Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పేదల ప్రాణాలతో చెలగాటమాడటం తగదు
ADVERTISEMENT 

పేదల ప్రాణాలతో చెలగాటమాడటం తగదు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 20, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
appaluraju.jpg

ఒకే ఊరిలో 450 మందికి కష్టం వస్తే స్పందించే తీరు ఇదేనా?

స్కూల్లో బల్లలపై పడుకోబెట్టి వైద్యం చేయిస్తున్నారు

రోగులకు బెడ్లు వేయలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం

వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పల­రాజు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి అప్పలరాజు డయేరియా విజృంభించిన విజయనగరం జిల్లాలోని గుర్ల మండల కేంద్రంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.

అనంతరం ఆయన మీడి­యాతో మాట్లాడుతూ వారం రోజులుగా ఒకే ఊరిలో 450 మంది అతిసారం బారినపడి బాధపతున్నారని, వారిలో 11 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా పేదలు మృతి చెందారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ వైద్య వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది అప్పగించారని... కానీ చంద్ర­బాబు ప్రభుత్వం డయేరియా బాధితులకు వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బెంచీలు, కుర్చీలపై రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నా­రంటేనే ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కనీసం రోగులకు బెడ్‌ కూడా వేయకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్‌ జగన్‌ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు–నేడు’ అభివృద్ధి పనుల వల్లే ఇప్పుడీ బెంచీలు, విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా సదుపాయాలు కలిగాయని, ఒకవేళ గుర్ల పాఠశాలను ఇలా తీర్చిదిద్ది ఉండకపోతే ఇప్పుడు రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేసేవారా...? అని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల్లోని పీహెచ్‌సీల నుంచి బెడ్స్‌ తీసుకొచ్చి వేయించడం కూడా తెలియదా..? అని మండిపడ్డారు. ఇవేవీ చేయలేనప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ ఎందుకొచ్చారని, ఫొటోలు తీయించుకోవడానికా అని నిలదీశారు.

సీఎం చంద్రబాబు మద్యం మత్తు, ఇసుక మాఫియా నుంచి బయిటకొచ్చి పేదల గురించి పట్టించుకోవాలని అన్నారు. ఆకస్మిక తనిఖీల పేరుతో వైజాగ్‌ వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ పక్కనేవున్న గుర్ల మండలంలో వందల మంది కష్టంలో ఉంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, రక్షిత నీటి విభాగం శాఖల పూర్తి వైఫల్యానికి నిదర్శనమే గుర్ల విషాదమ­న్నారు. ఆ రెండు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌ దీనికి సమాధానం చెప్పాలన్నారు. 

వందలా­ది ప్రజలు డయేరియాతో అల్లాడుతుంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం పట్టించుకోక­పోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా గ్రామంలో జ్వరాలు వస్తే తక్షణమే ఫీవర్‌ సర్వే చేయించి కారణాలు తెలుసుకుని నిరోధించే చర్యలు చేపట్టే వారమని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివసరావు చెప్పారు. ఇప్పుడీ ప్రభుత్వం డయేరియా రోగులను స్కూల్‌ పిల్లల బెంచీలపై పడుకోబెట్టి కర్రలు కట్టి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించే దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Sidiri Appalaraju
Chandrababu Naidu government
Andhra Pradesh
diarrhea
vizianagaram district
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.