Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం
ADVERTISEMENT 

కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 30, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sabari-Byreddy-01.jpg

కొరకరాని కొయ్యలా బైరెడ్డి 

టీడీపీలో లేకపోయినా చక్రం తిప్పుతున్న నేత 

చెల్లని కాసులుగా మాండ్ర, ఎమ్మెల్యే జయసూర్య 

ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోని     అధిష్టానం 

మున్సిపల్‌ చైర్మన్‌ చుట్టూ ‘రాజకీయం’ 

రెండు నెలలకే అధికార పారీ్టలో    విభేదాల రగడ

ఒకరు రాజకీయంగా కనుమరుగయ్యారని భావిస్తున్న తరుణంలో కుమారై పదవితో తనదైన రాజకీయానికి తెరతీశారు.. జీవితంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరొకరు. వీరిద్దరి కంటే ముందు నుంచి నందికొట్కూరు రాజకీయాన్ని అన్నీ తానై నడిపిస్తున్న నేత ఇంకొకరు. అధికారం దక్కి 50రోజులు ముగియకనే ఈ ముగ్గురు నేతల మధ్య విభేదాలు వీధికెక్కాయి. సైకిల్‌ పారీ్టతో సంబంధం లేని బైరెడ్డి నందికొట్కూరులో పెత్తనం చేస్తుంటే.. పెత్తనం చేయడానికి బైరెడ్డి ఎవరు? ఆయనకు టీడీపీతో సంబంధం ఏంటని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తుతున్నారు. మాండ్ర శివానందరెడ్డి పెత్తనం చెలాయించాలని చూస్తున్నా అధిష్టానం సహకరించకపోవడంతో పార్టీ పరువు బజారున పడుతోంది. చివరకు ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు చేరినా పరిష్కారం చూపలేక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నందికొట్కూరు ‘తమ్ముళ్ల’ విభేదాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి ప్రతినిధి కర్నూలు: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. మోతుబరి రాజకీయనాయకుడే. రాజకీయం, ఆయనపై ఫ్యాక్షన్‌  ఆరోపణలు వెరసి ‘సీమ’రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. తెలుగుదేశం పారీ్టలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన 2012లో విభేదించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ భుజానికెత్తుకున్నట్లు ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యేక రాయలసీమ వాదాన్ని వినిపించారు. ఎలక్షన్‌లో పోటీ చేసి అట్టరఫ్లాప్‌ అయ్యారు. ఆపై కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ దెబ్బతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని అంతా భావించారు. అయితే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. సమకాలీన రాజకీయాల్లో బైరెడ్డి ప్రస్తావన లేకుండానే 2014, 2019లో కర్నూలు ఎన్నికలు ముగిశాయి. 2024లో తనతో పాటు బీజేపీలో ఉన్న కుమార్తె శబరిని టీడీపీలోకి పంపారు. ఈ చేరికలో శబరి మాత్రకమే ‘పచ్చకండువా’ వేసుకున్నారు. బైరెడ్డి వేసుకోలేదు. నంద్యాల ఎంపీగా శబరి గెలుపొందారు. 

పేరుకే శబరి.. అంతా బైరెడ్డే! 
ఎన్నికల తర్వాత బైరెడ్డి నందికొట్కూరుపై తిరిగి పట్టుకోసం ప్రయతి్నస్తున్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లను టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహా్వనించారు. ఆపై మిడుతూరు, పగిడ్యాలలో ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ‘పచ్చకండువా’ వేశారు. దీనిపై జయసూర్య తీవ్రస్థాయిలో స్పందించారు. ‘టీడీపీలో చేర్చుకోవడానికి బైరెడ్డి ఎవరు? ఆయన టీడీపీ వ్యక్తి కాదు. టీడీపీలో చేరలేదు. సభ్యత్వం లేదు. కుమారై టీడీపీలో చేరినంత మాత్రాన ఈయన టీడీపీ అవుతారా?’ అని ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత బైరెడ్డి కూడా అదేస్థాయిలో స్పందించారు. ‘నందికొట్కూరు తమ అడ్డా అని, కొందరు వస్తుంటారు.. పోతుంటారు!’ అని ఎమ్మెల్యేను తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ వ్యవహారం తర్వాత బైరెడ్డిపై జయసూర్య మాండ్ర శివానందరెడ్డితో కలిసి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ తతంగం తర్వాత కూడా ఆదివారం బైరెడ్డి శివపురం ఎంపీటీసీ, మరికొందరికి కండువా వేసి టీడీపీలోకి ఆహా్వనించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తానే ఎంపీ అనే భావనలో నందికొట్కూరులో బైరెడ్డి రాజకీయం సాగిస్తున్నారు 

