Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. 'ఎగ్‌'బాకింది
ADVERTISEMENT 

'ఎగ్‌'బాకింది

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 29, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
eggs.jpg

ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి  చేరిన గుడ్డు ధర 

హోల్‌సేల్‌లో రూ.7.. రిటైల్‌లో రూ.8 నుంచి రూ.8.50 వరకు విక్రయాలు 

ఈ ప్రభావంతో పెరిగిన గుడ్డు వంటకాల ధరలు 

సాధారణ టిఫిన్‌ దుకాణంలో ఎగ్‌ దోశపై రూ.5 పెంపు 

చికెన్‌ ధర కూడా పైపైనే...

విజయవాడ  సత్యనారాయణపురంలో రోజూ మాదిరిగా రమేష్‌ తన స్నేహితులతో అల్పాహారం కోసం ఓ టిఫిన్‌ దుకాణానికి వెళ్లాడు. మూడు డబుల్‌ ఎగ్‌ దోశలు ఆర్డర్‌ చేసి తిన్నారు. ఎప్పటిలాగే దోశ రూ.40 చొప్పున  మూడు దోశలకు రూ.120 ఫోన్‌ పే చేశాడు.  ఆ సౌండ్‌ విన్న యజమాని మరో రూ.30 చేయండి బాబూ.. గుడ్లు ధర బాగా పెరిగిందని చెప్పాడు. దీంతో రమేష్‌ అదనంగా డబ్బులు చెల్లించి ఏంటి గుడ్డు రూ.8 అయిపోయిందా అంటూ అక్కడి నుంచి  వెళ్లిపోయాడు. 

విశాఖ నగరంలోని ఎండాడలో సత్యవతి అనే మహిళ ఇంటికి సమీపంలోని కిరాణాదుకాణానికి వెళ్లి అరడజను గుడ్లు అడిగింది. దుకాణదారుడు గుడ్డు రూ.8.50 అని చెప్పడంతో ఆమె అవాక్కయింది. ఎప్పుడూ ఇంత రేటు చూడలేదని నాలుగు గుడ్లుతో సరిపెట్టుకుంది. దుకాణదారుడు అమ్మా కొద్ది రోజుల్లో గుడ్డు ధర రూ.10 కి చేరవచ్చని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారని అనడంతో ఆమె ఆశ్చర్యపోయింది. 

ఇలా వీరే కాదు రాష్ట్రంలోని ఏ ఎగ్, చికెన్‌ మార్కెట్‌కి వెళ్లినా ప్రస్తుతం పెరిగిన గుడ్లధర గురించే చర్చ నడుస్తోంది. చికెన్‌ ధరలు కూడా అందనంత దూరంలో ఉన్నాయని ప్రజలు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు.   – ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

నాన్‌ వెజ్‌ ప్రియులు  జిహ్వచాపల్యాన్ని తీర్చుకోలేకపోతున్నారు.పెరిగిన గుడ్లు, చికెన్‌ ధరలతో అటు వైపు చూడడానికి సాహసించడంలేదు. ఒకవైపు పెరిగిన కూరగాయల ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే మరోవైపు గుడ్డు ధర ఆల్‌టైం రికార్డుస్థాయికి చేరింది. హోల్‌సేల్‌లోనే రూ.7 పలుకుతోంది. ఇక కిరాణాషాపులు, చిన్న చిన్న దుకాణాల్లో రూ.8 నుంచి రూ.8.50 వరకూ విక్రయిస్తున్నారు. 

ఈ ప్రభావంతో గుడ్డు, చికెన్‌తో తయారయ్యే ఆహారపదార్థాల ధరలు పెంచేశారు. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరగడంతో ఏం తినాలి.. ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డుధర ఇంత ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు సైతం చెప్పడం విశేషం. 

తక్కువ ట్రేలే తెస్తున్నాం 
గుడ్లు ధర భారీగా పెరగడంతో చిరువ్యాపారులు సైతం స్టాక్‌ తగ్గించుకుంటున్నారు. గతంలో హోల్‌సేల్‌ దుకాణం నుంచి 10 ట్రేల గుడ్లు తెచ్చే వారు ప్రస్తుతం పెరిగిన ధరలకు భయపడి స్టాక్‌ తగ్గించేస్తున్నామని చెబుతున్నారు. ఒక్క సారిగా ధర తగ్గిపోతే నష్టపోవాల్సి వస్తుందనే భయంతో తక్కువగా తెస్తున్నామని.. హోల్‌సేల్‌ వ్యాపారులు మాత్రం ఇప్పట్లో ధర తగ్గదు... పెరుగుతుందని చెబుతున్నా... వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్‌ చేయలేక పోతున్నామంటున్నారు.   

