Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పండుటాకులకు ఎంత కష్టమో..
ADVERTISEMENT 

పండుటాకులకు ఎంత కష్టమో..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 5, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
333.jpg

వరద ముంపులో వృద్ధాశ్రమాలు 

సహాయం కోసం ఆర్తిగా ఎదురుచూపులు 

పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు 

వరద ముంపు నుంచి బయట పడుతున్న మరికొందరు   

సాక్షి బృందం, విజయవాడ: అసలే అంతా 70 ఏళ్లపైబడిన వృద్ధులు. అయిన వారి ఆదరణ కోల్పోయి వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అకస్మాత్తుగా విజయవాడను ముంచెత్తిన వరదతో వారంతా ఒక్కసారిగా వణికిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నడుములోతు నీరు. ఎటూ కదలలేని స్థితి. చేసేదిలేక ప్రాణాలు అర­చేతబెట్టుకుని ఒకరివద్దకు ఒకరు చేరుకున్నారు. చే­యి, చేయి పట్టుకుని ఓదార్చుకుంటూ ఒకరికొకరు సహా­యం అందించుకున్నారు.

ఊతకర్రల సహాయంతో ఆశ్ర­మం భవనం ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. తిండి లేక, మంచి నీరు లేక, కాలకృత్యాలు తీర్చుకునే దారిలేక నానా అవస్థలు పడ్డారు. మూడు రోజుల తర్వాత బుధవారం కాస్త నీరు తగ్గడంతో వారు మెల్లగా కిందకిదిగారు. ఇప్పటికీ వరద నీరు ఆశ్రమంలో ఉండటంతో ఎలాగోలా మంచాలపైకి చేరి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. సహాయం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు.    

అంటు వ్యాధుల భయం.. 
రాజీవ్‌ నగర్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వృద్ధాశ్రమంలో 20 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొంతమంది కొన్నాళ్లుగా మంచానికే పరిమితమై ఉన్నారు. ఆదివారం ఉదయం వృద్ధాశ్రమంలోకి నీరు చేరడంతో వారంతా భవనం పైకి వెళ్లి తలదాచుకున్నారు. దాదాపు ముప్పై ఆరు గంటల తర్వాత కిందికి దిగినప్పటికీ ఆశ్రమంలో వరద నీరు ఉండడంతో ఒక్కో మంచంపై మూడు పరుపులు వేసి ఎత్తుగా ఏర్పాటు చేసి వాటిపై ఎలాగోలా విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా మిగిలిన వారు అంటు వ్యాధులు ప్రబలుతాయోమోనని భయపడుతున్నారు.   

మాతృదేవోభవ వృద్ధాశ్రమంలోనూ 
వాంబేకాలనీలోని మాతృదేవోభవ వృద్ధాశ్రమం భవనం పూర్తిగా ముంపునకు గురైంది. అకస్మాత్తుగా వ చ్చిన వరదతో కనీసం రోడ్డు మీదకు కాలు పెట్టలేకపోయామని నిర్వాహకురాలు ఎం.దుర్గ చెప్పారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 35 మంది వృద్ధులను ఎక్కడికీ తీసుకెళ్లలేకపోయామన్నారు. మొదటి రోజు మధ్యాహ్నం వరకు ఫోన్లు పని చేశాయని, అప్పుడే సాయం కోసం ఎంతో మంది అధికారులకు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీంతో డాబా పైనే ఓ టార్పాలిన్‌తో తాత్కాలిక గుడిసెలా ఏర్పాటు చేసి వారందరినీ అక్కడ ఉంచామన్నారు. వారం క్రితం రూ. 2 లక్షల ఖరీదు చేసే నిత్యావసర సరుకులు తీసుకొచ్చానని, వాటిలో కొన్ని వరదకు కొట్టుకుపోగా, మిగిలినవి నీటిలో నాని ఎందుకు పనికిరాకుండా పోయాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కనీసం ఇటు వైపు కన్నెత్తయినా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   

చరమాంకంలో చెప్పలేనంత కష్టం.. 
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు వరద ముంపు కారణంగా నానా అవస్థలు పడ్డారు. వరద నీటిని దాటి బయటకు వెళ్లలేక, నీట మునిగిన ఇంటిలో ఉండలేక, సమయానికి అన్న పానీయాలు అందక అగచాట్లు చవిచూశారు. ఇప్పుడు వరద నీరు కాస్త తగ్గడంతో కుటుంబ సభ్యుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. సింగ్‌నగర్, కేఎల్‌రావు నగర్, ఊర్మిళానగర్‌ ప్రాంతాల్లో వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 

బంధువుల భుజాల ఊతంతో బయటకు వస్తున్నవారు కొందరైతే,« థర్మా కోల్, లారీ ట్యూబుల సాయంతో ఒడ్డుకు చేరుతున్నవారు మరికొందరు పలు చోట్ల కనిపించారు. ప్రశాంతంగా బతకాల్సిన వయసులో చెప్పలేనంత కష్టంతో వారు ఇబ్బంది పడుతున్నారు. 

మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు.. 
సింగ్‌నగర్‌ ప్రాంతంలో గత 15 ఏళ్లుగా ఉంటున్నాం. ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదు. వరద నీరు చేరడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. మూడు రోజుల పాటు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూశాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మర బోట్లు ఏర్పాటు చేశారని వినటమేగానీ ఒక్కటీ కానరాలేదు. శారీరక బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న నేను ప్రాణాలు కాపాడుకునేందుకు చేతి కర్రతో నడుము లోతు నీళ్లలో నడిచి ఒడ్డుకు చేరారు.  – జె.వెంకటేశ్వరరావు, సింగ్‌నగర్‌  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Old Age Home
Andhra Pradesh
floods
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.