Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. విత్తనాలు రెడీ
ADVERTISEMENT 

విత్తనాలు రెడీ

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 17, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
seeds.jpg

ఖరీఫ్‌ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు 

పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్‌ 

ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిన వ్యవసాయ శాఖ 

రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ కోసం సబ్సిడీ విత్తనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పచ్చిరొట్ట, వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. గురువారం నుంచే విత్తనాలు కోరే రైతుల వివరాల నమోదు మొదలవగా, 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. జూన్‌ 5వ తేదీ నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండెంట్‌ మేరకు సేకరించిన విత్తనాలను మండల కేంద్రాల్లో నిల్వ చేశారు. 

అయితే.. పోలింగ్‌ ముగిసే వరకు పంపిణీ చేపట్టవద్దంటూ ఈసీ ఆంక్షలు విధించడంతో బ్రేకులు పడ్డాయి. పోలింగ్‌ ప్రక్రియ ముగియటంతో ఈసీ ఆంక్షలు సడలించింది. దీంతో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.కేవీకే, ఏఆర్‌ఎస్‌లలో ఫౌండేషన్, సర్టిఫైడ్‌ సీడ్‌రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), వ్యవసాయ పరిశోధనా స్థానాలు (ఏఆర్‌ఎస్‌) కేంద్రాల్లో 7,941.35 క్వింటాళ్ల వరి, 2,404.50 క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసింది. బ్రీడర్‌ సీడ్‌ కిలో రూ.77.80 చొప్పున, ఫౌండేషన్‌ సీడ్‌ (ఎన్‌డీఎల్‌ఆర్‌7) కిలో రూ.50 చొప్పున, సర్టిఫైడ్, నమ్మదగిన సీడ్‌ (ఎన్‌డీఎల్‌ఆర్‌–7) కిలో రూ.42 చొప్పున ధర నిర్ణయించి అందుబాటులో ఉంచారు. 

బీపీటీ 5204, 2270, 2782, 2595, 2846, 2841, ఎన్‌డీఎల్‌ఆర్‌ 8, ఎంటీయూ 1262, 1271, 1224, ఎంసీయూ103, ఆర్‌జీఎల్‌ 2537 వంటి ఫైన్‌ వెరైటీస్‌కు చెందిన ఫౌండేషన్‌ సీడ్‌ కిలో రూ.45, సర్టిఫైడ్‌ సీడ్‌ కిలో రూ.42, ఇతర వరి రకాల ఫౌండేషన్‌ సీడ్‌ కిలో రూ.40, సర్టిఫైడ్‌ సీడ్‌ కిలో రూ.38 చొప్పున ధర నిర్ణయించి రైతులకు అందుబాటులో ఉంచారు. కనీసం 25–30 కేజీల ప్యాకింగ్‌తో విత్తనం సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

రూ.450 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం
ఖరీఫ్‌ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్దం చేశారు. వీటిలో ప్రధానంగా 2.26 లక్షల క్వింటాళ్లు వరి, 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై చిరుధాన్యాలు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ, నువ్వులు, 30 శాతం సబ్సిడీపై అపరాల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 

వరి విత్తనాలకు మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పరిధిలోని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000, మిషన్‌ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో విత్తన పంపిణీ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రూ.195 కోట్లను సబ్సిడీ రూపంలో భరించనుంది.

ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఖరీఫ్‌ సీజన్‌కు సర్టిఫై చేసిన విత్తనాలను సిద్ధం చేశాం. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీకి చర్యలు చేపట్టాం. ఆర్బీకేల్లో రైతుల రిజిస్ట్రేషన్‌ మొదలైంది. 
– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ సీడ్స్‌

పంపిణీకి విత్తనాలు సిద్ధం
సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనంతో పాటు అవసరం మేరకు ఏపీ సీడ్స్‌ ద్వారా ప్రైవేట్‌ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. – చేవూరు హరికిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kharif
Election Commission of India
Agriculture Department
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్‌ బి’!

ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్‌ బి’!

పొలం.. కదలని హలం!

పొలం.. కదలని హలం!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

ఖరీఫ్‌కు ముందే కష్టాలు!

ఖరీఫ్‌కు ముందే కష్టాలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.