సాక్షి, అనంతపురం: రాప్తాడు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా టిప్పర్ దూసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనాన్ని టిప్పర్ స్వల్పంగా ఢీకొంది. శింగనమల నియోజకవర్గం సి.బండమీదపల్లి గ్రామం వద్ద ఘటన జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంస్థకు చెందిన టిప్పర్గా గుర్తించారు. ఘటనను ఎస్పీ దృష్టికి తోపుదుర్తి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ADVERTISEMENT
ADVERTISEMENT