Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. బలవంతపు భూసేకరణపై కన్నెర్ర
ADVERTISEMENT 

బలవంతపు భూసేకరణపై కన్నెర్ర

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
runway.jpg

కలికవాయ–కందుకూరు మధ్య రన్‌వే విస్తరణ నిర్ణయంపై జనాగ్రహం

‘రన్‌వే మాకొద్దు.. భూసేకరణ వద్దు’ అనే నినాదంతో ఉద్యమానికి తీర్మానం 

ఉద్యమబాట పట్టాలని ప్రకాశం జిల్లా మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ ప్రజల నిర్ణయం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘బలవంతపు భూసేకరణకు అంగీకరించం. రనే వే వద్దు.. భూసేకరణ వద్దు’ అంటూ ప్రకాశం జిల్లా మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ ప్రజలు ఉద్యమబాట ప­ట్టారు. జాతీయ రహదారిపై అత్యవసర సమయా­ల్లో విమానాలు దిగేలా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ నుంచి కందుకూరు మధ్య సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రన్‌వే ఏర్పాటు చేశారు. 

తాజాగా రన్‌వే విస్తరణకు భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా భూసేకరణ కోసం చర్యలు చేపట్టింది. బలవంతపు భూసేకరణపై నాలుగు గ్రామాల ప్రజలు కన్నెర్ర చేశారు. తమ అనుమతి లేకుండా భూముల్ని సేకరిస్తే అంగీకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

భవిష్యత్‌ కార్యాచరణకు ఉద్యమ కమిటీ తీర్మానం 
ఈ అంశంపై మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ గ్రామాల ప్రజలు సింగరాయకొండలోని కాకతీయ కళ్యాణ మండపంలో శనివారం సమావేశమై ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తమ గ్రామాల్లోని భూముల్ని ఇచ్చేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జయంత్‌ బాబు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట ప్రజలను తొక్కుకుంటూ వెళ్తామంటే ఉపేక్షించేది లేదన్నారు. 

జాతీయ రహదారిపై సుమారు 4 కిలోమీటర్ల దూరం రన్‌వే నిర్మించిన అధికారులు మధ్యలో అండర్‌పాస్‌ కానీ, సర్వీసు రోడ్డు కానీ నిర్మించలేదని ధ్వజమెత్తారు. అధికారుల చర్యలతో అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, రన్‌వే నిర్మాణం అడ్డుకోవటానికి అండగా ఉంటామన్నారు. రైతు సంఘం నాయకుడు హనుమారెడ్డి మాట్లాడుతూ.. కరేడులో ఇండోసోల్‌ ప్రాజెక్టుకు వైఎస్సార్‌సీపీ హయాంలో 4 వేల ఎకరాల భూసేకరణ జరపాలని నిర్ణయించగా.. టీడీపీ నాయకులు ఆ ప్రాజెక్టు జగన్‌ బినామీ కంపెనీ అని ఆరోపించారని గుర్తు చేశారు. 

ఇప్పుడు చంద్రబాబు  8 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనిని బట్టి ఇది ఎవరి బినామీ కంపెనీ అని ప్రశ్నించారు. ఇది కేవలం అదానీ కంపెనీ అని, దానికి మద్దతుగా ప్రధాని మోదీ ఉన్నాడని ఆరోపించారు. సింగరాయకొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ.. జనావాసాలు గల ప్రాంతంలో రన్‌వే నిర్మాణం ఆమోదయోగ్యం కాదని, వేరే ప్రాంతంలో నిర్మించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. గ్రామసభ జరగకుండా, గ్రామస్తుల సలహా తీసుకోకుండా భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయడం దారుణమన్నారు. 

గతంలో జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ జరిపారని, భూములిచ్చిన రైతులకు పూర్తిగా నగదు చెల్లించలేదని ఆరోపించారు. తిరిగి భూసేకరణ చేస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రన్‌వేకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో నరాల సుధాకర్, దొడ్డ కరుణాకరరెడ్డి, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిగురుపాటి శేషగిరి, సీఎంఎం నాయకుడు రాము, రైతు సంఘాల నాయకులు, నాలుగు గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Land acquisition
runway
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.