Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పాలీగ్రాఫ్‌తో పటాపంచలు
ADVERTISEMENT 

పాలీగ్రాఫ్‌తో పటాపంచలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 15, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
files.jpg

మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సర్కారు కట్టుకథలు 

ప్రధాన నిందితుడు గౌతమ్‌తేజ్‌కు పాలీగ్రాఫ్‌ పరీక్షతో వాస్తవాలు వెలుగులోకి 

కీలక ప్రశ్నలకు జవాబులు రాబట్టిన ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు 

నిందితుడు నేరం చేసినట్లు నిర్థారణ కాలేదని నివేదికలో వెల్లడి 

బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): మదనపల్లె ఆర్డీ­వో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి నిప్పు లాంటి నిజాలు బయటకొస్తు­న్నా­యి. గతేడాది జూలై 21వ తేదీ రాత్రి అగ్ని ప్రమాదం జరిగితే.. ఫైళ్లు దహనం చేశారంటూ సీఎం చంద్ర­బాబు సర్కారు చేసిన ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యా­లయం సీనియర్‌ అసిస్టెంట్‌ జి.గౌతమ్‌తేజ్‌కు నిర్వహించిన పాలీగ్రాఫ్‌ పరీక్షలో నేర నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడైంది. 

అతడే నేరం చేశాడని నిరూపించలేమని అందులో పేర్కొ­న్నారు. దీంతో ఇదంతా కావాలని చేసిన సంఘ­టనగా ప్రభుత్వ వ్యవస్థలతో చిత్రీకరించేందుకు కూటమి సర్కారు పన్నిన కుట్రలు  బెడిసికొ­ట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించిన కూటమి ప్రభుత్వం మదనపల్లె  ఘటనలో మాత్రం డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఆగమేఘాలపై హెలికాప్టర్‌­లో ఘటనాస్థలానికి పంపి ఏదో జరి­గి­పోయిందంటూ హంగామా చేసిం­ది.

గౌతమ్‌తో­పాటు అప్పటి ఆర్డీవో మురళి, మరి­కొందరు కలసి కార్యాలయానికి నిప్పు పెట్టా­రని, భూములకు సంబంధించిన ఫైళ్లను దహనం చేశారంటూ ఆరోపించింది. ఈ ఘటనపై తొలుత అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సెక్షన్లు, కేసు దర్యాప్తు తీరును మార్చేశారు. 

నాలుగు ప్రశ్నలు..
ఈ కేసు మొత్తం గౌతమ్‌తేజ్‌ చుట్టూ తిరిగింది. కుట్ర కోణం ఉందనే అనుమానంతో సీఐడీ అధికారులు పాలీగ్రాఫ్‌ పరీక్షలు చేయించారు. తెరవెనుక ఎవరైనా ఉన్నారా? ఎవరి పాత్ర ఏమిటి? అనే వాటిని వెలుగులోకి తేవాలని భావించారు. ఓ కేసుకు సంబంధించి వాస్తవా­లను వెలుగులోకి తేవడం కోసం కీలకమైన పాలీగ్రాఫ్‌ పరీక్షను అత్యంత పటిష్టంగా నిర్వహి­స్తారు.

సీఐడీ అధికారుల వినతి మేరకు 2024 నవంబర్‌ 26, 27వ తేదీల్లో అమరావతి ఏపీఎఫ్‌­ఎస్‌ఎల్‌ అధికారులు నిందితుడికి పాలీగ్రాఫ్‌ పరీక్షలను నిర్వహించారు. సాంకేతికంగా నిజా­లను రాబట్టేందుకు గౌతమ్‌తేజ్‌కు నాలుగు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలి­సింది. 

అగ్నిప్రమాదం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్‌ తపస్విని ఫోన్‌ చేసి చెప్పడానికి ముందే మీకు తెలుసా..? 
సెక్షన్‌లో నిప్పు పెట్టింది మీరేనా? 
కార్యాలయంలో ప్రమాదం సృష్టించడానికి ఎవరితోనైనా కలసి ఇలా చేశారా?
అగ్ని ప్రమాదానికి కారణాలను దాచి పెడు­తున్నారా? 
అనే నాలుగు ప్రశ్నలకు ‘కాదు..’ అని గౌతమ్‌­తేజ్‌ సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమా­చారం. 
దీంతో ప్రమాదంలో కుట్ర కోణం లేదని, తెర వెనుక ఎవరి ప్రమేయం లేదని, ఇందులో భూముల వ్యవహారం కూడా లేదని తేలిపోయింది. అరెస్టు సమయంలో గౌతమ్‌తేజ్‌ నుంచి సేకరించిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు మినహా ఈ కేసులో నేర నిరూపణకు ఇతర ఆధారాలేవీ లేవని అతడికి బెయిల్‌ మంజూరు సమయంలో న్యాయస్థానం సైతం పేర్కొంది. 

వ్యవస్థలతో దుష్ప్రచారం..
మదనపల్లె ఫైల్స్‌ వ్యవహారంలో సీఎం చంద్ర­బాబు పదేపదే అబద్ధాలు వల్లె వేశారు. ప్రమాదం జరిగిన మర్నాడు నాటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్య­న్నార్‌లను హెలి­కాప్టర్‌లో మదనపల్లెకు హుటా­హుటిన పంపారు. కనీసం దర్యాప్తు కూడా జరగక ముందే ఇది యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌ అని నాడు డీజీపీ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సెక్షన్లను మార్చడంతో కేసు దర్యాప్తు తీరు పూర్తిగా మారిపోయింది.

వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కేసుల నమోదుతో వేధింపులకు గురి చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలు సైతం వెబ్‌సైట్‌లో మాయం చేశారు. ఇక రెవెన్యూశాఖ ముఖ్య కార్య­దర్శి సిసోడియా ఏకంగా మదనపల్లెలో మకాం వేసి అణువణువూ గాలించినా ఫలితం శూన్యం. వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతి­పరులు, ఉద్యోగులు, అధికారులను సీఐడీ రోజుల తరబడి విచారించింది. సీఐడీతోపాటు రెవెన్యూ, పోలీసు, ఫైర్, విద్యుత్‌ శాఖల ఉన్నతాధికారులను మదనపల్లెలో మోహరించింది.

పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షగట్టి విష ప్రచారం..
ఈ అగ్ని ప్రమాదం ఘటనను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆపాదిస్తూ కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలు పదేపదే విష ప్రచారం చేశా­రు. మదనపల్లెలో ప్రభుత్వ భూము­లను దోచుకున్నారంటూ తప్పుడు ఆరోపణలతో బురద చల్లారు. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేకున్నా మాజీ ఎమ్మెల్యే నవాజ్‌­బాషా, పెద్దిరెడ్డి మద్దతుదారులను అక్రమ కేసులతో వేధించారు. 

ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోగా, ఎల్లో మీడియా దీనికి వంత పాడింది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక! అంటూ తప్పుడు కథ­నాలను వండి వార్చింది. పచ్చ మీడియాలో ఏది రాస్తే పోలీసులు దాన్నే పాటించారు. విషపూరిత కథనాలను ప్రచురించిన రోజే నేతల నివాసాల్లో సోదాలు జరిగేవి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Madanapalle
rdo office
Andhra Pradesh
Fire Accident
Chandrababu Naidu
gautam
polygraph test
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.