Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘బాబు.. ప్రజల జీవితాలను లాటరీ బతుకులుగా మార్చకుంటే అదే పదివేలు’
ADVERTISEMENT 

‘బాబు.. ప్రజల జీవితాలను లాటరీ బతుకులుగా మార్చకుంటే అదే పదివేలు’

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 27, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babu.jpg

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేసిన తప్పే పదే పదే చేస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన మంచేమిటో చెప్పుకునే బదులు గత సీఎం జగన్‌పై విమర్శలు ఎక్కువపెట్టేందుకు వృథా ప్రయాస పడుతున్నారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యల ద్వారా తమకే నష్టం జరుగుతోందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలలను మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారం నుంచి ‍ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. వైన్‌షాపులకు అనుబంధంగా పర్మిట్‌ రూములకు అనుమతివ్వడం రాష్ట్రవ్యాప్తంగా వేలాది బెల్ట్‌షాపులకు తెరెత్తడం ఈ కూటమి ప్రభుత్వం ఘనతే. 

ఏరకంగా చూసినా ఇవేవీ ప్రజలకు మేలు చేసేవి కానేకావు. కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఎన్నికల్లో జగన్‌ ఓటమిని చూపుతున్నారు. రాజకీయ ఓటమిని నరకాసుర వధతో పోలుస్తున్నారు. పోనీ ఇదే కొలమానం అనుకుందాం. అప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే టీడీపీ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయింది. అంత రాక్షసంగా పాలించారు కాబట్టే ఓడియామని చంద్రబాబు ఒప్పుకుంటారా? 

చంద్రబాబు కుమారుడు, సకలశాఖల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్న లోకేశ్‌ జీవితాంతం తానే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాలన్న ఆశ ఉండటాన్ని తప్పు పట్టలేము కానీ.. అందుకు రాక్షసపాలనను, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని మార్గంగా మార్చుకుంటే మాత్రం భంగపడక తప్పదు. ఎడాదిన్నర కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్‌ మీడియాకు చెందిన పలువురిపై అక్రమంగా కేసులు బనాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. తాజాగా కందుకూరు సమీపంలోని దారకంపాడు వద్ద లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని వాహనంతో ఢీకొట్టి హత్య చేశారన్న కథనం కూటమి ఏలుబడిలో శాంతి భద్రతల పరిస్థితికి దర్పణం. కారణాలేవైనా ఈ కేసులో ఆరోపణలపై పోలీసులు సకాలంలో నిస్పాక్షికంగా విచారించి ఉంటే ఇంత పెద్ద సమస్య అయ్యేదే కాదు. 

రెండు కులాల మధ్య చిచ్చు రేగేది కాదు. కాపు సంఘాల నేతలు ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు దిగాల్సిన పరిస్థితిని కూడా నివారించి ఉండవచ్చు. ఈ వ్యవహారంలో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. ఎందుకు గోప్యంగా ఉంచారూ అన్నది!కొన్ని నెలల క్రితం ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైతే చంద్రబాబుతోసహా పలువురు మంత్రులు, టీడీసీ నేతలు హుటాహుటిన అక్కడకు తరలివెళ్లారు. 

మద్యం,  భూ మాఫియాలలో భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలున్నా, పార్టీలోని వర్గ విభేదాలే హత్యకు కారణమన్న అంచనా ఉన్నా వీరందరూ హడావుడి చేశారు. మరి లక్ష్మీనాయుడి కేసు విషయానికి వచ్చేసరికి అంతా మారిపోయింది.హత్య జరిగితే రోడ్డు  ప్రమాదంగా చిత్రించే యత్నం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, జనసేనాభిమాని హత్యకు గురయ్యారని తెలిసినా ఎందుకు పరామర్శించలేదు?! అధికారాన్ని అనుభవించాలన్న పవన్‌ కళ్యాణ్‌ బలహీనతను టీడీపీ బాగానే వాడుకుంటుందన్న ఆరోపణలు ఇందుకే వచ్చేది. 

హోం మంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు అక్కడకు అసలు విషయం పక్కనబెట్టి వైసీపీపై విమర్శలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి తప్పేమి లేకపోతే హత్యకు గురైన లక్ష్మీ నాయుడు కుటుంబానికి ఎందుకని ఆర్థికసాయం, భూమి కేటాయింపు ప్రకటించారు? ఈ రకంగా సాయం చేయడాన్ని టీడీపీ మద్దతుదారైన మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా తప్పు పట్టారే! కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు టీడీపీ, జనసేనలు అచ్చంగా కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టేవి. ఎక్కడైనా దేవాలయంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడకు వాలిపోయి మత రాజకీయాలు చేశారు.

