Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. హైకోర్టు ఇమ్మంది.. ప్రభుత్వం పొమ్మంటోంది!
ADVERTISEMENT 

హైకోర్టు ఇమ్మంది.. ప్రభుత్వం పొమ్మంటోంది!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 30, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hc_0.jpg

డీఎస్సీ–2025లో మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం 

హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు 

తమకు మెరిట్‌ ఉన్నా ఎస్జీటీ పోస్టులు ఇవ్వడంపై అభ్యంతరం

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో మెరిట్‌ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరిగితే సహించబోమని ఇటీవల హెచ్చరించడంతోపాటు, వారికి రెండు నెలల్లోగా అర్హత సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన పోస్టు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇందుకు చంద్రబాబు సర్కారు ససేమిరా అంటోంది. ఇప్పటికే నియామకాలు పూర్తి చేశామని, ఇవ్వ­డం కుదరదని చెప్పింది. పైపెచ్చు హైకోర్టు తీర్పు­పై అప్పీల్‌కు విద్యా శాఖ సిద్ధమవుతోంది. 

చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పాట్లు పడుతోందేగానీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం మెరిట్‌ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మాత్రం అంగీకరించడం లేదు. డీఎస్సీ–2025 అభ్యర్థుల జీవితాలతో ఆది నుంచి ఆడుకున్న ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు సమయంలోనే తొలి ప్రా­ధాన్య పోస్టు ఏదో అభ్యర్థులను ఎంచుకోమంది. అభ్యర్థులు తొలి ప్రాధాన్యంగా ఏ పోస్టు ఎంచుకుంటే అదే పోస్టు వస్తుందని ప్రకటించింది. 

ఈ విధా­నం గతంలో ఎప్పుడూ లేదు. కౌన్సెలింగ్‌ సమయంలో మాత్రమే పోస్టుల ప్రాధాన్యం అడిగేవారు. దాని ద్వారా అభ్యర్థులు తాము మెరిట్‌ సాధించిన వాటిలో ఉన్నత పోస్టును పొందే అవకాశం ఉండేది. ఈసారి దరఖాస్తు సమయంలోనే అడగడంతో వందలాది అభ్యర్థులు ఉన్నత పోస్టులను కోల్పోయా­రు. డీఎస్సీ –2025 ఫలితాలు ప్రకటించాక దాదాపు 2 వేల మంది అభ్యర్థులు ఎస్జీటీ తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నా స్కూల్‌ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ పోస్టులు కూడా సాధించారు. 

అయితే వారికి తొలి ప్రాధాన్యమైన ఎస్జీటీ పోస్టు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అంతకంటే మంచి పోస్టులైన స్కూల్‌ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులకు అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారికి ఆ పోస్టులు ఇవ్వలేదు. దీంతో 54 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

తాము ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నతమైన పోస్టును కోల్పోతున్నామని, గతంలో కౌన్సెలింగ్‌ దశలో అభ్యర్థులకే పోస్టు ప్రాధాన్యం ఎంచుకునే వెసులుబాటు ఉండేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కుగా హైకోర్టు పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారికి ప్రాధాన్యత ఎంపిక విధానంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది.  

హైకోర్టు తీర్పు బేఖాతర్‌  
హైకోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా ఆగస్టు 11న ఫలితాలను, 21న మెరిట్‌ లిస్టును ప్రకటించడంతోపాటు ఈ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేసింది. అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినప్పటికీ ప్రభుత్వం హడావుడిగా గతేడాది సెపె్టంబర్‌లో పోస్టింగులు సైతం పూర్తి చేసింది. దీనిపై హైకోర్టు సెపె్టంబర్‌ 12న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మెరిట్‌ విద్యార్థులకు పోస్టులు ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించింది. 

కానీ దీన్ని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా సెపె్టంబర్‌ 15న సెలక్షన్‌ లిస్టును విడుదల చేసి, ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. హైకోర్టు బెంచ్‌ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసి, మెరిట్‌కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. డిసెంబర్‌ 29న తుది తీర్పునిస్తూ మెరిట్‌కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పోస్టింగ్స్‌ పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు మండిపడింది. 

న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎలా పోస్టులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన 54 మంది మెరిట్‌ అభ్యర్థులతోపాటు ఆర్థి కారణలతో హైకోర్టుకు వెళ్లలేని వారికీ న్యాయం దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును పాటించకుండా మరోసారి అప్పీల్‌కు వెళ్లే యోచన చేస్తుండడం గమనార్హం. న్యాయస్థానాన్ని సైతం లెక్క చేయని ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు, యువజన సంఘాలు మండిపడుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
DSC
Andhra Pradesh
Andhra Pradesh High Court
merit students
Chandrababu Naidu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.