Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. AP: మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి ఔట్‌!
ADVERTISEMENT 

AP: మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి ఔట్‌!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
NALCO-MIDHANI.jpg
  • నెల్లూరులో రూ.5,500 కోట్ల నాల్కో– మిధానీ యూనిట్‌ ప్యాకప్‌ 
  • వైఎస్సార్‌సీపీ హయాంలో 60,000 టన్నుల అల్యూమినియం యూనిట్‌ ఏర్పాటుకు ఒప్పందం 
  • 110 ఎకరాలు కేటాయించి చిక్కులను పరిష్కరించిన గత ప్రభుత్వం
  • పర్యావరణ అనుమతులతో సహా అన్ని పనులు నాడే పూర్తి  
  • ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్‌ పెట్టడం లేదని ప్రకటించిన నాల్కో 
  • చంద్రబాబు దెబ్బకి పారిపోతున్న కేంద్ర పీఎస్‌యూలు 
  • గతంలో టీడీపీ హయాంలోనే చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌ యూనిట్‌ రాష్ట్రం నుంచి తిరుగుముఖం 
  • ప్రైవేట్‌ మోజులో విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్న కూటమి సర్కారు 

సాక్షి, అమరావతి: అటు కేంద్రంలోనూ అధికారంలో కొనసాగుతూ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి.. రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజెక్టులను తీసుకురాకపోగా గత ప్రభుత్వ కృషితో వచ్చిన వాటిని సైతం వెళ్లగొట్టేలా వ్యవహరిస్తుండటంపై పారిశ్రామిక వర్గాల్లో విభ్రాంతి వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూతపడుతున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్‌యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది. 

కీలకమైన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో, మిధానీ కలసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ స్థాపించేలా వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఒప్పందం కుదిరింది. పలు కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది.

 2024–25 వార్షిక నివేదికలో ఈ విషయం  నాల్కో స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే మంగళం పలకబోతున్నారని, రా్ష్ట్రం నుంచి ఒక భారీ ప్రాజెక్టును తరిమేస్తున్నారని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కూటమి నేతలు దీనిపై నోరు విప్పక పోవడం పట్ల ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్‌ కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంత్రులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు చేజారిపోతున్నా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


ప్రైవేట్‌ సంస్థలపైనే మోజు.. 
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రైవేట్‌ సంస్థలపై ఉన్న మోజు ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండదని పలు సందర్భాల్లో రుజువైంది. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌­ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నా నోరు తెరవ­డం లేదు. పైగా ఈ యూనిట్‌ మూసివేతకు సహకరించే విధంగా ఓ ప్రైవేట్‌ కంపెనీ ఆధ్వర్యంలో అనకా­పల్లి వద్ద భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయి­స్తూ దానికి సొంత ఇనుప గనులు కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా కేంద్రాన్ని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేంద్రంతో పోరాడి చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 600 ఎకరాల్లో ఎనీ్టపీసీ, బీహెచ్‌ఈఎల్‌తో రూ.6,000 కోట్లతో విద్యుత్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌ను తీసుకురాగా విభజన అనంతరం టీడీపీ హయాంలో ఆ ప్రాజెక్టు అటకెక్కింది.  


శరవేగంగా అన్ని అనుమతులు..
నెల్లూరులో హైఎండ్‌ అల్యూమినియం కంపెనీ ఏ­ర్పాటుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో­కి రాగానే వేగంగా అడుగులు వేసింది. నాల్కో, మిధానీ కలసి 2019 ఆగస్టులో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్‌ (యూఏడీఎన్‌ఎల్‌) పేరిట భాగస్వామ్య కంపెనీనీ ఏర్పాటు చేశాయి. 2020 అక్టోబర్‌లో నెల్లూరు జిల్లా బీవీపాలెం వద్ద 110 ఎకరాలు భూమిని కేటాయించిన గత ప్రభుత్వం భూసేకరణలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను సైతం వేగంగా పరిష్కరించింది. దీంతో 2021 జూలైలో ఉత్కర్ష కార్పొరేట్‌ కా­ర్యా­లయాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అత్యవసరమైన పర్యావరణ అనుమతులు సైతం 2021 జూలైలో వచ్చేశాయి. నాల్కో సీఎండీ శ్రీధర్‌పాత్ర, మిధానీ ఎండీ సంజయ్‌కుమార్‌ 2022 ఏప్రిల్‌లో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ను కలసి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియచేశారు.  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nellore
YSRCP
TDP
Chandrababu Naidu government
YS Jagan Mohan Reddy
Industrial
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.