‌) వేసి బడాబాబులను బురిడీ కొట్టించడంతోపాటు కాదంబరి జత్వానిపై అనేక తీవ్రమైన అభియోగాలున్నాయి. తనపై యూపీలో కూడా పలు కేసులు ఉన్నాయని కాదంబరి జత్వానీనే తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇక ఆమె కుక్కల విద్యాసాగర్‌ సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన భూమిని అక్రమంగా విక్రయించేందుకు యత్నించారనడానికి కూడా ఆధారాలున్నాయి. 

డాక్టర్‌ కాకుండానే తనను తాను డాక్టరుగా ఆమె చెప్పుకున్నారు. బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించిన షరతులకు లోబడే తాను ఇబ్రహీంపట్నంలో రెండు నెలలపాటు ఉన్నానని ఆమె తన పిటిషన్‌లోనే అంగీకరించారు. ఆ సమయంలో తమకు సహాయం కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారని కూడా తెలిపారు. అంటే.. అప్పటి విజయవాడ పోలీసులు నిబంధన మేరకే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.

ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రధారులుగా విజయవాడ పోలీసులు.. 
అంతటి నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పోలీసులకు విశిష్ట అతిథిగా మారిపోయారు. ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీలను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్‌ చేసే కుట్ర అమలులో భాగంగా ఆమెకు ప్రభుత్వ అతిథి స్థాయిలో విజయవాడ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. 

నిజానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో  యథేచ్ఛగా సాగుతున్న మహిళలు, బాలికల అత్యాచారాలపై కూడా ఏమాత్రం స్పందించని పోలీసులు కాదంబరి విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించారు. గతంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా తప్పుల తడకగా ఉందని నెలక్రితం పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెతో తాజాగా మరో ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. రెండోసారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

తనను అరెస్టు చేసేందుకు డీసీపీ విశాల్‌ గున్నీని ప్రత్యేక విమానంలో ముంబై పంపించారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, విశాల్‌ గున్నీ తదితరులు సాధారణ విమానంలోనే ముంబై వెళ్లారని.. విమాన టికెట్లు ముందురోజే బుక్‌ చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అంటే.. ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు కుట్రలో విజయవాడ పోలీసులు పాత్రధారులు, భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారన్నది సుస్పష్టం.  ‘వలపు వల’ కేసుకు సంబంధించి నిందితురాలి విషయంలో పోలీసు వ్యవస్థ స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు.

క్యాట్‌ను ఆశ్రయించనున్న ముగ్గురు అధికారులు..
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా తమను సస్పెండ్‌ చేయడంపై పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించాలని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీ భావిస్తున్నట్లు సమాచారం.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Chandrababu Naidu government
TDP
IPS officers
IPS transfer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

వక్ఫ్‌ భూములపై పంజా

వక్ఫ్‌ భూములపై పంజా

రూ.100 కోట్ల రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా

రూ.100 కోట్ల రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం

ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.