Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మనవరాలిని చూద్దామనుకొని మరలిరాని లోకాలకు..
ADVERTISEMENT 

మనవరాలిని చూద్దామనుకొని మరలిరాని లోకాలకు..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 27, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
12122.jpg

రోడ్డు ప్రమాదంలో రెండు వేర్వేరు  కుటుంబాలకు చెందిన నలుగురి మృతి 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతితో మార్కొండపాడులో విషాదం 

కొవ్వూరులో బయలుదేరిన 30 నిమిషాల్లోనే ఘోర దుర్ఘటన

మనవరాలిని చూడడానికి బయలుదేరిన వారు... ఆమెను కలవకుండానే అనంత లోకాల కు చేరుకున్నారు. వీరిని తమ కారులో తీసుకువెళుతున్న వారు కూడా ప్రమాదంలో చిక్కుకోవడంతో మరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. 

రాజానగరం/చాగల్లు/తాళ్లపూడి(కొవ్వూరు)/కంబాలచెరువు(రాజమహేంద్రవరం):  రాజానగరం మండలం, దివాన్‌చెరువు శివారు గామన్‌ బ్రిడ్జి హైవేపై కొంతమూరు కేశవస్వామి ఆస్పత్రి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో కొవ్వూరు, చాగల్లు మండలాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. దారవరం గ్రామానికి చెందిన లకంసాని సురేష్‌ భార్య బిందు (34), కొవ్వూరుకు చెందిన ఉప్పులూరి ప్రసాద్‌ (60), భార్య శివ లీలావతి (56)తో పాటు లీలావతి తల్లి చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన ఇమ్మణి వీరవెంకట సత్యవతి(75) కలిసి సోమవారం ఉదయం కారులో కొవ్వూరు నుంచి కాకినాడ వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లకంసాని సురేష్‌ తో పాటు భార్య బిందు కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. పక్కపక్కనే నివాసం ఉంటున్న సురేష్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు బంధువులు కూడా. వీరంతా సురేష్‌ కారులో ఇంటి నుంచి బయలుదేరిన 30 నిమిషాల్లోనే మృత్యువాత పడటంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మనవరాలు కన్నీరు మున్నీరు..
మార్కొండపాడుకు చెందిన ఇమ్మణి సత్యవతి 20 రోజులు క్రితం కుమార్తె శివ లీలావతి అస్వస్థతకు గురి కావడంతో చూడ్డానికి వెళ్లారు. ఉప్పులూరి ప్రసాద్‌ కొవ్వూరులోని యువరాజ్‌ కేబుల్‌ ఆఫీసు వీధిలో ఇంట్లో నివాసం ఉంటున్నారు. ట్రక్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసాద్‌ హార్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. దీనికితోడు అతని భార్య శివ లీలావతి అనారోగ్యంతో బాధపడుతోంది. వీరి ఒక్కగానొక్క అమ్మాయి వివాహితైన భవాని సుమారు 15 ఏళ్ల కిందట విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. భవాని కుమార్తె పూజ (సిరి) కాకినాడలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మనవరాలి పూజను చూసేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ముది అమ్మమ్మ, తాత, అమ్మమ్మలు ఒక్కసారిగా మృతిచెందడంతో పూజ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 

ఏ నిమిషానికి ఏమీ జరుగునో.. 
మృత్యువు ఎప్పుడు, ఏ విధంగా కబళించుకుపోతుందో ఎవరికీ తెలీదు .. అంటే ఇదేనేమో? మండలంలోని దివాన్‌చెరువు గామన్‌ బ్రిడ్జి జాతీయ రహదారిపై కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో లారీ, కారు ఢీ కొన్న ప్రమాదాన్ని చూస్తే నిజమనిపిస్తుంది. నాలుగు లేన్లతో టు వే గా ఉన్న ఈ రహదారిపై ఒక వైపు కారు, రెండో వైపు లారీ ప్రయాణిస్తూ పై ప్రాంతంలో ఒకదానిని ఒకటి ఢీ కొనడం చూస్తుంటే .. భగవంతుని రాతను ఎవ్వరూ తప్పించలేరని ఈ ప్రమాదాన్ని చూసిన వారంతా అంటున్నారు. కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో ఉన్న జంక్షన్‌ వద్ద లారీని మలుపు తిప్పే క్రమంలో అటుగా వచ్చిన కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. 

దీనితో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి లారీ డ్రైవర్‌ రాజానగరం పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో నార్త్‌ జోన్‌ డీఎస్పీ వై. శ్రీకాంత్, సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ని క్రమబదీ్ధకరించి, ప్రమాదానికి గురైన రెండు వాహనాలను క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాదానికి గురైన వారి వివరాలను తెలుసుకోవడంతోపాటు ప్రమాదానికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ వీరయ్యగౌడ్‌ తెలిపారు.  

ఈ ప్రమాదంలో గాయపడ్డ లకంసాని ప్రసాద్‌కు కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో వెటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే మృతుల కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతిచెందిన లకంసాని బిందు, ఉప్పులూరి ప్రసాద్, అతని భార్య లీలావతి, ఇమ్మని వీరవెంకటసత్యవతి మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.  

టైర్‌ పంక్చర్‌ కాలేదు 
లారీ టైర్‌ పంక్చర్‌ కావడంతోనే కారుని ఢీకొట్టిందని చెబుతున్న మాటలు పూర్తి అవాస్తమని జిల్లా రవాణాశాఖాధికారి ఆర్‌.సురేష్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడా లారీ టైరు పేలిన దాఖలాలు లేవన్నారు. ప్రమాద స్థలికి సమీపంలో రవాణాశాఖాధికారులు వాహన తనిఖీలు చేస్తున్నారన్నారు. దాన్ని చూసి సడన్‌గా డ్రైవర్‌ లారీని తిప్పాడా...లేక క్లీనర్‌ లారీ డ్రైవ్‌ చేస్తున్నాడా అనేది తెలియాల్సి వుందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 71 మీటర్ల మేర లారీ టైరు జారిపోయినట్లు గుర్తులు ఉన్నాయన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.  

తెల్లారేసరికే మా కూతురు బతుకు తెల్లారిపోయింది 
దారవరానికి చెందిన లకంసాని సురేష్‌ కొవ్వూరులో అవంతి ఫీడ్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో భార్య బిందుతో కలిసి కొవ్వూరులో అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఈ ప్రమాదంలో సురేష్‌ కు తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. భార్య బిందు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. చాగల్లుకు చెందిన బిందుకు, సురే‹Ùకు సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మూడురోజుల క్రితం చాగల్లులో ఒక శుభాకార్యానికి హాజరై పుట్టింటికి వచ్చిందని, ఆదివారం రాత్రి ఫోన్‌ చేసి మాట్లాడిందని, సోమవారం అల్లుడు సురే‹Ùకు సెలవు కావడంతో బయటకు వెళ్లామని తనకు చెప్పిందని,  తెల్లారిసరికి అనంతలోకాలకు తన కూతురు వెళ్లిపోయిందని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి కొఠారు శ్రీను హృదయ విదారకంగా రోదిస్తున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Road Accident
Andhra Pradesh
Crime News
Three Dead
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.