Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం
ADVERTISEMENT 

అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Apr 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cbn.jpg

16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు  

ఇప్పటికి రూ.31 వేల కోట్లు సమీకరించుకున్నాం 

స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలి 

ఏపీకి ఆదాయం లేదు.. రెవెన్యూ లోటు పెరిగిపోతోంది 

పరిస్థితిని అర్థం చేసుకుని ప్రత్యేక సాయం చేయండి   

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా వరల్డ్‌ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ద్వారా ఇప్పటికే రూ.31,000 కోట్లు సమకూరాయన్నారు. ఇంకా సుమారు రూ.47,000 కోట్ల అవసరం ఉందని చెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా ఆధ్వర్యంలోని బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. 

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులన్నీ తెలంగాణకు వెళ్లాయని, ఏపీకి ప్రధాన ఆదాయ వనరే లేదన్నారు. జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయ వనరుల శాతం ఏపీలో తక్కువగా ఉందని, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఆస్తుల పంపకం ఇంకా పూర్తవ్వలే­దని చెప్పుకొచ్చారు. ‘ఏటా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్‌కు అనేక సమస్యలు ఉన్నాయి. 

ఈ కారణంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాం. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫారసులు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని, స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు, పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రత్యేక ప్రజెంటేషన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై వీడియో ప్రదర్శించారు.  

విరివిగా గ్రాంట్లు ఇప్పించండి 
స్వర్ణాంధ్ర–2047 విజన్‌ కింద ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించి.. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించేలా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. వికసిత్‌ భారత్‌ సాధనలో భాగంగా ఆర్థిక సంఘం వర్టికల్‌ డివల్యూషన్‌ వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70 శాతం వెయిటేజీ జనాభాకు, 20 శాతం వెయిటేజీ వ్యవసాయం, అనుబంధ రంగాలకు, 10 శాతం వెయిటేజీ ప్రాంతానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. 

స్థానిక సంస్థల కోసం రూ.62,516 కోట్ల నిధులు, పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కోసం రూ.19,871 కోట్ల గ్రాంట్లు, 2026–2031 మధ్య ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.16,181 కోట్లు కావాల్సి ఉందన్నారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, ఐదు పర్యాటక హబ్‌లు (అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం), ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్‌ సెంటర్, బుద్ధిస్ట్‌ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్‌ క్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్, నాలెడ్జ్‌ ఎకానమీలో భాగమైన క్వాంటమ్‌ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్‌ డెవలప్‌మెంట్, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్, 100 శాతం అక్షరాస్యత, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టులు, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వే లు, రహదారులు, రీజనల్‌ గ్రోత్‌ సెంటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసు చేయాలి’ అని సీఎం కోరారు.

 కాగా, పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ తెలిపారు.     

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Amaravati
Infrastructure
Development
Chandrababu Naidu
finance commission
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.