Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Andhra Pradesh: ఉల్లి రైతు గుల్ల!
ADVERTISEMENT 

Andhra Pradesh: ఉల్లి రైతు గుల్ల!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
onions.jpg

అయినకాడికి పంట అమ్ముకుంటున్న దైన్యం 

మరోపక్క మార్కెట్‌లో పేలుతున్న ధరలు

గిట్టుబాటు ధరలపై గుడ్లప్పగించి చూస్తున్న సర్కారు 

అటు అన్నదాతలకు ఇటు వినియోగదారులకు ఊరట లేదు 

గరిష్టంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడి 

వైఎస్సార్‌ జిల్లాలో సగటున క్వింటా రూ.1,000.. కర్నూలులో సగటున క్వింటాకు రూ.1,500–రూ.3,000 

దళారీల పాలవుతున్న రైతు కష్టం.. 

వేధిస్తున్న కూలీలు, కాటాల కొరత.. 

సరిపడా వాహనాలు లేక రోజుల తరబడి పడిగాపులు 

రోజు విడిచి రోజు క్రయవిక్రయాలకు అనుమతి 

ఫలితంగా టన్నుకు 100 కిలోలు 

నష్టపోతున్న అన్నదాతలు.. గతంలో ఈ దుస్థితి ఎప్పుడూ లేదంటున్న ఉల్లి రైతన్నలు 

ఐదేళ్లలో రికార్డు స్థాయిలో క్వింటా రూ.13 వేలకు పైగా..

సాక్షి, అమరావతి: ఉల్లి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన పంటను దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి రావడం... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో హతాశులవుతున్నారు. 

ఒకపక్క బయట మార్కెట్‌­లో ఉల్లి ధరలు దిగి రావడం లేదు. మరోపక్క రైతన్నలు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నాడు. వెరసి అటు వినియోగ­దా­రులకు ఇటు అన్నదాతలకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి పంటకు పేరుపొందిన కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేక నష్టపోతుంటే వైఎస్సార్‌ కడప జిల్లాలో గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్నారు.

1.72 లక్షల ఎకరాల్లో సాగు..
రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 70 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఒక్క జిల్లాలోనే ఈ ఏడాది 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగైంది. ఆ తర్వాత వైఎస్సార్, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష  వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. 

ఖరీఫ్‌లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఖరీఫ్‌ సీజన్‌లో కర్నూలు, అనంతపురం జిల్లాలలో మినహా మిగిలిన చోట్ల అధిక వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. 

అలాగే ఎన్నడూ లేని విధంగా మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో రైతులు తమకు మంచి ధర వస్తుందని ఆశగా ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగుచేశారు. తీరా పంట మంచిగా ఎదిగే సమయంలో వర్షాభావంతోపాటు భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురై 30 నుంచి 40 శాతం వరకు దెబ్బతిన్నది. 

అయినా మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధర ఉండటంతో మిగిలిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూశారు. పంట చేతికొచ్చే సమయంలో దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండటం, సౌకర్యాల లేమితో మార్కెట్‌కు తీసుకువెళ్లిన పంట దెబ్బతినడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.  


కోతలు మొదలైనప్పటి నుంచి కష్టాలు
కోతకొచ్చిన పంట మార్కెట్‌కు రావడం మొదలైన దగ్గర నుంచి ఉల్లి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన విస్తీర్ణం, దిగుబ­డులను దృష్టిలో పెట్టుకుని సౌక­ర్యాలు కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫల­మైంది. ఈనా­మ్‌లో తలెత్తిన సాంకేతిక సమ­స్యలకు తోడు కాటాలు, కూలీల కొరత ఉల్లి రైతుల ఆశలను దెబ్బతీసింది. కర్నూలు మార్కెట్‌ యార్డుకు రోజుకు 26 వేల క్వింటాళ్ల పంట వస్తుండగా ఆ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి మార్కెట్‌లో పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. 

సర్వర్‌ సమస్యల కారణంగా టెండర్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో టన్నుకు 50–100 కేజీల వరకు ఉల్లి దెబ్బతినడంతో ఆ మేరకు నష్టపోయారు. కర్నూలు యార్డు పరిధిలో ఈ సీజన్‌లో గరిష్టంగా క్వింటాకు రూ.4,300 ధర లభించగా, సగటున రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున ధర లభించింది.

రోజు విడిచి రోజు విక్రయాలు
ఈనామ్‌లో సాంకేతిక సమస్యను అధిగ­మించేందుకు వారం పట్టింది.  అదేవిధంగా వాహనాలు, కాటా­లు సమ­కూ­ర్చ­లేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చు­కునేందుకు రోజు విడిచి రోజు ఉల్లి విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వైఎస్సార్‌ జిల్లా­లో 15 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగ­వు­తోంది. వర్షాల వల్ల పంట దెబ్బతింది. క్వాలిటీ లేదనే సాకుతో ఇక్కడ క్వింటాకు గరిష్టంగా రూ.1,500 ధర లభించగా, సగటున రూ.వెయ్యికి మించి దక్కడం లేదు.

ఉల్లి రైతుకు అండగా జగన్‌ సర్కారు
ఒక జిల్లాలో ఒక పంట పథకం కింద ఉల్లి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 25 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీ యుటిలిటీ కేంద్రాలను నిర్మించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 600కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి ఉత్పత్తిదారుల సంఘాలకు 75% సబ్సిడీతో సోలార్‌ పాలీ డ్రయర్లు, వాహనాలు, 50%  సబ్సిడీపై ఉల్లి డీ టాపింగ్‌ మిషన్లు, ఉల్లి సీడ్‌ డిబ్లర్స్‌తో 40%  సబ్సిడీపై సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్లను గత ప్రభుత్వం సమకూర్చింది. 

దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధర ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంది. ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్‌ మార్కెట్‌ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా అండగా నిలిచింది. 

గత ప్రభుత్వ హయాంలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.13 వేలకు పైగా ధర లభించింది. కిలో రూ.2 నుంచి రూ.4 మించి ధర లేని సమయంలో కిలో రూ.6 నుంచి రూ.10 మధ్య ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ లెక్కన టన్నుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా వెచ్చించింది. ఇలా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా,  2014–19 మధ్య టీడీపీ హయాంలో కేవలం రూ.6.38 కోట్లు వెచ్చించి 4,900 టన్నుల ఉల్లిని మాత్రమే కొన్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Onion farmers
TDP government
Government of Andhra Pradesh
YS Jagan Mark Governance
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.