Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పబ్లిక్‌ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ADVERTISEMENT 

పబ్లిక్‌ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SUPREME-COURT-AP-2.jpg

బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్‌ దాస్‌లపై ఈడీ కేసుల కొట్టివేత సబబే

తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు 

తెలంగాణ హైకోర్టు సరైన తీర్పే ఇచ్చింది

అనుమతి లేకుండా కేసులు నమోదు చేయడానికి వీల్లేదు

అలాంటి కేసులను విచారణకు స్వీకరించడం సరికాదు

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి అప్పటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్‌ దాస్‌లకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఏఎస్‌ అధికారుల ప్రాసిక్యూ­షన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది. 

ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. అయితే భవిష్యత్తులో వీరి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతినిస్తే అప్పుడు కేసు విచారణకు స్వీకరించాలని ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఈడీకి సూచించింది. అయితే ఈ వెసులుబాటు ప్రతివా­దులైన అధికారులు లేవనెత్తే న్యాయపరమైన అభ్యంతరాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.

విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలవి 
‘ఈడీ ఫిర్యాదులోని అంశాలన్నింటినీ మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇండియా సిమెంట్స్‌కు అదనంగా 10 లక్షల లీటర్ల నీటిని కేటాయించారన్నదే ఆదిత్యనాథ్‌ దాస్‌పై ఉన్న ఆరోపణ. ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమనుకున్నా, నీటి కేటాయింపులు తన విధి నిర్వహణలో భాగంగానే చేశారు. ఇందూ టెక్‌ జోన్‌కు 250 ఎకరాలు కేటాయించారన్నది బీపీ ఆచార్యపై ఉన్న ఆరోపణ. ఇది కూడా నిజమనుకున్నా, ఆ నిర్ణయం కూడా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నదే. వారి విధి నిర్వహణకు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఉంది. 

ఇద్దరు అధికారులు కూడా పబ్లిక్‌ సర్వెంట్‌లే. వీరికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 197(1) వర్తిస్తుంది. ఈ సెక్షన్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కిందకు వచ్చే నేరాలకు సైతం వర్తిస్తుంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలో ఏ నిబంధన కూడా సెక్షన్‌ 197(1)కు విరుద్ధంగా లేదు. అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు, చేపట్టిన చర్యలకు గాను అధికారులను ప్రాసిక్యూట్‌ చేయకుండా ఉండేందుకు ఈ సెక్షన్‌ను తీసుకొచ్చారు. 

అయితే ప్రభుత్వం అనుమతినిస్తే మాత్రం ప్రాసిక్యూట్‌ చేయవచ్చు. అయితే ఈ కేసులో అలా జరగలేదు. అయినప్పటికీ ఈడీ నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం తీసుకుంది. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు. అందువల్లే బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్‌ దాస్‌లపై కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

ఈడీ కేసుల పూర్వాపరాలు
ఇండియా అరబిందో, హెటిరో గ్రూపులకు జడ్చర్ల ఎస్‌ఈజెడ్‌లో 150 ఎకరాల భూమి కేటాయించడంలో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య కీలక పాత్ర పోషించారంటూ ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అలాగే ఇందూ టెక్‌జోన్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంలోనూ ఆచార్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌పై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. 

సీబీఐ చార్జిషీట్‌ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులను కొట్టేస్తున్నట్లు 2019 జనవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ 2019 జూలైలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరిగా గత నెల 15న పూర్తి స్థాయి వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా బుధవారం తన తీర్పును వెలువరించింది. a

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Supreme court of India
YS Jagan Mohan Reddy
Telangana High Court
Enforcement Directorate (ED)
Andhra Pradesh
BP Acharya
Adityanath Das
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.