ఎగ్‌ వంటకాల ధరలకు రెక్కలు 
15 రోజుల్లోనే గుడ్డు ధర రూ.6 నుంచి రూ.8కి చేరడంతో వంటకాల ధరలు కూడా వ్యాపారులు పెంచేశారు.సాధారణ టిఫిన్‌షాపులోనే సింగిల్‌ ఎగ్‌ దోశపై రూ.5, డబుల్‌ ఎగ్‌ దోశపై రూ.10 వరకూ పెంచేశారు. ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్‌లలో మరింత పెంచారు. 

ఎగుమతులు పెరగడమే కారణమా! 
రాష్ట్రంలో భారీగా కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఇందులో 60 శాతం వరకూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు 5 కోట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 4.70 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 60 శాతం వరకూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం,ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో చేపలు ఎక్కువగా వినియోగిస్తారు.  నవంబర్‌ నుంచి జనవరి వరకూ ఆ రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి తగ్గడంతో గుడ్లకు విపరీతమైన డిమాండ్‌ పెరుగుతోంది.  

దిగిరాని చికెన్‌ 
చికెన్‌ధరలు  దిగిరావడం లేదు. కార్తీకంలో కూడా కిలో రూ.200కు పైగానే కొనసాగింది. అలా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో రూ.260 పలుకుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, విజయవాడ జిల్లాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 పలకడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కోడి కూర వైపు చూడడానికి సాహసించడం లేదు.

చికెన్, గుడ్లు తినలేకపోతున్నాం 
నేను జూపాడుబంగ్లా గ్రీన్‌అంబాసిడర్‌గా పనిచేస్తున్నా. నాకు నెలకు రూ.6 వేల వేతనం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలతో సతమతం అవుతున్నాను. కనీసం నెలకోమారైనా చికెన్, గుడ్లు తిందామనుకొంటే చికెన్‌ కిలో రూ.260, గుడ్లు డజన్‌(12) రూ.100 చెబుతున్నారు. నాకొచ్చే అరకొర వేతనంతో చికెన్, గుడ్లు కొనుక్కొని తినలేని పరిస్థితి నెలకొంది.  – రమణమ్మ, జూపాడుబంగ్లా, నంద్యాల జిల్లా  

గుడ్డు రేటు ఇంతా! 
సీజన్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది గుడ్లు, చికెన్‌ ధర పెరుగుతోంది. గుడ్డు ధర రూ.8.50 అంటే సామాన్యులు ఎలా కొనుక్కొని తినగలరు. చికెన్‌ధర కూడా అందనంత దూరంలో ఉంది. – ఎం.మణి, మంగమారిపేట, విశాఖపట్నం

ఇంత రేటు ఎప్పుడూ చూడలేదు 
నాకు తెలిసి గుడ్డు ఎప్పుడూ ఇంత రేటు చూడలేదు. గుడ్డు రూ.8.50 పెట్టి కొనాలంటే కష్టం. ధర ఒక్కసారిగా పెరగడంతో ఎగ్‌ దోశ రేటు పెంచారు. సింగిల్‌ ఎగ్‌ దోశపై రూ.5. డబుల్‌ ఎగ్‌ అయితే రూ.10 పెరిగింది.–గౌరినాయుడు,సత్యనారాయణపురం, విజయవాడ

గుడ్లు కూడా కొనలేకపోతున్నాం 
మధ్యతరగతి వాళ్లకు వారానికి ఒక్క రోజైనా చికెన్‌ తినాలని ఉంటుంది. అయితే ఇప్పుడు చికెన్‌ కాదు కదా.. కోడిగుడ్లను కూడా కొనే పరిస్థితి లేదు. కేజీ చికెన్‌ ధర రూ.280పైనే ఉంది. కోడిగుడ్లతో సరిపెడదామా అంటే డజన్‌ వంద రూపాయలు అంటున్నారు. చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో  ఇబ్బంది పడుతున్నాం. 
- భాస్కర్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
record price
chicken
egg price
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.