Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. క్రెడిట్‌ చోరీ.. బాబు బాటలో పవన్‌
ADVERTISEMENT 

క్రెడిట్‌ చోరీ.. బాబు బాటలో పవన్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 6, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pk.jpg

ఐదేళ్ల కిందటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీడీవోలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హడావుడి

వైఎస్‌ జగన్‌ హయాంలోనే పంచాయతీరాజ్‌ శాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టుల సృష్టి 

గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం కోసం ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం 

అదనపు సిబ్బంది, కారు, కార్యాలయాల నిర్వహణకు నిధుల కేటాయింపు

33 ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఎంపీడీవోలకు డీడీవోలుగా ప్రమోషన్‌ 

ఐదేళ్ల నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న అధికారులు 

నాడు డీఎల్‌డీవోగా వ్యవహరించగా.. నేడు డీడీవోగా మార్చిన బాబు సర్కారు 

కొత్త వ్యవస్థ, కార్యాలయాలు ప్రవేశపెట్టింది జగన్‌.. తన ఆలోచనలుగా చెప్పుకొన్న పవన్‌

సాక్షి, అమరావతి: ఎగవేతలు... అడ్డగోలు కోతలు తప్ప ఏడాదిన్నర నుంచి చేసిన మంచి పని ఒక్కటీ లేదు..! చెప్పుకోవడానికి ఏమీ లేదు..! దీంతో చంద్రబాబు సర్కారు గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల క్రెడిట్‌ చోరీకి పాల్పడుతోంది...! వైఎస్సార్‌సీపీ హయాంలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను యథేచ్ఛగా తన ఖాతాలో వేసుకుంటోంది..! 

వైఎస్‌ జగన్‌ వినూత్న ఆలోచ­నలను చంద్రబాబు ప్రభుత్వం అటుఇటు మార్చి తమ గొప్పలుగా చెప్పుకుంటోంది. వేగంగా జరుగుతున్న ఈ క్రెడిట్‌ చోరీలో సీఎం చంద్రబాబు దారిలోనే ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ వెళ్తున్నారు. పవన్‌ గురువారం 77 డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాలను (డీడీవో) ప్రారంభిస్తూ, అవి తన ఆలోచన నుంచి పుట్టాయంటూ ప్రకటించుకున్నారు. కానీ, వాస్తవం మాత్రం వేరు. 

మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మచిలీపట్నం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆపీసు   


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గ్రామ సచివాలయ భవనంలో  ప్రారంభించిన డీడీవో కార్యాలయం  

దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించి
పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో 1987లో మండల వ్యవస్థను తీసుకురాగా... కీలకమైన ఎంపీడీవోలకు 33 ఏళ్ల పాటు పదోన్నతులు లేవు. ఈ పరిస్థితుల్లో  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి వ్యవస్థను తెచ్చారు. అప్పటివరకు ఎంపీడీ­వో­లు వేర్వేరు సంఘాలుగా వేరుపడి సీనియా­రి­టీ జాబితాపై వాళ్లలో వాళ్లే కోర్టుల్లో కేసులు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవ చూపి... గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకు­నేలా డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టులను ప్రవేశ­పెట్టింది. ఈ మేరకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించింది. అలా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఐదేళ్ల కిత్రం 2020 సెప్టెంబరులో ‘డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాల­యా­ల’ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ కార్యాలయాల్లో సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర సిబ్బందితో ఏడుగురు చొప్పున నియామకానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 30న జీవో నంబరు 674ను జారీ చేసింది. దీంతోపాటు కార్యాల­యాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్‌ కొనుగోలు­తో పాటు అద్దెకు కారు వాడుకునేలా, ఇతర నిర్వహణ ఖర్చులకు సైతం నిధులు కేటాయించింది. 


తద్వారా పెద్దఎత్తున ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఊరూవాడా అందరికీ అందేలా కృషి చేసింది. సుదీర్ఘ కాలం ఎదురుచూపులకు తెరపడుతూ డీడీవోలుగా పదోన్నతి పొందిన ఉత్సాహంతో అధికారులు సైతం సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించారు.

అక్షరం మార్చేసి అదే కొత్తగా ప్రచారం
ఉప ముఖ్యమంత్రి పవన్‌ సొంత ఆలోచనగా ప్రకటించుకున్న డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాలు (డీడీవో) ఐదేళ్లుగా రాష్ట్రమంతా పనిచేస్తూనే ఉన్నాయి. కానీ, కొత్తవి అన్నట్లుగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డీడీవోలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో సంక్షిప్తంగా డీఎల్‌డీవోలుగా పిలిచేవారు. ఎంపీడీవోల నుంచి పదోన్నతి పొందిన నేపథ్యంలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి హోదాను డీఎల్‌డీవోగా కొనసాగించారు. 

కాగా, బాబు సర్కారు ప్రస్తుతం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి హోదాలో డివిజనల్‌ అన్న పదానికి సంక్షిప్తంగా ‘డీఎల్‌’కు బదులు కేవలం ‘డీ’ని మాత్రమే పేర్కొంటూ... డీఎల్‌డీవోను డీడీవోగా మార్చింది. గతంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో డివిజనల్‌ పంచాయతీరాజ్‌ అధికారి (డీఎల్‌పీవో), డ్వామా (ఉపాధి హామీ పథకం) ఏపీడీ కార్యాలయం, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీఎల్‌డీవో) కార్యాలయాలు వేర్వేరుచోట్ల పనిచేశాయి. 

బాబు ప్రభుత్వం డీఎల్‌పీవోతో పాటు ఉపాధి హామీ ఏపీడీ కార్యాలయాలను కూడా డీడీవో కార్యాలయంలోనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఒకేచోట ఉన్నప్పటికీ, డీడీవో కార్యాలయాల్లో డీడీవో పర్యవేక్షణలో డీఎల్‌పీవోలు, ఉపాధి హామీ ఏపీడీలు వేర్వేరుగా పనిచేస్తారని పంచాయతీరాజ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

గ్రామ సచివాలయాల్లోనేఈ కార్యాలయాలు
డిప్యూటీ సీఎం పవన్‌ ప్రారంభించిన డీడీవో కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం నిర్మించినవి కాకపోవడం గమనార్హం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతి ఊరిలో రెండంతస్తులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను డీడీవో కార్యాలయాలకు వాడుకుంటున్నట్లు పంచాయతీరాజ్‌ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కింది అంతస్తులో గ్రామ సచివాలయం ఉండగా, పైఅంతస్తును డీడీవో కార్యాలయాలకు కేటాయించారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Panchayati Raj Department
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Pawan Kalyan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.