 విశాఖపట్నంలో తాగి గొడవ చేస్తున్న ఒక డాక్టర్‌ను పోలీసు కానిస్టేబుల్‌ అరస్ట్‌ చేస్తే దళిత డాక్టర్ అంటూ కుల రాజకీయం చేసింది టీడీపీ కాదా? అతను అనారోగ్యంతో మరణించినా వైసీపీ కారణమంటూ అన్యాయంగా ప్రచారం చేశారే. పల్నాడులో చంద్రయ్య అనే వ్యక్తి వ్యక్తిగత తగాదాలో మరణిస్తే వెంటనే బీసీ నాయకుడిని చంపుతారా అంటూ చంద్రబాబు అక్కడికి వెళ్లి పాడే మోశారు. అది కుల రాజకీయమా? శవ రాజకీయమా? అంతేకాక చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి  కూటమి ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెరలేపింది. అందువల్లే ఇప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదన్న డిమాండ్ వచ్చింది.

ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణిస్తే ప్రభుత్వం ఎందుకు 11 కోట్లు ఖర్చు చేసి సంస్మరణ సభ పెట్టింది? ఇలాంటి పలు అంశాలను ఏబీ వెంకటేశ్వర రావు ఎందుకు ప్రశ్నించలేదని కాపు సంఘం నేత దాసరి రాము నిలదీశారు. కాపు సంఘాలు జోక్యం చేసుకుని తీవ్రంగా స్పందించి ఉండకపోతే ప్రభుత్వం ఈ మాత్రం అయినా కదిలేదా అన్నది వారి ప్రశ్న. కాపు సంఘాలు ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లిన తర్వాతే వైసీపీకి చెందిన కాపు నేతలు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. తొలుత గొడవ జరిగింది టీడీపీ, జనసేనల వారి మధ్యే అన్నది నిజమా? కాదా? కొందరు  జనసేన కార్యకర్తలు టీడీపీ వారి నుంచి ఎదురవుతున్న సమస్యలు, దౌర్జన్యాల గురించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు  చేస్తున్నారు.

కులపరమైన  విభేదాలు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ ఒక ప్రకటన ఇచ్చినప్పటికి, కాపు సంఘాలు నేరుగా కులాల పేర్లు చెప్పి ఆరోపణలు చేసినా ,ఎలాంటి చర్య  తీసుకోలేదు. అంటే ఎక్కడ జనసేన కార్యకర్తలు మరింతగా రెచ్చిపోతారో అన్న భయం, కాపులు ఇంకా దూరమవుతున్నారన్న ఆందోళన ప్రభుత్వానికి రావడమే కారణం కాదా? అదే వైసీపీ వారు ముందుగా వెళ్లి ఉంటే పోలీసులు ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో! ఇదే సందర్భంలో శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించడానికి చేసిన ప్రయత్నాలపై కూడా ప్రభుత్వం ఏ చర్య తీసుకోకపోవడాన్ని జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు. 

అలాంటప్పుడు ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? మంచికి మద్దతు ఇవ్వాలని కోరినంత మాత్రాన జరుగుతున్న  ఘటనలు ప్రజల దృష్టికి రాకుండా పోతాయా? కూటమి సర్కార్ ఎంత మంచిగా పనిచేస్తున్నది వారి ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. తాము లంచాలు వసూలు చేయకపోతే పనులు చేయలేమని చెప్పే ఎమ్మెల్యే ఒకరు, పదవులను అమ్ముకుంటున్నారని చెప్పే మరో ఎమ్మెల్యే.. కొందరు మంత్రులు దందాలు చేస్తున్నారని, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు వసూల్ రాజాలుగా మారారని ఎల్లో మీడియానే  రాసిన కధనాలు, ఇసుక,మద్యంలలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని వచ్చిన  వార్తలు చూశాక ఇది మంచి ప్రభుత్వం అని ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు ఎంత చెప్పినా జనం అంగీకరిస్తారా? మరో సంగతి చెప్పాలి.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే లూలూ గ్రూప్ విశాఖ, విజయవాడ, మల్లవల్లిలలో కారు చౌక లీజుతో ప్రభుత్వ భూములను దక్కించుకుంది. అయితే ఇదే లూలూ గ్రూప్ గుజరాత్‌లో మాత్రం రూ.519 కోట్లు పెట్టి భూమి ఖరీదు చేసి మాల్‌ పెట్టుకుంటోంది. ఇలాంటి చర్యలకు జనం మద్దతు ఎందుకు? చంద్రబాబు, టీడీపీలు ముందుగా తన ఇంటిని సర్దుకున్న తరువాత వైసీపీపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది కాని, తమ తప్పులన్నిటిని, వైసీపీకి అంటకట్టే ప్రయత్నం చేస్తే సరిపోతుందనుకుంటే ఎల్లవేళలా సాధ్యపడదు. వైకుంఠపాళిలో  గవ్వలతో పావులు కదుపుతున్నట్లుగా, ఏపీ ప్రజల జీవితాలను లాటరీ బతుకులుగా చంద్రబాబు ప్రభుత్వం  మార్చకుండా ఉంటే అదే పదివేలు.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
permit room
wine shops
TDP
Andhra Pradesh
Pawan Kalyan
kommineni Srinivasa Rao
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.