Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని అవినీతి దాహం..
ADVERTISEMENT 

టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని అవినీతి దాహం..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Apr 6, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
YARAPATHI-COPY.jpg

సిమెంట్‌ పరిశ్రమలకు శాపం

పల్నాడు జిల్లాలో భవ్య, చెట్టినాడ్‌ సంస్థలపై గూండాగిరి

ప్రతి సిమెంట్‌ బస్తాకు కప్పం కట్టాలని హుకుం..  

మైనింగ్‌ కార్యకలాపాల్లో వాటాలు, అనుచరులకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు.. 

ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో భాగాలు ఇవ్వాలని ఒత్తిడి 

యాజమాన్యాలు తలొగ్గకపోవడంతో ఫ్యాక్టరీ ప్రతినిధులపై దౌర్జన్యాలు..  

రైతులకు నష్టం, కర్మాగారాలకు అనుమతుల్లేవంటూ కక్ష సాధింపు  

సిమెంట్‌ ఉత్పత్తి జరగకుండా అడ్డుకుంటున్న అధికార పార్టీ నేతలు 

బలవంతంగా ఫ్యాక్టరీ గేట్లు మూత 

ఎమ్మెల్యే దుర్మార్గాలు తట్టుకోలేక సంస్థలను తాత్కాలికంగా మూసేసిన యాజమాన్యాలు 

రోడ్డునపడ్డ వేలాది మంది కార్మికులు

కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు పారిశ్రామికవేత్తల సన్నాహాలు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ఆయన టీడీపీ ఎమ్మెల్యే.. అందరి ప్రజాప్రతినిధుల కంటే ఈయన వైఖరి చాలా భిన్నం. గూండాగిరి ఆయ­న సహజ లక్షణం. తన స్వ­లా­­భం కోసం ఎలాంటి దాదా­గిరికైనా వెనుకా­డరు. దాడులు, దౌర్జ­న్యా­ల­కూ తెగబడ­తారు. సీబీ­­ఐ కేసుల్లో విచా­రణ ఎదుర్కొంటున్న ఈ ఎమ్మెల్యే కన్ను ఇ­ప్పు­డు ఈ ప్రాంతంలోని సి­మెంట్‌ ఫ్యాక్ట­రీ­లపై ప­డింది. గతంలో పల్నాడు జిల్లా­లో అడ్డగోలు­గా మైనింగ్‌ని కొ­ల్ల­గొట్టి.. రూ.వేల కోట్లు దోచు­కున్న పల్నాడు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇప్పుడు సిమెంట్‌ ఫ్యాక్టరీలను తన దారిలోకి తెచ్చుకునేందుకు అరాచకాలకు తెరలేపారు. 

దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని భవ్య (అంజనీ) సిమెంట్‌ ఫ్యాక్టరీ, అదే మండలంలోని పెదగార్లపాడులోని చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలపై తన అనుచరులతో దాడులు చేయించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు అనుకూలంగా ఉండే అధికా­రులను ఫ్యాక్టరీల మీదకు ఉసిగొల్పు­తున్నా­రు. 

గ్రామస్తులు, రైతులను అడ్డం పెట్టుకుని..
పెదగార్లపాడు గ్రామంలో సుమారు రూ.2వేల కోట్లతో నిర్మించిన చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ 2020 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతిలో 800 మంది కార్మి­కులు పనిచేస్తున్నా­రు. రోజుకి నాలుగువేల టన్నుల సిమెంట్‌ ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురజాల టీడీపీ ఎమ్మె­ల్యే యరపతినేని శ్రీనివాసరావు కన్ను ఈ ఫ్యాక్టరీపై పడింది.  తన దందాలను సాధించుకోవడంపై యరపతినేని దృష్టిసారించారు. 

ప్రతి సిమెంట్‌ బస్తాకి కొంత మొత్తం డబ్బు, మైనింగ్‌ కార్యకలాపాల్లో వాటాలు, తన అనుచరులకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు, ఫ్యాక్ట­రీకి వచ్చే లాభాల్లో వాటాలూ ఇవ్వాలని యాజ­మాన్యంపై ఒత్తిడి తెచ్చారు. దీనికి యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో.. రైతులు, గ్రామస్తులను ముందుపెట్టి ఆందోళనకు తెరలేపారు. 

యరపతినేని అరాచకాలు ఇలా..
తొలుత ఫ్యాక్టరీలోకి కార్మికులను రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత..
⇒ సిమెంట్, బొగ్గు, జిప్సం సరఫరా చేసే లారీలను ఫ్యాక్టరీలోకి రానివ్వలేదు. 
⇒ అనంతరం.. ఇతర రాష్ట్రాలకు సిమెంట్‌ సరఫరా చేసే రైలు వ్యాగన్లను కూడా అడ్డుకున్నారు. 
⇒ సిమెంట్‌ లోడ్‌ కోసం ఫ్యాక్టరీలోకి వెళ్లే లారీలను బలవంతంగా బయటకు పంపి అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. 
⇒ ఆఖరికి ఫ్యాక్టరీకి డీజిల్‌ సరఫరా చేసే ట్యాంకర్లని కూడా అడ్డుకున్నారు. ఇలా.. యరపతినేని ఆగ­డా­లు రోజురోజుకూ పెరిగిపోవడంతో రవాణా పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. గతనెల 11 నుంచి ఫ్యాక్టరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ఫ్యాక్టరీ గేట్లకు యాజ­మాన్యం తాళాలు వేసింది.

భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీలోనూ బీభత్సం..
ఇదే విధంగా తంగెడ వద్ద ఉన్న భవ్య (అంజనీ) సిమెంట్‌ ఫ్యాక్టరీపై కూడాయరపతినేని అనుచరులు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇక్కడ కూడా రవాణా నిలిచిపోయింది. ఫ్యాక్టరీ లోపలికి యరపతినేని అనుచరులు వెళ్లి నానా హంగామా సృష్టించారు. లారీ డ్రైవర్లపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు ఫ్యాక్టరీలపై యరపతినేని అరాచకాలు చేస్తూ మిగిలిన సిమెంట్‌ ఫ్యాక్టరీలకు సైతం ఇదే గతి పడుతుందని సంకేతాలు పంపిస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తల్లో అలజడి మొదలైంది. 

రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు..
చెట్టినాడ్, భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీలు మూతపడటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఈ రెండు ఫ్యాక్టరీల ద్వారా రెండువేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అన్ని అనుమతులు ఇవ్వడంతో సకాలంలో నిర్మాణం పూర్తిచేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇప్పుడు రెండు ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు.. యరపతినేని అగడాలు చూసి ఆయా గ్రామాలకు చెందిన సొంత పార్టీ నేతలే చీదరించుకుంటున్నారు.

ఫ్యాక్టరీలపై అధికారుల కక్షసాధింపు..
ఇక చెట్టినాడ్, భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీల విషయంలో ప్రభుత్వ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శి­స్తు­న్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఆత్మీయుడుగా చెప్పుకునే పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి. అరుణ్‌బాబు ఫ్యాక్టరీల వ్యవహారంపై యరపతినే­నికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ­లు­న్నాయి. ఈ క్రమంలో.. యరపతినేని ఆదేశాలతో రెండు వారాల క్రితం పల్నాడు కలెక్టరేట్‌లో సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

ఇక యరపతినేని దగ్గర మెప్పు పొందటం కోసం కొందరు అధికారులు వేలాదిమంది కార్మికులకు ఉపాధి చూపించే ఫ్యాక్టరీలపై కక్షపూరితంగా వ్యవహరి­స్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మైనింగ్‌ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతు­ల్లేవని.. ఎన్‌ఎస్‌పీ కాలువలపై నిర్మించిన రైలు­బ్రిడ్జిలు నాణ్యంగా లేవన్న సాకులు చూపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

పారిశ్రామికవేత్తల అసహనం.. 
మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై పారిశ్రామికవేత్తలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టేందుకు సమాయత్తమయ్యారు. వెనుకబడిన పల్నాడు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో టీడీపీ కూటమి నేతల  దుర్మార్గాలవల్ల జిల్లా మరోసారి తిరోగమనం పడుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది.

టీడీపీ కూటమి పాలనలో వేధింపులు ఎన్నో..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి గత జూన్‌లో అధికారంలోకి వచ్చీరాగానే అరాచకా­ల­కు తెరలేపింది. అప్పటి నుంచి ఆ పార్టీల నేతలు చేయని విధ్వంసం లేదు. పైస్థాయిలోని ‘ముఖ్య’ నేతల దన్నుతో నీకింత.. నాకింత అన్నట్లుగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ఉదా..
⇒ ఇక ముంబై నటి కాదంబరి జెత్వానీ విషయంలోనూ లేనిపోని అపోహలు సృష్టించి పారిశ్రామిక దిగ్గజం సజ్జన్‌ జిందాల్‌ను రాష్ట్రం నుంచి పారిపోయేలా పరిస్థితులు సృష్టించారు. ఇలా.. టీడీపీ నేతల ఆగడాలు భరించలేక పారిశ్రామికవేత్తలు 
బెంబేలెత్తిపోతున్నారు.
⇒ కాకినాడ పోర్టు, సెజ్‌ను బెదిరించి తన నుంచి లాగేసుకున్నారని టీడీపీ సానుభూతిపరుడు కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌చంద్రారెడ్డిని కేసులతో వేధిస్తున్నారు.

⇒ గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లోనే శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో టీడీపీ శ్రేణులు అలజడి సృష్టించారు. నెలనెలా కప్పం కడితే తప్ప లోడ్‌ లారీలు బయటకు రాలేని పరిస్థితులు సృష్టించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో స్థానిక టీడీపీ నేతలకు తలొగ్గింది.
⇒ అలాగే, ఫ్లైయాష్‌ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య చెలరేగిన రగడ అంతాఇంతా కాదు. ఫైయాష్‌ లోడింగ్‌ విషయంలో వీరి మధ్య తలెత్తిన వివాదంతో ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌) ట్రాన్స్‌పోర్టు యజమానులు బాగా నలిగిపోయారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
yarapathineni srinivasa rao
Palnadu District
TDP
mla
Cement factory
Corruption
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.