Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పదే పదే ‘మెగా’ అబద్ధం!
ADVERTISEMENT 

పదే పదే ‘మెగా’ అబద్ధం!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 7, 2026 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dsc_20f.jpg

డీఎస్సీ–2025లో దగాపడ్డ అభ్యర్థులపై సర్కారు దుష్ప్రచారం 

1:1 నిష్పత్తికి వక్రభాష్యం.. ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచారంటే ఎంపికైనట్టే కదా.. అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానం కరువు

కాల్‌ లెటర్‌ పంపారంటే జాబు వచ్చినట్టు కాదా?

పేపర్‌ లీకేజీపైనా సమాధానం చెప్పని ప్రభుత్వం 

ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రెండు టాప్‌ ర్యాంకులు ఎలా వచ్చాయి?

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తప్పు­లను కప్పిపుచ్చి కూటమి ప్రభుత్వం నష్టపోయిన అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆధారాలతో సహా అక్రమాలు బయటపడినా, ఎక్కడా తప్పు జరగలేదని, తప్పంతా అభ్యర్థులదే అన్నట్టుగా బుకాయిస్తోంది. ‘ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని (1:1 నిష్పత్తి) మాత్రమే’ సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, ఇప్పుడు ఆ విధానానికే వక్రభాష్యం చెబుతోంది. ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం అంటే అర్థం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాల్‌ లెటర్లు పంచారంటే ఉద్యోగం వచ్చినట్లే కదా.. అని నిలదీస్తున్నారు.

మెరిట్‌ అభ్యర్థులకు మాత్రమే కాల్‌లెటర్లు పంపామని చెబుతున్నప్పుడు.. ఎంపిక జాబితా లేదా తిరస్కరణ జాబితాలో ఏదో ఒకదాంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వారిని ఆ రెండు లిస్టుల్లోనూ ఎందుకు చూపలేదన్న ప్రశ్నకు అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని సరైన సమాధానం చెప్పడం లేదు. అంతా వదిలేసి హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలును అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పడంపై నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

వాస్తవానికి ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రెండు టాప్‌ ర్యాంకులు ఎలా వచ్చాయి?, అతన్ని ఎందుకు కౌన్సెలింగ్‌కు రాకుండా అడ్డుకున్నారో తేల్చడం లేదు. చేసిన తప్పులను వదిలేసి బాధిత అభ్యర్థులదే తప్పు అన్నట్టు దుష్ప్రచారం చేయడం విస్తుగొల్పుతోంది. జరిగిన తప్పులపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం అభ్యర్థులపై ఎదురుదాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. 

వీరందరినీ ఎందుకు పిలిచారు? 
కూటమి ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలోనే ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం ఆ అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజాంటల్‌ రిజర్వేషన్‌ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తుంది. అంటే.. ఫలితాల్లో ఉన్న అభ్యర్థులంతా దాదాపు ఎంపికైనట్లే. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరైన పత్రాలు అందించేందుకు నిర్ణీత గడువు ఇస్తారు. ఆలోగా సదరు అభ్యర్థి అన్ని పత్రాలు సరైనవేనని నిరూపించుకుంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. లేదంటే అతని తర్వాత ఉన్నవారిని పిలుస్తారు. 1:1 నిష్పత్తి ఇలాగే కొనసాగుతుంది. 

కానీ డీఎస్సీలో మాత్రం ఈ విధానం పాటించకుండా విచ్చలవిడిగా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అని బుకాయిస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చి అన్నీ సక్రమంగా ఉండి కూడా అటు ఎంపిక జాబితాలో ఇటు తిరస్కరణ జాబితాలోనూ లేకుండా ఉన్నవారు దాదాపు 1,500 మంది అభ్యర్థులు ఉన్నారు. మెరిట్‌లో లేకుంటే వీరందరినీ ఎందుకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు? పై రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదు? ఈ ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటికి చెందిన పుష్పాంజలికి ప్రభుత్వం పంపిన కాల్‌ లెటర్‌ 

