Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. చిన్న దిమ్మలు... భలే గిరాకీ
ADVERTISEMENT 

చిన్న దిమ్మలు... భలే గిరాకీ

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bellam.jpg

కిలో బెల్లం దిమ్మలకు కొనుగోలుదారుల నుంచి విశేష ఆదరణ

చిన్న బెల్లం దిమ్మలకు గిరాకీ పెరిగింది. ఎటువంటి హానికర రసాయనాలు

వినియోగించకుండా తయారు చేస్తున్న కిలో బరువున్న బెల్లం దిమ్మలకు

కొనుగోలు దారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సహజ సిద్ధంగా,

రుచికరంగా  తయారు చేస్తుండడంతో డిమాండ్‌ ఏర్పడింది.    

కశింకోట:  చిన్న  పరిమాణం, తరలింపునకు  అనువుగా ఉండటంతో పాటు హైడ్రోస్‌ వంటి హానికర మందులు వినియోగించకుండా   తయారు చేస్తున్న చిన్న బెల్లం దిమ్మలకు  ప్రజల నుంచి  ఆదరణ లభిస్తోంది. దీంతో  ఆ రైతులు కూడా పెద్ద దిమ్మల తయారీకి స్వస్తి పలికి కేవలం కిలో పరిమాణం కలిగిన చిన్న దిమ్మలను తయారు చేస్తున్నారు. వీటిని తమ చెరకు క్రషర్ల వద్దే విక్రయిస్తుండడంతో  దారిన వెళ్లే ప్రయాణికులు  కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు మిగిలి, లాభదాయకంగా   ఉండటంతో మరింత ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు  రైతులు దృష్టి సారించారు.  అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని  తాళ్లపాలెం వద్ద వీటిని  తయారు చేస్తున్నారు.

తాళ్లపాలెం ప్రాంతంలో  రైతులు గతంలో పెద్ద ఎత్తున  చెరకు సాగు చేసి, తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీకి సరఫరా చేసే వారు. 8 ఏళ్ల  క్రితం పరిశ్రమ మూత పడటంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లారు.  మరి కొంత మంది   బెల్లం తయారీ చేపట్టారు.   బెల్లం తయారు చేసి అనకాపల్లి మార్కెట్‌కు తరలించడం, రవాణా ఖర్చులు, క్రషర్‌ అద్దెలు, వ్యాపారి కమిషన్‌ వగైరా పోనూ టన్నుంపావు చెరకు వినియోగించి తయారు చేసిన పాకం బెల్లానికి రూ.నాలుగైదు వేలు వరకు ఆదాయం వచ్చేది. 40 పాకాలు కావలసిన ఎకరం చెరకు తోట ఎదుగు బొదుగు లేక పది పాకాలు బెల్లం దిగుబడికి పడిపోతున్న పరిస్థితి.   పంటకు పెట్టిన పెట్టుబడి రాని దుస్థితి  ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇద్దరు రైతులు... ప్రజలు సులభంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకెళ్లే విధంగా ఆరోగ్యకరమైన బెల్లాన్ని కిలో చిన్న పరిమాణంలో తయారు చేయడం చేపట్టారు.

వాటిని విక్రయిస్తే రూ.7 వేల వరకు పాకం బెల్లానికి ఆదాయం వస్తోంది. పైగా హైడ్రోస్‌ వంటి హానికర మందులకు స్వస్తి పలికి సహజ సిద్ధంగా తయారు చేస్తున్నారు. ఈ చిన్న దిమ్మల తయారీని వారు ఆరేళ్ల క్రితం  చేపట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్నారు.  సొంతంగా   సాగు చేసుకున్న చెరకుతోపాటు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి మరీ బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. దిమ్మలతోపాటు బెల్లం తేనెను కూడా తయారు చేస్తున్నారు. బెల్లం గడ్డ కట్టడానికి ముందు ద్రవ రూపంలో ఉన్న  తేనెను సేకరించి సీసాల్లో నింపి  కిలో రూ.50 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు.

 తేనెను ఫ్రూట్స్‌ జామ్‌లా బ్రెడ్‌లతోను, టిఫిన్లతోను తినడానికి రుచికరంగా ఉండటంతో పలువురు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు.  పాకం బెల్లానికి దిగుబడి అనుసరించి వంద నుంచి  130 వరకు దిమ్మలు  తయారు అవుతున్నాయి.  ఒక్కో దిమ్మను రూ.50 నుంచి రూ.60కి  విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌కు తరలించే బెల్లానికి వచ్చే ఆదాయం  కంటే అదనంగా రూ.2 వేల వరకు  సమకూరుతోంది.

లాభదాయకంగా చిన్న దిమ్మల తయారీ 
చిన్న పరిమాణంలో బెల్లం దిమ్మల తయారీ లాభదాయకంగా ఉంది. పెద్ద దిమ్మలను  తయారు చేసి బెల్లం మార్కెట్‌కు తరలిస్తే ఆదాయం తక్కువగా వచ్చేది. అదే చిన్న దిమ్మలుగా  హైడ్రోస్‌ వంటి హానికర మందులు వినియోగించకుండా  తయారు చేసి విక్రయిస్తే అదనంగా రెండు వేల వరకు ఆదాయం సమకూరుతోంది. రవాణా, చిల్లర ఖర్చులు కూడా మిగులుతున్నాయి.  గతంలో తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీకి చెరకును ఎక్కువగా సరఫరా చేసేవారం. అది మూతపడటంతో ప్రస్తుతం చిన్న బెల్లం దిమ్మల తయారీని ఎంచుకున్నాం.ఎక్కువ మంది రైతుల జీవనోపాధికి ఉపయోగపడే  సుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం మళ్లీ  తెరిపిస్తే రైతులకు పూర్వ వైభవం రావడానికి అవకాశం కలుగుతుంది.                                
– చిన్ని కోటేశ్వరరావు, రైతు, తాళ్లపాలెం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
JAGGERY
Jaggery farmers
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.