Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఎస్సై రాత పరీక్ష ఫలితాలపై స్టే ఎత్తివేత
ADVERTISEMENT 

ఎస్సై రాత పరీక్ష ఫలితాలపై స్టే ఎత్తివేత

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 6, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hc.jpg

సాక్షి, అమరావతి: ఎస్సై అభ్యర్థుల ‘ఎత్తు’ వివాదం కీలక మలుపు తిరిగింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తమ ‘ఎత్తు’ను సరిగా కొలవ­లేదంటూ పలువురు అభ్యర్థులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎస్సై రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై సింగిల్‌ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది.

మంగళవారం కోర్టు హాలులో నిర్వ­హిం­చిన ఎత్తు పరీక్ష ఫలితాలు, రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు గతంలో నిర్వహించిన ఫలితా­లతో సరిపోలడంతో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు­పై ఆరోపణలు చేస్తూ కోర్టుకొచ్చిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి.. కోర్టు ముందుంచడంపైనా మండిపడింది.

ఈ పత్రాల యథార్థతపై దర్యాప్తు చేయాలని గుంటూరు ఐజీ పాలరాజును ఆదేశించింది. ఆ వైద్యు­లను విచారించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ గుహనాథన్‌ నరేంద్ర, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ధర్మాసనం మంగళ­వారం ఉత్తర్వులు జారీ చేసింది.



ఎత్తు, ఛాతీ కొలతలపై వివాదం

ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దేహ­దారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతీ చుట్టుకొల­తను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరు­గొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టు­లో పిటిషన్‌ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్‌లో ఎత్తు విషయంలో అర్హులుగా ప్రకటించిన తమను తాజా నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు.

వాదనలు విన్న సింగిల్‌ జడ్జి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు  సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశాయి.

దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్‌ నరేంద్ర ధర్మాసనం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే రూ.లక్ష జరి­మానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్‌ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. 



రూ.లక్ష చొప్పున కట్టాల్సిందే

కాగా.. న్యాయస్థానంలో కొలతలకు హాజరైన అభ్య­ర్థులు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుపై తాము చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే రూ.లక్ష జరిమా­నా చెల్లిస్తామని రాసిచ్చిన నేపథ్యంలో ఆ మొత్తం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. తమకు అంత స్థోమత లేదని కొందరు అభ్యర్థులు చెప్పడంతో.. కోర్టు అంటే తమాషాగా ఉందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. రూ.లక్ష చొప్పున చెల్లించాల్సిందేనని.. లేదంటే జైలుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. 

న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌పై ఆగ్రహం

మంగళవారం న్యాయస్థానంలోనే అభ్య­ర్థుల ఎత్తును ధర్మాసనం కొలిపించింది. పోలీ­స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కొలతలు సరిగానే ఉన్నా­యని స్పష్టం చేసింది. అభ్య­ర్థుల తరఫు న్యా­య­వాది జడా శ్రవణ్‌కుమార్‌ స్పందిస్తూ.. పిటిషనర్లు నిబంధనల ప్రకారం ఉండాల్సినంత ఎత్తు ఉన్నా­రని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు.

వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నవ్వుతూ కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టునే శంకిస్తారా? అంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు అంటే నవ్వులాటగా ఉందా అంటూ శ్రవణ్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తేలిగ్గా తీసుకుంటే పర్యవ­సానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Police
Recruitment
Andhra Pradesh High Court
shravan kumar
Sub Inspector of Police (SI)
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

 హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన

మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’

మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.