Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. దుష్ప్రచారాన్ని కట్టడి చేయండి 
ADVERTISEMENT 

దుష్ప్రచారాన్ని కట్టడి చేయండి 

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Apr 7, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babu_20police.jpg

పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కుట్ర 

ఆ పార్టీలకు కొమ్ముకాసే మీడియాను నియంత్రించండి.. ఈసీకి ఐపీఎస్‌ అధికారుల సంఘం వినతి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పత్రికలు, మీడియా చానళ్లు నిరాధార ఆరోపణలతో తమపై చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐపీఎస్‌ అధికారుల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కీలకమైన ఎన్నికల తరుణంలో ఐపీఎస్‌ అధికారులతోపాటు యావత్‌ పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి 19 మంది ఐపీఎస్‌ అధికారుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఐపీఎస్‌ అధికారుల సంఘం ప్రతినిధులు కాంతిరాణా టాటా, రవీంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు శనివారం సమర్పించారు. ఆ వినతిపత్రంతో పాటు ఇటీవల ఐపీఎస్‌ అధికారులపై టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియాలో వచ్చిన 17 నిరాధారమైన వార్తా కథనాలను జత చేశారు.  

ఫిర్యాదులో ముఖ్యాంశాలు 

రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లు పక్కా కుట్రతోనే  దుష్ప్రచారం సాగిస్తున్నాయి. ముందుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తారు. అనంతరం అవే ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. వారు చేసేఆరోపణలకు ఎలాంటి ఆధారాలుండవు. కానీ పదే పదే అసత్య ఆరోపణలు చేయడం ద్వారా  పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది ఆ పా  ర్టీల కుట్ర. దాంతో పోలీసు వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది.

అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ ఆరోపణలను పునరుద్ఘాటిస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత మొదలైన నిందలు వేస్తారు. ప్రతిపక్ష పా   ర్టీల ఆరోపణలను ఆ పార్టీలకు కొమ్ముకాస్తున్న పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తాయి. మీడియా చానళ్లు పదే పదే వాటినే ప్రసారం చేస్తాయి. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సోషల్‌ మీడియా విభాగాలు ఆ దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున వైరల్‌ చేస్తాయి.

మళ్లీ మరో అసత్య ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తాయి... మళ్లీ అదే తంతు సాగుతుంది. ఇలా ఈ దుష్ప్రచారాన్ని పదే పదే కొనసాగిస్తారు. కొన్ని ప్రధానపత్రికలు, టీవీ చానళ్లు ప్రతిపక్ష పార్టీల కుట్రలో భాగస్వాములవడం దురదృష్టకరం. ఈ దుష్ప్రచారంతో గత రెండు నెలల్లోనే 30మందికి పైగా పోలీసు అధికారులు మనోవేదనకు గురయ్యారు.   

ఈసీ నిర్ణయాలపైనా దుష్ప్రచారం 

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, వాటికి వత్తాసు పలికే మీడియా పదే పదే చేస్తున్న దుష్ప్రచారం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ఇటీవల ఓ ఐజీ, కొందరు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను ఈసీ బదిలీ చేసింది. అనంతరం వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఈ నెల 4న ఉత్తర్వులిచ్చింది.  öత్తగా నియమితులైన ఆ అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే వారికి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియా మళ్లీ దుష్ప్రచారం మొదలెట్టింది.  ‘వీళ్లా కొత్త ఎస్పీలు ... సగానికి పైగా వైకాపా విధేయులే’అని కథనాన్ని ప్రముఖంగా ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది.  

పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసే కుట్ర 

ఇలా రోజూ పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారం పోలీసు వ్యవస్థ మనో స్థైర్యాన్ని, చొరవను దెబ్బతీస్తోంది. వాస్తవానికి  అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి విధులు నిర్వహిస్తోంది. కాబట్టి  ఆ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి వస్తోంది. పోలీసు అధికారులు ఎన్నికల విధుల నుంచి పూర్తిగా వైదొ­లిగేలా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు, వారికి కొమ్ముకాసే మీడియా కుట్ర పన్నుతోంది.

వాస్తవానికి సక్రమంగా ఎన్నికల నిర్వహణ కోసం ఈసీకి విజ్ఞప్తి చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు అందుకు విరుద్ధంగా మీడియాను అడ్డంపెట్టుకుని పోలీసు అధికారులపై దుష్ప్రచారానికే ప్రాధాన్యమిస్తోంది. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు యత్నిస్తోంది. తద్వారా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నిబద్ధతతో పని చేస్తున్న పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి క్రియాశూన్యంగా చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు కుట్ర పన్నుతున్నాయి.

వారి కుట్రతో రాజ్యంగబద్ధ సంస్థలపై ప్రజల్లో సందేహాలు కలిగిస్తే సమాజంలో వైషమ్యాలు చెలరేగే ప్రమాదం ఉంది. మావోలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచి్చన నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఇంతటి కీలక తరుణంలో కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకూ పోలీసు యంత్రాంగం మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారం కట్టడి చేయాలి. ఆ కుట్రకు పాల్పడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Chandrababu Naidu
yellow media
IPS officer
Election Commission of India
Complaint
Andhra Pradesh
AP Elections 2024
TDP
Jana Sena
AP Politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.