Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కృష్ణమ్మ కట్టడి బాబు పాపమే.. మనకు ‘మట్టే’!
ADVERTISEMENT 

కృష్ణమ్మ కట్టడి బాబు పాపమే.. మనకు ‘మట్టే’!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 1, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ALMATTI_0.jpg

ఆల్మట్టి డ్యాం ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక కేబినెట్‌ ఆమోదం

ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణకు రూ.70 వేల కోట్ల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పాపాలు తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌ రైతన్నలకు పెను శాపాలుగా పరిణమించాయి. ఆల్మట్టి డ్యాంపై 1995 నాటి ఘోర తప్పిదాలు నేటికీ వెంటాడుతున్నాయి. కృష్ణమ్మను కట్టడి చేస్తూ ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా సన్నద్ధం కావటా­నికి నాడు చంద్రబాబు నిర్వాకాలే కారణమని సాగునీటి నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

కర్ణాటక క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌...
ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడానికి కర్ణాటక కేబినెట్‌ ఈ ఏడాది సెప్టెంబరు 17న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనివల్ల ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్‌కోట మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పన, 75,663 ఎకరాల భూ సేకరణ కోసం రూ.70 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. మాగాణి భూములకు ఎకరానికి రూ.40 లక్షలు, మెట్ట భూమికి ఎకరానికి రూ.30 లక్షలు చొప్పున పరిహారం చెల్లించేందుకు అనుమతించింది.

తద్వారా ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగ­నుంది. అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అందించడానికి వీలుగా కాలువల వ్యవస్థను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. తద్వారా ఆల్మట్టి డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఆయకట్టుకు తరలించేందుకు కర్ణాటక సర్కార్‌ ప్రణాళిక రచించింది. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమయ్యే సంవత్సరాల్లో ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలను దాటి కృష్ణా నది నుంచి ఒక్క నీటి చుక్క కూడా శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉండదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆయకట్టు ఎడారే.. తాగునీటికీ తిప్పలే!
2015–16లో శ్రీశైలానికి కనిష్టంగా 58.69 టీఎంసీల ప్రవాహం రాగా.. అందులో కృష్ణా నుంచి వచ్చింది కేవలం 24.97 టీఎంసీలేనని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల శ్రీశైలంపైనే ఆధారపడ్డ హంద్రీ–నీవా, గాలేరు–­నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, వెలిగొండ.. నాగా­ర్జు­నసాగర్‌ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టా ఆయకట్టు ఎడారిగా మారుతుందని.. తాగు­నీటికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల బ్యాక్‌ వాటర్‌ ప్రభా­వంతో తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్‌ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్ర కంటే ఏపీకే తీవ్ర అన్యాయం జరుగుతుందని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాడు చంద్రబాబు నిర్వాకాలే...
అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు కింద 173 టీఎంసీలను కర్ణాటకకు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. దాంతో అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు (ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్‌ డ్యాం, హిప్పర్గి వియర్‌) పనులను 1964 మే 22న కర్ణాటక చేపట్టింది. అప్పట్లో ఆల్మట్టి డ్యాంను 509.016 మీటర్ల ఎత్తుతో చేపట్టింది. అనంతరం కర్ణాటకలో 1994 డిసెంబర్‌ 11న హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలో జనతాదళ్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు సీఎంగా  బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 నుంచి 524.256 మీటర్లకు పెంచుతూ 1995 అక్టోబరు 27న నాడు కర్ణాటకలోని దేవెగౌడ సర్కార్‌ పనులు చేపట్టినా అప్పటి సీఎం చంద్రబాబు నోరు మెదపలేదని సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

1996 లోక్‌సభ ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు నాటి కర్ణాటక సీఎం దేవెగౌడను ప్రధానిగా చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. 1996 సెప్టెంబరు 1న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దేవెగౌడ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం నిధులను రుణంగా మంజూరు చేసేలా చక్రం తిప్పారు. దాంతో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు పనులు వేగవంతమయ్యాయి. ఇంత జరుగుతున్నా నాడు చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.ఇక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల సంగ్లి, కొల్లాపూర్‌ జిల్లాలు ముంపునకు 

గురవుతాయంటూ అప్పట్లోనే మహారాష్ట్ర సర్కార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆయకట్టుకు నీళ్లందవని రైతులు రోడ్డెక్కడం.. మహారాష్ట్ర సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తప్పనసరి పరిస్థితుల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడిగా సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. కానీ.. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ సమర్థంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. పర్యవసానంగా ఆల్మట్టి డ్యాంలో నీటి నిల్వ ఎత్తును 519.06 మీటర్లకు పరిమితం చేయాలని 2000 ఏప్రిల్‌ 25న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు గడువు మే 31, 2000తో ముగియనున్న నేపథ్యంలో.. కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం ఏర్పాటుచేసే కొత్త ట్రిబ్యునల్‌ వద్ద ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచడంపై వాదనలు వినిపించాలని నాడు కర్ణాటక సర్కార్‌కు సూచించింది.

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లోనూ వెంటాడిన బాబు పాపం.
కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేయడానికి 2004 ఏప్రిల్‌ 2న జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యు­నల్‌ను ఏర్పాటు చేసింది. ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా 2002 నాటికే కర్ణాటక సర్కార్‌ పనులను పూర్తి చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2002–­03లో 519.06 మీటర్ల ఎత్తుతో 129.72 టీఎంసీలను నిల్వ చేసింది. తాము ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ఇప్పటికే పనులు పూర్తి చేశామని.. నీటి కేటాయింపులు చేయకపోతే ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట కర్ణాటక వాదించింది.

నిధులు వృథా అవుతాయన్న వాదనతో ఏకీభవించిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యు­నల్‌.. అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టుకు బచావత్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం లభ్యతగా కేటాయించిన 173 టీఎంసీల జోలికి వెళ్లకుండా 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 130 టీఎంసీలను కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 2013 నవంబర్‌ 29న కేంద్రానికి తుది నివే­దిక ఇచ్చింది.

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదికను సవాల్‌ చేస్తూ ఉమ్మడి ఆంధ్రపద్రేశ్, మహా­రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో ఎస్పె­ల్పీలు దాఖలు చేశాయి. దాంతో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదిక అమలును నిలుపుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టును ఆదేశించింది. ప్రస్తుతం ఆ ఎస్సెల్పీలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తుండటంతో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫి­కేషన్‌ జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిజేష్‌­కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్రాన్ని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాయడం గమనార్హం.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
Andhra Pradesh
Karnataka Cabinet
almatti dam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.