Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మరీ ఇంత మోసమా బాబూ!
ADVERTISEMENT 

మరీ ఇంత మోసమా బాబూ!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 29, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aperc.jpg

18 నెలల్లో రూ.20 వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారమా ! 

అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామన్నారు 

ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణలో ప్రభుత్వాన్ని నిలదీసిన జనం 

తిరుపతి, విజయవాడ, కర్నూలులో ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ 

వినియోగదారుల అభ్యంతరాలకు సమాధానం చెప్పలేకపోయిన సీఎండీలు 

విద్యుత్‌ నియంత్రణ మండలి దుస్థితిపై తీవ్ర అసంతృప్తి 

సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని.. అవసరమైతే ఉన్న చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్ల చార్జీల భారాన్ని వేయడం అన్యాయమని, నమ్మినందుకు ఇంతగా మోసం చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్‌ రెవెన్యూ రిక్వైర్‌మెంట్‌–ఏఆర్‌ఆర్‌), రిటైల్‌ టారిఫ్‌ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) నాలుగు రోజులపాటు బహిరంగ విచారణ నిర్వహించింది. 

ఈ నెల 20న తిరుపతిలో మొదలుపెట్టి.. 22, 23 తేదీల్లో విజయవాడ, 27న కర్నూలులో బహిరంగ విచారణల ద్వారా 71 మంది నుంచి అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏపీఈఆర్‌సీ స్వీకరించింది. నేరుగా 32 మంది, వర్చువల్‌ (ఆన్‌లైన్‌) ద్వారా 39 మంది అభ్యంతరాలను వెల్లడించారు. బహిరంగ విచారణలో వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్‌సీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. దాని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొత్త టారిఫ్‌ అమలులోకి వస్తుంది.  

చేస్తాం.. చూస్తాం 
బహిరంగ విచారణలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై విద్యుత్‌ సంస్థల సీఎండీలు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి వచి్చన అభ్యంతరాలకు వివరణ ఇచ్చారు. స్మార్ట్‌ మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని అందిన ఫిర్యాదులపై సీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి స్పందిస్తూ.. కెపాసిటర్లు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్లనే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. 

ప్రభుత్వ విభాగాల విద్యుత్‌ బకాయిలను, ప్రైవేటు సంస్థల బకాయిలను, కుప్పం రెస్కో బకాయిలను ఎందుకు వసూలు చేయలేదని వచ్చిన ప్రశ్నలపై ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ తోలేటి స్పందిస్తూ.. వాటిలో అధిక శాతం కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలిపారు. కుప్పం రెస్కోకు టారిఫ్‌ను నిర్ణయించాల్సిందిగా ఏపీ ఈఆర్‌సీని సీఎండీ కోరారు. టైమ్‌ ఆఫ్‌ డే బిల్లింగ్‌లో పీక్, ఆఫ్‌ పీక్‌ అవర్స్‌కు వేస్తున్న విద్యుత్‌ చార్జీలు, ఆక్వా రంగంలో విద్యుత్‌ సమస్యలపై వచి్చన ఫిర్యాదులకు ఈపీడీసీఎల్‌ సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌ వివరణ ఇచ్చారు. 

వివిధ వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్‌ను గతం నుంచీ ఇస్తున్నట్టుగానే ఇకపైనా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధన శాఖ అదనపు కార్యదర్శి కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఈ మొత్తం బహిరంగ విచారణలో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు వంటి మెటీరియల్‌ కొనుగోళ్లపై ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వచ్చే రెండు నెలల్లోగా ఏపీఈఆర్‌సీ నిబంధనలు (రెగ్యులేషన్‌) రూపొందిస్తుందని చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి ప్రకటించారు. 

తొలి ఏడాదే రూ.15 వేల కోట్ల భారం 
వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి ఏపీఈఆర్‌సీ సభ్యుడైన పీవీఆర్‌ రెడ్డి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా భారం వేశారని, తర్వాత వేసిన వాటితో కలిపి ఇప్పటి వరకూ 4 విడతల్లో రూ.20 వేల కోట్లకుపైగా భారం మోపడంతో విద్యుత్‌ బిల్లులు రెట్టింపు అయ్యాయని, దీనిపై ఏపీఈఆర్‌సీ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరారు. 

డిస్కంలు ట్రూ అప్‌ పేరుతో వాస్తవ లెక్కలు కాకుండా అత్యధికంగా ప్రతిపాదనలు ఇస్తున్నారని, అది సమంజసం కాదని మండిపడ్డారు. జాతీయ రహదారులపై ఉండే వీధి దీపాలకు గ్రామాల పరిధిపి కేటగిరీ–4లో చేర్చాలని జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు కోరారు. వాటర్‌ ప్లాంట్‌ వ్యాపారులకు విద్యుత్‌ బిల్లులు కేటగిరీ–2లోకి మార్చడం వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయని, వీటిని కేటగిరీ–3లోకి మార్చాలని వాటర్‌ ప్లాంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజయవాడ, కర్నూలులో విజ్ఞప్తి చేశారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
power distribution companies
Electricity Charges
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.