మునిసిపల్‌ చైర్మన్‌ మార్పు బైరెడ్డికి  చెక్‌ పెట్టేందుకేనా? 
బైరెడ్డికి చెక్‌పెట్టేందుకు మాండ్రశివానందరెడ్డి కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ నుంచి చేరిన సుధాకర్‌రెడ్డి టీడీపీ వ్యక్తి కాదని, అలాంటి వ్యక్తిని మునిసిపల్‌ చైర్మన్‌గా కొనసాగించొద్దని ఎమ్మెల్యే, మాండ్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే 4ఏళ్ల వరకూ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టలేని పరిస్థితి. ఈక్రమంలో సుధాకర్‌రెడ్డి నిజంగా టీడీపీపై విశ్వాసంతో పారీ్టలో చేరి ఉంటే చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి పారీ్టలో కొనసాగాలే ఆదేశించాలని పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. రాజీనామా చేస్తే చైర్మన్‌ పదవి ఖాళీ అవుతుంది. అప్పుడు టీడీపీ కౌన్సిలర్‌ను చైర్మన్‌ చేయొచ్చు అనేది మాండ్ర ఎత్తుగడ. ఇందుకు నాలుగేళ్ల వరకు ఆగాల్సిన పని కూడా లేదు. ఇదే జరిగితే బైరెడ్డికి చెక్‌ పెట్టినట్లే. లేదంటే మాండ్రతో పాటు దళిత ఎమ్మెల్యే జయసూర్యను టీడీపీ లైట్‌గా తీసుకున్నట్లే!!  

ఎమ్మెల్యే, మాండ్రకు టీడీపీ   ప్రాధాన్యత ఇవ్వడం లేదా? 
⇒ బైరెడ్డి చర్యలను పట్టించుకోకపోవడం చూస్తే టీడీపీ పరోక్షంగా ఆయనను సమరి్థంచినట్లే కనపడుతోంది. 
⇒ మొన్నటి ఎన్నికల్లో మాండ్ర శివానందరెడ్డి నంద్యాల ఎంపీ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు.  
⇒ శబరికి ఎంపీ టిక్కెట్‌ ఇచ్చే సందర్భంలో నందికొట్కూరు టిక్కెట్‌ మాండ్ర చెప్పిన వారికే ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ మేరకు జయసూర్య ఎమ్మెల్యే అయ్యారు. 
⇒ ఇప్పుడు బైరెడ్డి చర్యలను టీడీపీ సమర్థిస్తూ, జయసూర్యను పట్టించుకోవం లేదంటే మాండ్రను పక్కనపెట్టినట్లేనని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. 
⇒ ఒకవేళ ఈ వివాదానికి చెక్‌ పెట్టాలనుకుంటే బైరెడ్డిని టీడీపీలో చేరాలని అధిష్టానం సూచించాలి. అదీ చేయలేదు.  
⇒ చేరికల సమయంలో ఎమ్మెల్యేను కలుపుకుని వెళ్లాలని చెప్పాలి. అలా కూడా జరగలేదు. 
⇒ టీడీపీలోని ముఖ్య నేతలందరితో బైరెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అందువల్లే ఆయన ముందు జయసూర్య తేలిపోతున్నారు.  
⇒ పైగా జయసూర్య దళిత ఎమ్మెల్యే కావడంతో బైరెడ్డి లెక్కపెట్టడం లేదని తెలుస్తోంది.  
⇒ టీడీపీ కూడా అదే కోణంలో చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
⇒ రెండేళ్ల తర్వాత డీలిమిటేషన్‌లో రిజర్వేషన్లు మారితే జయసూర్యకు రాజకీయ భవితవ్యం కూడా ఉండదనే ప్రచారం బైరెడ్డి వర్గం చేస్తోంది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Byreddy Rajasekhar reddy
TDP
nandikotkur
AP Politics
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.