Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’!
ADVERTISEMENT 

ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 16, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CBN_0.jpg

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలను పిచ్చోళ్లుగా, ఏమీ ప్రశ్నించలేని అశక్తులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ఇసుక విషయంలో కూటమి ప్రభుత్వం అందరి కళ్లముందే భారీ మోసానికి పాల్పడే ధైర్యం చేస్తూండటంతో! అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతూంటే ఇప్పటికే ఉచిత ఇసుకను ప్రజలకు దూరం చేసేశారు. తాజాగా ఇసుక రీచ్‌లను ప్రైవేట్‌ వారికి అప్పగించేస్తున్నారు. మరీ ఇంత మోసమా?. 

ఇసుక ఉచితంగా దొరక్కపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారని భవన నిర్మాణం రంగం కుదేలైందని ఇదే కూటమి నేతలు జగన్‌ హయాంలో పెడబొబ్బలు పెట్టిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలిక్కడ. ఇలాంటి కట్టుకథలు, మాయమాటలు చెప్పి... తాము అధికారంలోకి వస్తే అంతా ఫ్రీ అంటూ హామీలతో ఊదరగొట్టారు కూడా. ప్రజలు కూడా బహుశా.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు దగ్గరుండి మరీ ఇసుక తవ్వించి ఉచితంగా పంపిణీ చేస్తారు కాబోలు అనుకున్నారు అప్పట్లో. పైసా ఖర్చు లేకుండా ఇళ్ల వద్దకే ఇసుక వస్తుందని భ్రమపడ్డారు. బాబు, పవన్‌ల మాటలు అమాయక ఆంధ్రులు సంబరపడ్డారు.  మాటిచ్చి... తూచ్‌ మనడంలో చంద్రబాబు దిట్ట అన్నది మాత్రం మరచిపోయారు. 

ఏదైతేనేం... టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల సందర్భంగా కలిసికట్టుగా మేనిఫెస్టోనైతే ప్రకటించాయి. మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించినా ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీకి కూడా బాధ్యత ప్పకుండా ఉంటుంది. అయితే ఏదో ఒకలా కూటమి అధికారంలోకైతే వచ్చింది కానీ.. అప్పటి నుంచే ఒక్కటొక్కటిగా హామీలకు తిలోదకాలు ఇవ్వడమూ మొదలైంది. ఈ క్రమంలో తాజా అంకమే ఉచిత ఇసుక మాటను ఉట్టికెక్కించడం!

వాస్తవానికి ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ఇసుక కోసం నానా అగచాట్లూ పడుతున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం మొత్తమ్మీద ప్రజల అవసరాల కోసం ఏకంగా 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేసి ఉంచారు కానీ.. అధికారంలోకి వచ్చీ రాగానే కూటమి నేతలు ఈ ఇసుక నిల్వలతో అయినకాడికి బొక్కేశారు. ప్రజలకేమైనా ఇచ్చారా? ఊహూ అస్సలు లేదు. ముక్కు పిండి మరీ వసూలు చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలు సొంత జేబుల్లో నింపుకున్నారు. నిల్వలు కరిగిపోవడంతో ఇసుక దొరకడమే గగనమైంది. ఒకానొక సందర్బంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘‘ఎవరు కావాలంటే వారు ఇసుక తవ్వుకుని తెచ్చుకోవచ్చు’’ అన్నారు కూడా. టీడీపీ నేతలు స్టాక్‌పాయింట్ల వద్ద పెత్తనం చెలాయిస్తూ ప్రజలను నిలువుగా దోపిడీ చేశారు. 

పోనీ ప్రభుత్వమైనా ఉచితంగా ఇస్తున్నదా అంటే అదీ లేదు. సీనరేజీ, జీఎస్టీల పేరుతో పెద్ద మొత్తాల్లోనీ ఫీజులు వసూలు చేస్తోంది. లారీ లోడింగ్  ఖర్చుల సంగతి సరేసరి. జగన్ అధికారంలో ఉండగా అవసరమైన వారికి అవసరమైనంత ఇసుక హేతుబద్దమైన రేటుకు దొరికేది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. ఇప్పుడు మాత్రం హళ్లికి హళ్లి... సున్నకు సున్నా! గతం కంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి. 

మొత్తానికే ఎసరు..
ఇసుక ఉచితంగా లభించడాన్ని విజయవంతంగా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎకాఎకి మొత్తం పథకానికి మంగళం పాడేందుకు స్కెచ్ వేసినట్టు ఉంది. నదులలోని 108 ఇసుక రీచ్‌లను గంపగుత్తగా ప్రైవేట్‌ వారికి అప్పగించేలా గుట్టుచప్పుడు కాకుండా నిర్ణయం చేశారు. వీటి ద్వారా డబ్బై లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తారట. అంతేకాదు...రెండు రోజులలోనే ఈ వ్యవహారం మొత్తాన్ని చక్కబెట్టేయాలన్నది ప్లాన్‌! టెండర్లు పిలవడం, కేటాయింపులు అన్నీ అన్నమాట! సహజంగానే టీడీపీ వారికే టెండర్లు దక్కే ఏర్పాట్లు ఉంటాయి దీంట్లో! సాధారణంగా టెండర్లలో పాల్గొనేందుకు అందరికీ అవకాశం కల్పిస్తూ కొంత సమయం ఇస్తారు. అలా కాకుండా రెండు రోజుల వ్యవధి మాత్రమే పెట్టడంతోనే ఇందులోని మతలబు ఏమిటన్నది తెలిసిపోతోంది. 

