Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఉపకరణాలే కాదు.. డేటా కూడా ముఖ్యం
ADVERTISEMENT 

ఉపకరణాలే కాదు.. డేటా కూడా ముఖ్యం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 19, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hc.jpg

జప్తు చేసిన వాటన్నింటినీ ఒరిజినల్‌ రూపంలోనే భద్రపరచండి

కుక్కల విద్యాసాగర్‌ పిటిషన్‌పై పోలీసులను ఆదేశించిన హైకోర్టు 

వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం 

కోర్టుకు హాజరైన జత్వానీ, ఆమె తల్లిదండ్రులు 

అక్టోబర్‌ 1వ తేదీకి విచారణ వాయిదా 

సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలను భద్రపరిచే విషయంలో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లు, ఐప్యాడ్, లాప్‌ట్యాప్‌లను, అందులో ఉన్న డేటాను ఒరిజినల్‌ రూపంలోనే భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. ఉపకరణాలంటే అందులో ఉన్న డేటా కూడా అని, దానిని కూడా భద్రపరచడం తప్పనిసరని తెలిపింది. 

డేటా అత్యంత కీలకమంది. తన ఫిర్యాదు మేరకు జత్వానీ తదితరులపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆమెకు చెందిన పలు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను జప్తు చేశారని, అందులో కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా­రంటూ ఫిర్యాదు­దారు కుక్కల విద్యాసాగర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

జత్వానీ నుంచి జప్తు చేసిన ఉపకరణాలన్నింటినీ భద్రపరి­చేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్‌ ఫోన్లు, ఇతర ఉపకరణాలను భద్రప­రచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మరోసారి విచారణ జరిపారు. 

వెనక్కి ఇచ్చేసేందుకే వాటిని తెప్పించారు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్‌ ఫోన్లు ఇతర ఉపకరణాలను ఆమెకు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏమీ ప్రస్తుతానికి దర్యాప్తు అధికారికి లేదని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) వద్ద ఉన్న జత్వానీ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను తిరిగి ఆమెకు ఇచ్చేస్తున్నారని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అసలు ఆ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. 

పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి వద్ద ఉన్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్‌ చెప్పారు. ఈ సమయంలో విద్యాసాగర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ వద్ద విశ్లేషణ నిమిత్తం ఉన్న జత్వానీ మొబైల్‌ ఫోన్లు తదితర ఉపకరణాలను వెనక్కు ఇచ్చేందుకు హడావుడిగా తెప్పించారని తెలిపారు. ఆ ఉపకరణాలను విశ్లేషించి, అందులో ఉన్న వివరాలతో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక అందచేయాల్సి ఉంటుందన్నారు. 

మొబైల్‌ ఫోన్లు జప్తు చేసిన నేపథ్యంలో, అందులో ఉన్న సిమ్‌ కార్డ్‌ స్థానంలో తాజా సిమ్‌ కార్డ్‌ను జత్వానీకి ఇవ్వాలని సంబంధిత ఆపరేటర్‌ను పోలీసులు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే ఆ సిమ్‌లో ఉన్న డేటా మొత్తం పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు గురించి జత్వానీ ఇష్టమొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడు­తున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌డీటీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. 

ఈ సమయంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పునరుద్ఘాటించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంలో వారం కల్లా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 1వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు జత్వానీ, ఆమె తల్లిదండ్రులు కోర్టులో హాజరయ్యారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
kadambari jethwani
Electronics
Andhra Pradesh High Court
data
Vidyasagar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.