Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఈ ఘనత మోదీ, జగన్‌లదే 
ADVERTISEMENT 

ఈ ఘనత మోదీ, జగన్‌లదే 

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jagan11.jpg

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌లకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ ప్రాంతానికి రావడం పట్ల గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. విజయవంతమైన చంద్రయాన్‌–3 ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం సంతోషకరం అన్నారు.



ఇలాంటి రాష్ట్రంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయం అని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమష్టి కృషితో రూ.800 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారమవుతోందన్నారు. 561 ఎకరాల భూమి, విద్యుత్తు, రోడ్డు, నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్‌ చొరవ తీసుకొని ముందుకు వచ్చారని తెలిపారు. 21వ శతాబ్దానికి ఆధునిక దేవాలయమైన ఈ విశ్వ విద్యాలయం సాలూరు గిరిజన ప్రాంతంలో ఏర్పాటవ్వడం వల్ల పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్టాల్లోని గిరిజనులతో సామాజిక అనుబంధం ఏర్పడుతుందన్నారు.   



గిరిజనుల ప్రగతికి దోహదం 

ఇక్కడ ప్రసిద్ధి గాంచిన అరకు కాఫీ, నల్ల మిరియాలు, తేనె, పనస, పైనాపిల్‌ తదితర అటవీ పంటలపై పరిశోధనకు ఈ వర్సిటీ ద్వారా అవకాశం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. క్రీడా సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. ఒడిశాలో ఉన్న యూనివర్సిటీతో ఈ వర్సిటీ భాగస్వామ్యమైతే దేశంలో గిరిజనుల ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్లవచ్చని ఆకాంక్షించారు.



ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌ నుంచి ఒడిశా మీదుగా విశాఖ, గంగవరం పోర్టులను కలిపే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ట్రైబల్‌ వర్సిటీ ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, స్థానికంగా ప్రజల మాతృభాషనూ ప్రోత్సహిస్తూ బోధనలో బైలింగ్‌వల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.  

కళ్లెదుటే అభివృద్ధి 

► భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి గిరిజన ప్రాంతంలోకి వెళ్తుంటే మనం గిరిజనుల కోసం ఏం చేశామో కళ్లెదుటే కనిపిస్తోంది. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజినీరింగ్‌ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒకటి కాదు.. రెండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఏర్పాటు చేశాం. ఇవాళ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం.  



► రూ.వెయ్యి కోట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెడికల్‌ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లా పార్వతీపురంలో మరో మెడికల్‌ కాలేజీ వేగంగా నిర్మాణమవుతోంది. గిరిజన ప్రాంతానికి గేట్‌వేగా ఉన్న నర్సీపట్నంలో ఇంకో కాలేజీ కడుతున్నాం.  



► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణం మన కళ్ల ముందే కనిపిస్తోంది. గిరిజన తండాలో జనాభా 500 ఉంటే గ్రామ పంచాయతీగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటికే 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని మాట ఇచ్చాం. ఆ ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాలలో రూ.250 కోట్లు ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి.  



► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన అసైన్‌మెంట్‌ భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశాం. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YS Jagan Mohan Reddy
Narendra Modi
dharmendra pradhan
Tribal university
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.