Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఊసర‘ఉల్లి’ బాబు!
ADVERTISEMENT 

ఊసర‘ఉల్లి’ బాబు!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 3, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Onion-farmer.jpg

ఉల్లి రైతును ఆదుకోవడంలో చెప్పేదొకటి.. చేసేదొకటి 

ప్రతి ఎకరాకు రూ.20వేలు పరిహారం అని ప్రకటించి గరిష్టంగా ఐదు ఎకరాలకే అంటూ కోత 

రూ.పదివేలకు కుదించిన వైనం 

8,205 ఎకరాలకు రాష్ట్రం ఇచ్చేది ఎకరాకు రూ.పదివేలే  

మిగిలిన రూ.10 వేలు కేంద్రం ఇస్తుందని తప్పించుకునే ఎత్తుగడ  

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లి రైతును చంద్రబాబు సర్కారు అడుగడుగునా దగా చేస్తోంది. పదేపదే హామీలు ఇస్తూ వాటిని అమలు చేయకుండా నాలుక మడతేసి ఏమారుస్తోంది. గతంలో మద్దతు ధర అంటూ మాయ చేసిన చంద్రబాబు ఆ తర్వాత ప్రతి ఎకరాకు రూ.20వేలు నష్టపరిహారం అంటూ మాట మార్చి, ఇప్పుడు దాని విషయంలోనూ రైతులను మోసం చేశారు. గరిష్టంగా ఐదు ఎకరాలకే అంటూ విస్తీర్ణంలో కోత పెట్టారు. అందులోనూ 8,205 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలే ఇస్తుందని, మిగతాది కేంద్రం ఇస్తుందని తప్పించుకునే ఎత్తుగడ వేశారు. శనివారం నుంచి పరిహారం పంపిణీకి సిద్ధమైన నేపథ్యంలో సర్కారు మోసాలపై ఉల్లిరైతులు లబోదిబోమంటున్నారు.  

మద్దతు ధర అంటూ తొలుత హడావుడి 
తొలుత ఉల్లిగడ్డలను మద్దతు ధర రూ.1200తో కొంటామని హడావుడి చేసిన సర్కారు ఆ తంతును మున్నాళ్ల ముచ్చటగా ముగించింది. ఇందులోనూ కొందరికి రూ.400 కోత పెట్టింది. 2025 జూలై, ఆగస్టుల్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఓ దశలో క్వింటా ఉల్లికి రూ.50 మాత్రమే పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం రూ.1200 మద్దతు ధరతో కొంటామని ప్రకటించింది. 2025 ఆగస్టు 30న మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినా.. సెప్టెంబర్‌ 20వరకు మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా 9,020 టన్నుల ఉల్లిని సర్కారు కొన్నది. ఇందులో 6,776 టన్నులకు మాత్రమే రూ.1200 మద్దతు ధర  ఇచ్చింది. 2244 టన్నులకు నాణ్యత లేదనే సాకుతో రూ.800లు మాత్రమే చెల్లించింది.  

మద్దతు ధర పోయే..  పరిహారమూ సగమే.. 
ఆ తర్వాత మళ్లీ మద్దతు ధర స్థానంలో ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించింది. పెట్టిన పెట్టుబడిని చూస్తే ఈ మొత్తం గిట్టుబాటు కాదని రైతులు చెప్పినా సర్కారు చెవికెక్కించుకోలేదు. ఆ తర్వాత పరిహారం విషయంలోనూ నాలుక మడతేసింది. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాలకే( 2 హెక్టార్లు) అంటూ మెలిక పెట్టింది. దీంతో 3,650 ఎకరాలకు పరిహారం లేకుండా పోయింది. 5 ఎకరాల వరకు అని లోపాయికారిగా నిబంధన పెట్టడం వల్ల రైతులు రూ.7.30 కోట్లు నష్టపోయారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఖరీఫ్‌లో 61,660 ఎకరాల్లో ఉల్లి సాగయింది. ఇందులో 3949.8 ఎకరాల్లో పండించిన ఉల్లిని మార్క్‌ఫెడ్‌ మద్దతు ధరతో కొనుగోలు చేసింది.

మిగిలిన దానిలో 54,061 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తోంది. వెరసి 58,010 ఎకరాలకు లబ్ధి చేకూరుతోందని సర్కారు చెబుతోంది. ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం 45,856 ఎకరాలకే రూ.20 వేలు పరిహారం లభిస్తుంది. మిగిలిన 8,205 ఎకరాలకు చెందిన 6,222 మంది రైతులకు రూ.10 వేల చొప్పునే పరిహారం ఇస్తామని గమనార్హం. 8,205 ఎకరాల్లో  ఎకరాకు రాష్ట్రం రూ.10 వేలు, కేంద్రం టాపప్‌ సబ్సిడీ కింద రూ.10 వేలు చెల్లిస్తుందని సర్కారు చెబుతోంది. మరి ఇది ఏ మేరకు అమలవుతుందోనని రైతులు పెదవి విరుస్తున్నారు.  

నేడు పరిహారం పంపిణీకి శ్రీకారం 
సీఎం చంద్రబాబు గత ఏడాది సెప్టెంబరు 18న ఉల్లి సాగు చేసిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రకటించినా.. ఆదుకోవడంలో తీవ్ర జాప్యం చేశారు. అనేక  కోతల అనంతరం ఉల్లి రైతులకు పరిహారం పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ నెల 3న శ్రీకారం చుట్టనున్నారు. అయితే 2022 ఏప్రిల్‌ వరకు కర్నూలు జిల్లాలో భాగమైన నంద్యాల జిల్లాకు పరిహారం చెల్లించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉల్లి రైతులకు పరిహారం కింద సర్కారు రూ.128.33 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కర్నూలు జిల్లాలో 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో 6,400 మంది రైతులకు రూ.28.41 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి కోడుమూరులో పరిహారం పంపిణీని నిర్వహించనున్నారు.  

మద్దతు ధరేదీ బాబూ..!
ఈ చిత్రంలో కనిపించే ఉల్లి రైతు పేరు కే.పెద్ద దస్తగిరి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎస్‌.లింగందిన్నె స్వగ్రామం. 2025 ఖరీఫ్‌లో రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాడు. సెప్టెంబర్‌ 15న కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మద్దతు ధర రూ.1200 ప్రకారం  120 క్వింటాళ్లు అమ్మాడు. వ్యాపారులు క్వింటాను రూ.75కు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1200 మద్దతు ధర హామీ ప్రకారం.. వ్యాపారులు చెల్లించిన రూ.75 మినహాయించి మిగిలిన రూ.1,125 చొప్పున 120 క్వింటాళ్లకు రూ.1,35,000 ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా చెల్లించాల్సి ఉంది. కానీ ఇంతవరకు సర్కారు నుంచి చిల్లిగవ్వ అందలేదు. కర్నూలు జిల్లాలో ఇలాంటి రైతులు 1113 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి సర్కారు రూ.7.53 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Onion farmer
Chandrababu Naidu
Andhra Pradesh
minimum support price
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.