Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్‌ లేనట్లే!?
ADVERTISEMENT 

ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్‌ లేనట్లే!?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 11, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jalleru.jpg

తొలిదశలో కేవలం ప్రధాన కాలువ, ఎత్తిపోతల పనులే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం

జల్లేరు రిజర్వాయర్‌ లేకుండా ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమంటున్న అధికారులు

చింతలపూడి ఎత్తిపోతల తొలిదశలో 2 లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులకు  దివంగత సీఎం వైఎస్‌ శ్రీకారం

అప్పట్లో జల్లేరు రిజర్వాయర్‌ను 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయం

ఆ తర్వాత 4.82 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ‘చింతలపూడి’ సామర్థ్యం పెంపు

దీంతో ‘జల్లేరు’ సామర్థ్యాన్నీ 8 నుంచి 14 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి : చింతలపూడి ఎత్తిపోతల నుంచి జల్లేరు రిజర్వాయర్‌ను ప్రభుత్వం తొలగించింది. తొలిదశలో ఎత్తిపోతల, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు సాగర్‌ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 25.94 లక్షల మందికి తాగునీరు అందించాలని నిర్దేశించింది. ఈ పనులను 2026, జూన్‌ నాటికి పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

కానీ, జల్లేరు రిజర్వాయర్‌ నిర్మించకుండా ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖాధికారులు, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల వంటి పథకాలు పూర్తయిన నేపథ్యంలో గోదావరికి వరద వచ్చే రోజులు తగ్గాయని.. నీటి నిల్వకోసం జల్లేరు రిజర్వాయర్‌ను నిర్మించకపోతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందవని తేల్చిచెబుతున్నారు.

మెట్టప్రాంతాలను సుభిక్షం చేసేలా..
వాస్తవానికి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించి, సుభిక్షం చేయాలనే లక్ష్యంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2008, అక్టోబరు 28న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆయకట్టుకు నీళ్లందించడం కోసం జల్లేరు రిజర్వాయర్‌ పనులను 8 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. 

దీంతో గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్‌ ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 2016, సెప్టెంబరు 3న పెంచారు. ఎత్తిపోతల ద్వారా కొత్త, పాత ఆయకట్టు కలిపి 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించాలంటే జల్లేరు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 8 నుంచి 14 టీఎంసీలకు పెంచాలని ఎస్‌ఎల్‌ఎస్‌సీ (స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ) చేసిన ప్రతిపాదనపై 2020, మే 20న గత ప్రభుత్వం ఆ­మోదముద్ర వేసింది. ఆ మేరకు పనులు చేపట్టింది.

ఇప్పటికే రూ.4,122.83 కోట్లు వ్యయం
ఆ తర్వాత.. గోదావరి నుంచి రోజుకు 6,870 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీలను ఎత్తిపోసి.. జల్లేరు రిజర్వాయర్‌లో 14 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా 4.80 లక్షల ఎకరా­లకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతల­ను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం పనులకు 2008 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.4,122.83 కోట్లు వెచ్చించింది. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే తొలిదశ పంప్‌ హౌస్, ప్రధాన కాలువలో 36 కిమీల వరకూ పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువలో 36 కిమీ నుంచి 106.25 కిమీ వరకూ పనుల్లో దాదాపు 50 శాతం పూర్తయ్యాయి.

 జల్లేరు రిజర్వాయర్‌ సహా ఈ ఎత్తిపోతల పూర్తవ్వాలంటే ఇంకా రూ.5,198 కోట్లు అవసరం. రిజర్వాయర్‌ పనుల కోసం 6,880 ఎకరాల అటవీ భూమి సేకరించాలి. ఇది సవాల్‌గా మారడంతో జల్లేరు రిజర్వాయర్‌ పనులను తర్వాత చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రిజర్వాయర్‌ నిర్మిస్తేనే 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమవుతుందని.. రిజర్వాయర్‌ నిర్మించకపోతే ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖ అధికారులతోపాటు నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తుండటం గమనార్హం. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
Water Resources Department
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.