సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా సోమవారం ఉదయం రెండు విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం నెలకొంది. ఇస్తాంబుల్ నుండి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో, ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు సమాచారం.
ADVERTISEMENT
ADVERTISEMENT