Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అభిమానులతో ఏసీఏ ఆటలు
ADVERTISEMENT 

అభిమానులతో ఏసీఏ ఆటలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1111.jpg

వన్డే క్రికెట్‌ టికెట్ల అమ్మకాల్లో ఏసీఏ దొంగాట  

డిస్ట్రిక్ట్ యాప్‌లో విక్రయిస్తున్నామంటూ ప్రచారం

అరగంటపాటు ఆన్‌లైన్‌లో వేచిచూసినా నిరాశే 

‘ఇతర ఫ్యాన్స్‌’ బుకింగ్‌ చేస్తున్నారంటూ సమాచారం 

గడువు ముగిసేవరకు ఇదేవరస  

టికెట్లు దొరక్క క్రికెట్‌ అభిమానుల ఆవేదన  

దొంగచాటుగా విక్రయిస్తున్నారనే విమర్శలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్‌ అభిమానులతో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆటలాడుతోంది. ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్నామని చెబుతున్న ఏసీఏ.. చివరకు బుకింగ్‌కు వెళ్లేసరికి మొండిచేయి చూపుతోంది. గంటలకొద్దీ వేచిచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. డిస్ట్రిక్ట్‌ యాప్‌లో క్రికెట్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుందన్న సమయానికి అరగంట ముందు నుంచే ఆన్‌లైన్‌లో వేచిచూస్తున్న అభిమానులకు మొదట్లో మీముందు ఇంకా 30 వేలమంది ఉన్నారంటూ సమాచారం వస్తోంది. 

మరో అరగంటకుపైగా వేచిచూసిన తర్వాత... సరిగ్గా టికెట్లు సెలెక్ట్‌ చేసుకుని బుకింగ్‌ చేసే సమయానికి.. ‘హోల్డ్‌ రైట్‌.. టికెట్లను హోల్డ్‌లో ఉంచాం. ఇతర ఫ్యాన్స్‌ వారి బుకింగ్‌ను పూర్తిచేస్తున్నారు. అప్పటివరకు ఆగండి..’ అంటూ సమాచారం వస్తోంది. బుకింగ్‌ కోసం కేటాయించిన 10 నిమిషాలు పూర్తయ్యేవరకు ఈ సమాచారమే కనిపిస్తోంది.

చివరకు సమయం అయిపోవడంతో టికెట్లు బుకింగ్‌ కాకుండానే ఫ్యాన్స్‌ నిరాశకు గురికావాల్సి వస్తోంది. అయితే ‘ఇతర ఫ్యాన్స్‌’ ఎవరు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇతర ఫ్యాన్స్‌ పేరిట టికెట్లను బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆన్‌లైన్‌ పేరుతో ఆటలు
వాస్తవానికి భారత్‌–దక్షిణాఫ్రియా సిరీస్‌లో విశాఖ వేదికగా జరగనున్న మూడో వన్డే కీలకంగా మారింది. ఇప్పటికే రెండుజట్లు చెరో మ్యాచ్‌ గెలవడంతో సిరీస్‌ గెలిచేందుకు విశాఖ వన్డే ఫలితమే కీలకంగా మారింది. దీంతో ఈ వన్డేను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాకుండా రోహిత్, కోహ్లి (రో–కో) ఈ మ్యాచ్‌లో ఆడుతుండటంతో అభిమానుల నుంచి టికెట్ల కోసం భారీగా డిమాండ్‌ ఉంది. అదేవిధంగా విశాఖ స్టేడియంలో భారత్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

 ఇప్పటివరకు ఈ స్టేడియంలో భారత్‌ 10 మ్యాచ్‌లు ఆడగా... 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ డ్రాగా ముగించింది. ఇదే స్టేడియంలో రోహిత్‌కు, కోహ్లికి వ్యక్తిగతంగా మంచి రికార్డులున్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్‌ ఫలితం తేల్చే ఈ మ్యాచ్‌పై సహజంగానే క్రికెట్‌ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంది. సరిగ్గా ఇదే అభిమానాన్ని ఏసీఏ సొమ్ముచేసుకుంటోందనే విమ­ర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పటికే వివిధ స్టాండ్ల టికెట్‌ ధరలను పెంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. దీనికితోడు ఏసీఏలోని కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌ ధరలకు టికెట్లను కొనుగోలు చేసి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో సరిగ్గా టికెట్లను బుక్‌ చేసుకునే సమయా­నికి ‘ఇతర ఫ్యాన్స్‌’ పేరిట తరలివెళుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Andhra Cricket Association
India
Cricket match
south africa
tickets
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.