ఇసుక రీచ్‌లు ప్రైవేట్‌ వారికి అప్పగిస్తే వారు అక్రమంగా అమ్మకాలు జరపకుండా ఉంటారా? ఇసుక ఉచిత సరఫరా ఎలాగో చెప్పకుండా, విధి, విధానాలను నిర్ణయించకుండా  హడావుడిగా టెండర్లు ఏమిటో? ప్రైవేటు వ్యక్తులు ఇసుక తవ్వి ప్రభుత్వానికి అందచేస్తే ,అధికారులు ఉచితంగా ఇస్తారా? లేక ప్రైవేటు వ్యక్తులు తమ రీచ్‌లలో ఇసుక తీసుకుని అమ్ముకునే స్వేచ్చ ఉంటుందా? మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అయితే ప్రైవేటు వ్యక్తులు ఇసుకను అమ్ముకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం వేరే స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినా, అక్కడ ఇసుక ఎంతవరకు ఉంటుంది? మొత్తం రీచ్ లన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్లాక, ప్రభుత్వం ఎక్కడ నుంచి ఇసుక తెచ్చి ఉచితంగా ఇస్తుంది?. 


ఇప్పటికే టీడీపీ నేతలు అనేక రీచ్‌లను దౌర్జన్యంగా ఆక్రమించారని వార్తలు  వస్తున్నాయి. ఇతరులు ఎవరైనా పొరపాటున బిడ్ పొంది రీచ్ కు వెళితే, టీడీపీ నేతలు వారిని బెదిరించి పంపించి వేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఒక టీడీపీ నేత బెదిరింపుల వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి  జగన్  చంద్రబాబు ప్రభుత్వంపై పలు  ప్రశ్నలు సంధించారు. తమ హయాంలో ఏడాదికి రూ.700 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ప్రజలకు రెండు, మూడు రెట్ల భారం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇదే తరహాలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇసుక పాలసీ ప్రకటించకుండా దొంగచాటుగా టెండర్లు ఏమిటని ఆయన ధ్వజమెత్తారు.  

వైఎస్‌ జగన్ టైమ్‌లో మొదటి మూడు నెలలు తప్ప, ఆ తర్వాత పుష్కలంగా ఇసుక దొరికినా, ఇసుక లభ్యం కావడం లేదని, లేదా ఎక్కువ ధర పెట్టవలసి వస్తోందటూ మొసలి కన్నీరు కార్చిన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా, ఇప్పుడు ఇసుక ధరలు రెట్టింపైనా అంతా బాగుందన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాయి. చంద్రబాబు  ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మోస్తూ, భజన చేస్తూ ప్రజలను మభ్య పెట్టడంలో ఎల్లో మీడియా విశేషంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈనాడు మీడియా ఇసుక సమస్యకు ఎలా కవరింగ్ ఇచ్చిందో  చూడండి. ఆ పత్రికలో  'రీచ్ లలోను కొనుగోళ్లు" అని హెడింగ్ పెట్టి, అదేదో కొత్త సదుపాయం క్రియేట్ చేస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. 

ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే రీచ్ లకు అనుమతులు ఇస్తారని, ఎవరైనా ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలకే  విక్రయించాలని అసలు గుట్టు విప్పారు. అంతే  తప్ప కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ  హామీకి విరుద్ధంగా ఇసుక బేరసారాలు పెట్టారని ఈనాడు మీడియా రాయలేదు.  కూటమి మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి తూట్లు పొడిచారని పేర్కొనలేదు. చంద్రబాబుతో పాటు ఈనాడు  మీడియా కూడా జనాన్ని ఎంత అన్యాయంగా మోసం చేస్తున్నది ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు.

ఇక మరో మీడియా ఆంద్రజ్యోతి అయితే త్వరలో ప్రైవేటు ఇసుక రీచ్ లు వస్తున్నాయని, మరింత ఇసుక అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి తన వంతు బాజా వాయించింది. ఉచిత ఇసుకకు అదనంగా ఇది ఏర్పాటు అని మళ్లీ కవరింగ్ ఇచ్చారు. ఇదేదో గనుల శాఖ ప్రతిపాదించినట్లు రాశారు తప్ప, చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదన్నట్లు మాయ చేసేందుకు యత్నించారు. ప్రజలకు అవసరమైన ఇసుకను ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యమని కూడా ఆంధ్రజ్యోతి ముక్తాయించింది. దీనిని బట్టి ఈ మీడియా ఎంతగా ప్రజలను చీట్ చేయడానికి కృషి చేస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా కలిసి ఇసుక కొట్టాయని అనుకోవచ్చా!.

 

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Komminene Srinivas Rao
sand mafia
Andhra Pradesh
Chandrababu Naidu
TDP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.