Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అవే గొప్పలు.. అదే విద్వేషం
ADVERTISEMENT 

అవే గొప్పలు.. అదే విద్వేషం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 28, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mahanadu.jpg

మహానాడు ఆద్యంతం ఆత్మస్తుతి, పరనిందే 

వైఎస్‌ జగన్‌పై, గత ప్రభుత్వంపై అభాండాలకే అధిక ప్రాధాన్యత 

చంద్రబాబు మొదలు నేతలందరి మాటల్లోనూ విషం  

లోకేశ్‌ ఆరు శాసనాలపై శ్రేణుల పెదవి విరుపు 

సూపర్‌ సిక్స్‌ ఉండగా ఇవెందుకని సందేహం 

ఏడాదిలో చేసిందేమీలేక సొంత డబ్బాకే పరిమితం 

ఒక్కటంటే ఒక్కటి చేశామని ధైర్యంగా చెప్పలేకపోయిన చంద్రబాబు

పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి ఆవేశపూరిత ప్రసంగం 

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్ర­బాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది. 

సూపర్‌ సిక్స్‌ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజ­యాలు సాధించామని లేనివి ఉన్నట్లు  మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్‌ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. 

సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్‌తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్‌ సిక్స్‌ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు. 

ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్‌ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.  

గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషం
చంద్రబాబు, లోకేశ్, టీడీపీ  నేతలంతా గత ప్రభు త్వం, జగన్‌ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్‌ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రా­నికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్ర­హింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతు­న్నట్లు అర్థమవుతోంది. 

పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.

తండ్రీ కొడుకులపై పొగడ్తలు 
ఎన్టీఆర్‌ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్‌ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్‌ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.


‘మహా’కష్టాలు
» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు
» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట 
» పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం 
» నిర్వాహకులపై బాబు సీరియస్‌   
» మీడియాపై లోకేశ్‌ ఆంక్షలు  
సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్‌: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్‌ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. 

‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్‌ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం.  మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్‌ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్‌ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్‌ చేయాలంటూ ఆదేశించారు. 

ఎవరైనా కెమెరా ఆన్‌ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్‌  మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్‌చాట్‌ నిర్వహించి వెళ్లిపోయారు.  ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్‌లు ఇచ్చా­రు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగ­రాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్‌ కేసులు రిమ్స్‌లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Mahanadu
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
lokesh
TDP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.