వైఎస్సార్‌ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హైమావతికి ప్రభుత్వం పంపిన కాల్‌ లెటర్‌ 

ఆ ర్యాంకర్‌ వివరాలు తొలగించి.. 
డీఎస్సీ ఫలితాలు విడుదలలో భాగంగా తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్‌ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్‌ స్టడీస్‌ టాపర్‌గా డీఎస్సీ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నవీన్‌ నిలిచాడు. ఇతను సోషల్‌ స్టడీస్‌లో మొదటి ర్యాంకు, టీజీటీ (తెలుగు) జోన్‌–2లో ఆరో ర్యాంకు సాధించాడు. అయితే, తొలుత అతడి వివరాలతో మెరిట్‌ లిస్టు విడుదల చేశారు. 

అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని ఆ లిస్టులను రద్దు చేసి, రెండో ర్యాంకు నుంచి రెండో లిస్టు విడుదల చేశారు. ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడంతో నవీన్‌ ఆధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యో­గు­లను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. 

కానీ ఇక్కడ మాత్రం ఆన్‌లైన్‌ ప్రశ్నలు అప్‌లోడ్‌ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించినట్టు తీవ్రమైన ఆరోపణలు­న్నాయి. ఫలి­తాల్లో అతడు టాపర్‌గా నిలిచినా పోస్టు ఇవ్వకుండా, అతడి క్యాండిడేట్‌ లాగిన్‌ ఐడీని బ్లాక్‌ చేశారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు బయటకు వెళ్లిపోయాయన్న ఆరోపణలపైనా చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేయకపోగా తప్పుడు ఆరో­పణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.

సీబీఐ విచారణ చేయాలి
మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అధికారులు మాత్రం పారదర్శకంగా జరిగినట్టు వివరణ ఇవ్వడం హాస్యాస్పదమని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబేటి రామచంద్ర విమర్శించారు.  డీఎస్సీ–2025 చాలా మందికి చివరి అవకాశంగా కష్టపడి చదివి మెరిట్‌ సాధించారని, అలాంటి వారికి సైతం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీలో జరిగిన దారుణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

హారిజాంటల్‌లో ఒక్కటి.. నింపింది రెండు
చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఎం.ఏకాంబరం (బీసీ–డీ 125 ర్యాంకు) ఘటనను తీసుకుంటే.. ఈ జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పోస్టులు బీసీ–డీ కేటగిరిలో 7 ఉన్నాయి. ఇందులో రెండు ఓపెన్‌లోను, 5 పోస్టులు లోకల్‌ మెరిట్‌కు కేటాయించారు. హారిజాంటల్‌లో ఐదింటిలో ఒకటి ఉమెన్‌కు కేటాయించారు. బీసీ–డీ విభాగం మెరిట్‌లో చివరి ర్యాంక్‌ 114 అని ఒకసారి, 116 అని మరోసారి అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం చూస్తే్త 114 ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినప్పటికీ బీసీ–డీలో చూపించారు. 


116 ర్యాంకు ఉమెన్, ఈమె మెరిట్‌ లిస్టులో ఎంపికైంది కాబట్టి ఇక హారిజాంటల్‌ రిజర్వేషన్‌లో కేటాయించిన ఒక పోస్టును తర్వాత మెరిట్‌లో ఉన్న ర్యాంకుకు కేటాయించాలి, అంటే 125 ర్యాంకు అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలి. కానీ, జనరల్‌ మెరిట్‌లో ఉన్న ఏకాంబరాన్ని కాదని, రెండు పోస్టులను హారిజాంటల్‌లో స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఇచ్చారు. వాస్తవానికి బీసీ–డీలో ప్రకటించిన 7 పోస్టుల్లో వీరికి ఒక్క పోస్టు కూడా చూపలేదు. కానీ చట్ట ప్రకారం ఒక్క పోస్టునే ఇవ్వాల్సి ఉన్నా రెండు పోస్టులు ఇవ్వడం గమనార్హం.

