Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఆవిష్కరణలు, పరిశోధనలకు ఎస్‌బీఐ సహకారం
ADVERTISEMENT 

ఆవిష్కరణలు, పరిశోధనలకు ఎస్‌బీఐ సహకారం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 31, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sbi.jpg

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు కొత్త పంథాలో వినియోగం

ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ బెంగళూరు, ఇతర సంస్థలకు సహకారం

ఏపీలో తొలిసారిగా ఐఐపీఈతో భాగస్వామ్యం

చమురు పరిశోధనలకు సహకారం

రూ.2.50 కోట్లకు ప్రతిపాదనలిచ్చినా.. రూ.4 కోట్లు సాయం

ఎస్‌బీఐ లాభాల్లో 1 శాతం సీఎస్సార్‌ కింద ఎస్‌బీఐ ఫౌండేషన్‌కు

‘సాక్షి’తో ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఎండీ సంజయ్‌ ప్రకాష్‌

సాక్షి, విశాఖపట్నం :  కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధుల్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త పంథాలో వినియోగిస్తోందని, కేవలం విద్య, వైద్యంపైనే కాకుండా.. ఆవిష్క­రణలు, పరిశోధనలకు చేయూత­నిస్తోందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఎస్‌బీఐఎఫ్‌) ఎండీ సంజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. 

ఇక్కడి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ)లో ఎస్‌బీఐఎఫ్‌ సహ­కారంతో ఏర్పాటు చేసిన ఎక్స్‌ఆర్‌డీ ఎనలైటికల్‌ ల్యాబ్‌ని ఆయన ఐఐపీఈ డైరెక్టర్‌ ప్రొ.శాలివాహన్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ ప్రకాష్‌ ‘సాక్షి’తో స్టేట్‌ బ్యాంక్‌ ఫౌండేషన్‌ గురించి పలు విషయాలు వెల్లడించారు.

పరిశోధనలకు ప్రాధాన్యం
కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఎస్‌బీఐ దశాబ్దాలుగా సేవలందిస్తోంది. లాభాల్లో ఒక  శాతం సామాజిక సేవకు కేటాయిస్తున్నాం. గతేడాది రూ.61 వేల కోట్ల లాభాలొచ్చాయి. ఏటా లాభాలు పెరుగు­తున్నకొద్దీ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు పెంచుతున్నాం. ఇప్పటివరకు విద్య, వైద్యం, పర్యా­వరణం, నీటి నిర్వహణ, గ్రామీణాభివృద్ధి తదితర విభాగాల్లో సీఎస్సార్‌ నిధులు వెచ్చించాం. 

కానీ.. దేశ భవిష్య­త్తుకు ఎంతో ముఖ్యమైన పరిశోధ­నలకూ చేయూత­నం­దించాలని నిర్ణయించాం. అదేవిధంగా యువత ఆవిష్కరణలకు ఆర్థికంగా దన్నుగా నిలబడు­తు­న్నాం. ఐదేళ్లుగా ఈ తరహా కార్యక్రమాలు విస్తృతం చేశాం. ఇప్పటికే ఐఐటీ బాంబే, ఐఐఎస్‌సీ బెంగళూరు, సీ–క్యాంప్‌ బెంగ­ళూరు, ఇక్రిశాట్‌ మొదలైన సంస్థలకు సహకారం అందిస్తున్నాం. ఎస్‌బీఐఎఫ్‌ ద్వారా అనేక ఆవిష్కర­ణలు, పరిశోధనలు జరగడం మాకూ గర్వకారణంగానే ఉంది.

ఏపీలో తొలిసారిగా..
అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్‌బీఐఎఫ్‌ సేవలు ప్రముఖ సంస్థలకు అందాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ ఐఐపీఈతో భాగస్వామ్యమయ్యాం. చమురు పరిశోధనలకు ఐఐపీఈకి సహకారం అందించేందుకు ఎక్స్‌ఆర్డీ ల్యాబ్‌ ఏర్పాటు చేశాం. వాస్తవానికి ఇన్‌స్టి­ట్యూట్‌ ఇచ్చిన ప్రతిపాదనలకు ఎవరైనా కొంత తగ్గించి నిధులు కేటాయిస్తారు. 

ఎస్‌బీఐఎఫ్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఈ ల్యాబ్‌ ఏర్పాటుకు రూ. రూ.2.50 కోట్లకు ప్రతిపాదనలిస్తే.. ఎస్‌బీఐఎఫ్‌ మాత్రం రూ.4 కోట్లు అందించింది. ఈ ల్యాబ్‌ మూడేళ్ల పాటు పరిశోధనలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు అవసరమైన చేయూ­తనందిస్తున్నాం.

యువతకూ ప్రోత్సాహం
దేశంలో సామాజిక సేవపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్స్, యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు సాయమందించేందుకు ఎస్‌బీఐఎఫ్‌ ద్వారా ఏటా ఫెలోషిప్‌ ప్రొగ్రామ్‌ అందిస్తున్నాం. స్టేట్‌ బ్యాంక్‌ గ్రూప్‌లోని ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌ ప్రొగ్రామ్‌ పేరుతో దేశంలో సామా­జికంగా మార్పులు తీసుకు­రావడం లక్ష్యంగా ఎస్‌బీఐఎఫ్‌ 2011లో ఈ కార్యక్ర­మా­నికి రూపకల్పన చేసింది. 

దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడ ప్రజలు ఎదుర్కొనే సమస్య­లపై ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ చేయూతనందిస్తున్నాం. ఇప్పటివరకు 27 బ్యాచ్‌లలో 20 రాష్ట్రాలకు చెందిన 250కి పైగా గ్రామాల్లో 580 మంది ఫెలోషిప్‌ చేశారు. ఇలా.. భిన్నమైన ఆలోచనలతో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు ఎస్‌బీఐఎఫ్‌ ప్రోత్సాహమందిస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
SBI
CSR
Sanjay
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.