Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. AP: బలహీనపడిన తుపాను
ADVERTISEMENT 

AP: బలహీనపడిన తుపాను

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 2, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rain22.jpg

తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు

పుత్తూరులో 18 సెంటీమీటర్ల వర్షం

తీవ్ర వాయుగుండంగా మారిన ఫెంగల్‌

తీరం దాటినా మందగమనమే

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ఫెంగల్‌ తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద నెమ్మదిగా బలహీనప­డింది. తీరం దాటిన తర్వాత కూడా 6 గంటలకు­పైగా భూమిపై తుపానుగానే స్థిరంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కి.మీ., విల్లుపురానికి 40 కి.మీ., చెన్నైకి 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి ఇంకా బలహీనపడి వాయుగుండంగా.. ఆ తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 

మూడు జిల్లాల్లో ఎడతెగని వర్షాలు
తుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం కూడా ఎడతెగని వర్షాలు కురిశాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా పుత్తూరులో 18.7సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పుత్తూరు మండలం రాచలపాలెంలో 15.2 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ, చిత్తమూరు, దొరవారిసత్రం, నాయుడుపేట, వెంకటగిరిలో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా నగరి, నిండ్ర, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కొడవలూరు, సైదాపురం మండలాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ చాలాచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 10 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగుల్లోకి పెద్దఎత్తున నీరు చేరి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లే అనేక బస్సులను రద్దు చేశారు. సోమవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమ­త్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 

తిరుపతి జిల్లాలో జోరువాన
తిరుపతి జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. వర్షం ప్రభావంతో 116 ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేశారు. 21 గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు వెళ్లడం లేదు. చెన్నైకి వెళ్లే పలు సర్వీసులకు బ్రేక్‌ పడింది. ఏసీ సర్వీసులను నిలుపుదల చేశారు. జిల్లాలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువ తదితర 21 కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

ఇతర ప్రాంతాల్లోనూ వానలు
కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిశాయి. 19,500 ఎకరాల్లో వరి నేలవాలింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపైనే రాశులు పోయగా.. తడిసిపోయింది. ఎన్టీఆర్‌ జిల్లాలో అక్కడక్కడా మోస్తరు జల్లులు కురిశాయి. పూత దశలో ఉన్న కంది, మిరప గాలులకు రాలిపోయింది. మబ్బుల కారణంగా పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతు­న్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో 9.2 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.6 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట పలుచోట్ల నేల వాలింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం చిరు జల్లుల కారణంగా సార్వా మాసూళ్ల (నూర్పిడి) పనులు నిలిచి­పోయాయి. విజయనగరం జిల్లాలో రెండు రోజు­లుగా కురుస్తున్న వర్షాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. భోగా­పురం, గరివిడి, ఎస్‌.కోట,  డెంకాడ, గుర్ల, చీపురు­పల్లి, పూసపాటి­రేగ, కొత్తవలస, బొండపల్లి, గజపతి­నగరం, వేపాడ, నెల్లిమర్ల, మెంటాడ, విజయనగరం, రామభద్ర­పురం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.

కాకినాడ జిల్లాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వరి చేలు నేలకొరిగాయి. సుమారు 30 శాతం వరిచేలు నేలనంటాయి. ముమ్మిడివరం, అమలా­పురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో వరిపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. కూనవరం మొగ మూసుకుపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్‌ శాతం పడిపోయింది. రొయ్యలను కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

తిరుమలలో విరిగిపడుతున్న కొండ చరియలు
తిరుమలలోని రెండో ఘాట్‌ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రెండు ఘాట్‌ రోడ్లలోనూ దిట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తిరుమలలో ఆదివారం కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్‌ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వరి, టమాటా, బొప్పాయి  ఇతర ఆకు కూరల తోటలు దెబ్బతిన్నాయి.  పొగ మంచు రావడంతో రహదారులపై వాహనదారులు కష్టతరంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
heavy rains
Cyclone Fengal
Andhra Pradesh
Tirupati
chittoor
Nellore
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.