Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. హిడ్మా ఎన్‌కౌంటర్‌.. ‘మోస్ట్‌ వాంటెడ్‌’ మృతి
ADVERTISEMENT 

హిడ్మా ఎన్‌కౌంటర్‌.. ‘మోస్ట్‌ వాంటెడ్‌’ మృతి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 19, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
encounter.jpg

ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ‘మోస్ట్‌ వాంటెడ్‌’ మృతి

హిడ్మా భార్య రాజే, మరో నలుగురు మావోయిస్టులు కూడా..

అల్లూరి జిల్లా నెల్లూరు–ఇజ్జలూరు మధ్య తెల్లవారుజామున ఎదురుకాల్పులు

తప్పించుకున్న మరికొందరి కోసం ముమ్మరంగా కొనసాగుతున్న వేట

నిఘా వర్గాల పక్కా సమాచారంతో గురి పెట్టిన పోలీసు బలగాలు

ఎన్‌కౌంటర్‌ బూటకమని పౌరహక్కుల సంఘం ఆరోపణ

రంపచోడవరం,సాక్షి, అమరావతి: వరుసగా పలువురు అగ్రనేతల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో విలవిలలాడుతున్న మావోయిస్టులకు కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది! రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కమాండర్, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఇన్‌చార్జ్‌హిడ్మాతో పాటు ఆయన భార్య మడకం రాజే అలియాస్‌ రాజక్క, మరో నలుగురు మావోయిస్టులు దేవ్, లక్మల్‌ అలియాస్‌ చైతు, మల్ల అలియాస్‌ మల్లలు, కమ్లూ అలియాస్‌ కమలేశ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు వెల్లడించారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం నెల్లూరు–ఇజ్జలూరు మధ్య అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 6 నుంచి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఏవోబీ సరిహద్దుల్లో వారం రోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఘటన వివరాలను ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ మహేశ్‌ చంద్ర లడ్హా, ఎస్పీ అమిత్‌బర్దర్‌ రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద మీడియాకు వెల్లడించారు. సమావేశంలో రంపచోడవరం ఓఎస్డీ పంకజ్‌కుమార్‌ మీనా, సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ ధర్మప్రకాశ్‌ పాల్గొన్నారు. 

ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పిస్తోలు, రివాల్వర్, సింగిల్‌ బ్యారెల్‌ గన్‌తోపాటు 28 రౌండ్ల ఏకే 47 రైఫిల్స్‌ బుల్లెట్లు, 5 రౌండ్ల పిస్తోలు బుల్లెట్లు, ఖాళీ ఏకే 47, పిస్తోలు షెల్స్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు లడ్హా తెలిపారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 150 నాన్‌ ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, 25 మీటర్ల ఫ్యూజ్‌ వైర్, ఎలక్ట్రికల్‌ వైర్‌ బండిల్, ఏడు కిట్‌ బ్యాగులను కూడా స్వాదీనం చేసుకున్నామన్నారు. మరి కొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు భావిస్తున్నామని, వారి కోసం భద్రతా బలగాల కూంబింగ్‌ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేశారు. పోలీసుల కథనం ప్రకారం ఘటన వివరాలివీ.. 

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తున్న అడిషనల్‌ డీజీపీ  

నిఘా పక్కా సమాచారంతో.. 
ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా జరుగుతున్న పోలీస్‌ కూంబింగ్‌తో కొందరు మావోయిస్టులు ఆంధ్రాలోని మైదాన ప్రాంతం షెల్టర్‌ జోన్‌కు చేరుకోగా మరికొందరు అటవీ ప్రాంతంలోనే ఉన్నారు. గత రెండుమూడు రోజులుగా మావోయిస్టుల కదలికలపై నిఘా విభాగం నుంచి కచ్చితమైన సమాచారం రావడంతో అల్లూరి జిల్లాలో పోలీసులు ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సెర్చ్‌ ఆపరేషన్‌లో ఘటనా స్థలం వద్ద ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టి సుమారు 31 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా మరో 30 మంది కోసం గాలిస్తున్నారు. కాగా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. 

విజయవాడ కానూరులోని న్యూ ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్న భవనంలోకి ప్రవేశిస్తున్న బలగాలు  

ఆదివాసీ నేత.. గెరిల్లా యుద్ధతంత్రం.. 
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన మడివి హిడ్మా 16 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరి అతి తక్కువ సమయంలోనే అగ్రనేతగా ఎదిగాడు. ఆదివాసీ వర్గానికి చెందిన హిడ్మాకు పలు భాషల్లో మంచి పట్టుంది. మావోయిస్టు అగ్రనేత రామన్న సారథ్యంలో గెరిల్లా యుద్ధతంత్రంలో హిడ్మా ఆరితేరారు. 2019లో రామన్న మృతి అనంతరం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టి గెరిల్లా పోరుతో మెరుపు దాడులకు దిగి మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరాడు. పలు దాడులను స్వయంగా పర్యవేక్షించాడు. 



హిడ్మా నేతృత్వంలో 2010 ఏప్రిల్‌లో చింతల్‌నార్‌ వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. 2013లో దర్భా ఘాట్‌లో కాంగ్రెస్‌ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో 30 మంది చనిపోగా.. 2017 బుర్కాపాల్‌ వద్ద మరోసారి మావోయిస్టుల దాడిలో 24 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. ఈ హింసాత్మక ఘటనల వెనకహిడ్మా కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. హిడ్మాను లొంగుబాట పట్టించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ అధికారులు పూవర్తిలో ఉంటున్న ఆయన తల్లి ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. 

కర్రె గుట్టల్లో తృటిలో తప్పించుకుని.. 
ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. కొద్ది నెలల క్రితం హిడ్మా టార్గెట్‌గా కర్రె గుట్టలను చుట్టుముట్టిన పోలీసులు నాలుగు రోజులపాటు భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా తాజాగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం గమనార్హం.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Maoists
Encounter
Madvi Hidma
chattisgarh naxals
naxalism
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.