చట్టాన్ని కాదని ఎస్టీ అభ్యర్థికి అన్యాయం
కడప జిల్లాలకు చెందిన ఎం.జగదీష్‌ నాయక్‌ విషయంలో ప్రభుత్వం చట్టానికి కొత్త అర్థం చెబుతోంది. ఎస్టీ కేటగిరీకి చెందిన జగదీష్‌ డీఎస్సీలో 363 ర్యాంకు సాధించారు. జిల్లాలో ఎస్జీటీ ఉర్దూ మీడియం (బ్యాక్‌లాగ్‌) 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2 జనరల్, మరో 2 ఉమెన్‌ అభ్యర్థులకు కేటాయించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ముగ్గురిని మాత్రమే పిలిచారు. ఇందులో రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరు మేల్, ఇంకొకరు ఫీమేల్‌గా పేర్కొన్నారు. ‘మిగిలిన రెండు పోస్టులను అర్హులైన ఎస్టీ ఉమెన్‌ అభ్యర్థులు లేక భర్తీ చేయలేదని’ ప్రకటించారు. 

» గతేడాది కూటమి ప్రభుత్వం మైన్స్‌ అండ్‌ జియా­లజీ శాఖలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఒకటి భర్తీకి (క్యారీఫార్వర్డ్‌) నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారు. 1996లో జీఏడీ ఇ­చ్చిన జీవో 436 ప్రకారం హారిజాంటల్‌ రిజర్వే­షన్‌లో అర్హత గల మహిళా అభ్యర్థి లేకపోతే తర్వా­త మెరిట్‌లో ఉన్న పురుష ఎస్టీ అభ్యర్థిని పరిగ­ణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం డీఎస్సీలో అర్హత గల పురుష ఎస్టీ అభ్యర్థి జగదీష్‌ నాయక్‌ ఉన్నా, అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు.  

ఓసీ–ఈడబ్లు్యఎస్‌ పోస్టు బీసీకి ఎలా ఇస్తారు? 
అన్నమయ్య జిల్లా రాయ­చోటికి చెంది­న సయ్యద్‌ జ­మీల్‌ డీఎస్సీ ఎస్‌­ఏ బయలా­జికల్‌ సైన్స్‌ (ఉర్దూ మీడి­యం)లో 11వ ర్యాంకు సాధించా­రు. బయోలాజికల్‌ సైన్స్‌లో 2 పోస్టులు ఉండగా, ఒకటి ఓసీ–ఈడబ్ల్యూ­ఎస్‌కు రి­జర్వ్‌ చేశారు. ఇతనికంటే ముందున్న మరో అ­భ్యర్థి 7వ ర్యాంకులో ఉండటంతో పోస్టు­కు అతన్ని ఎంపిక చేశారు. వాస్తవానికి పోస్టుకు ఎంపికైన అభ్యర్థి (బీసీ–ఈ) ముస్లిం. ఇదే కేటగిరీలో 2008, 2012, 2014, 2018 డీఎస్సీలకు హాజర­య్యా­డు. 

2025లో అ­తడు ఓసీ­–ఈ­డబ్ల్యూ­ఎస్‌గా నమోదు చేసుకుని త­ప్పుడు కుల­ధ్రువీ­కరణ పత్రాలతో ఉ­ద్యోగం పొందాడు. ఇతనివి తప్పుడు పత్రాలని ఆధా­రాలతో సయ్యద్‌ జమీల్‌ నిరూపించినా అధికా­రులు పట్టించుకో­లేదు. బాధితుడు ఆధారా­లతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కా­ర్యా­లయంలోని గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేయగా ‘ఆరో­పణలు ఎదుర్కొంటున్న అభ్య­ర్థి సర్టిఫి­కెట్లు తప్పుడువని తహసీల్దార్‌తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’ అని ఓ అధికారి మాట్లాడా­రని వాపోయాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
DSC
irregularities
Outsourcing employee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.